ADVERTISEMENT
home / వెెడ్డింగ్
కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం

కెరీర్ బాటకు వివాహాలు ప్రతిబంధకాలు కావు: సమంత సినీ ప్రస్థానం

కెరీర్ ఊపు మీదున్న సమయంలో నటీనటులు పెళ్లి జోలికి వెళ్లడం చాలా అరుదు అనే చెప్పాలి. ముఖ్యంగా నటీమణులు అయితే తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు “పెళ్ళెప్పుడు?” అన్న ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడరు. దీనికి ప్రధాన కారణం పెళ్లి తరువాత వారికి ఉన్న అభిమానుల సంఖ్య తగ్గిపోతుంది అన్న ఒక భావన వాళ్ళ మనస్సులో నాటుకుపోవడమే .

అయితే ఈ స్టీరియో టైపు ఆలోచనకి హిందీలో నటీమణులు చెక్ పెడుతూ ఈ మధ్యనే నలుగురు స్టార్ హీరోయిన్స్ – అనుష్క శర్మ , సోనమ్ కపూర్ , దీపిక పదుకొనే & ప్రియాంక చోప్రాలు తమ కెరీర్ బాగుండగానే వివాహబంధంలోకి అడుగుపెట్టేశారు. అయితే.. ఇటువంటి పరిస్థితి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేదనే చెప్పాలి.

అన్నింటి కంటే ముఖ్యముగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నటి సమంత (Samantha Ruth Prabhu) ఈ స్టీరియో టైప్ ఆలోచనలను బ్రేక్ చేస్తూ తన పెళ్లి అయిన తరువాత నటించిన రంగస్థలం, మహానటి , U – టర్న్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో.. పెళ్లి తరువాత హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని ఉన్న అపోహని ఈ అక్కినేని కోడలు బద్దలు కొట్టేసింది అని చెప్పొచ్చు.

ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఈగ, రాజు గారి గది 2, అత్తారింటికి దారేది, మనం, ఎటో వెళ్ళిపోయింది మనసు, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. తమిళంలో కూడా 24, కత్తి, మెర్సెల్ మొదలైన చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

ADVERTISEMENT

ఇక ఇప్పటికే మరో మూడు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్.. ఇచ్చిన సమంత అందులో ఒక చిత్రంలో తన భర్త నాగ చైతన్యతో కలిసి నటిస్తుండడం విశేషం .

మరి సమంత బాటలో ఇంకెవరైనా హీరోయిన్స్ పెళ్లి చేసుకుని కూడా నటనని కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి …

 

13 Dec 2018
good points

Read More

read more articles like this
ADVERTISEMENT