2018 ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో.. టాప్ 29 రొమాంటిక్ జంటలు వీరే..!

2018 ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో.. టాప్ 29 రొమాంటిక్ జంటలు వీరే..!

2018 సంవత్సరంలో మన భారతదేశంలో అనేక వివాహాలు జరిగి ఉండవచ్చు. ఎందరో కళ్యాణ బంధంలోకి అడుగుపెట్టి.. కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉండవచ్చు. అయితే ఇలాంటి జంటల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని కూడా విపరీతంగా పెంచుకున్న జంటలు అనేకం ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో భాగంగా కొత్త జంటలు తీసుకున్న అనేక సెల్ఫీలు, ఫోటోలు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ట్విటర్ లాంటి వేదికల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎంతో ఫాలోయింగ్‌ని కూడా దక్కించుకున్నాయి. అలాంటి జంటల్లో కొందరి ఫోటోలు మీకోసం ఈ రోజు ప్రత్యేకంగా పోస్ట్ చేస్తున్నాం.


ప్రేమంటే ఇదేరా..
ఓ చారిత్రక ప్రాంతానికి వెళ్లి ఓ జంట తీసుకున్న ఈ ఫోటోకి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఆదరణ లభించింది.Image Courtesy : Gireesh Chalakudy on Instagram


ఒట్టేసి చెబుతున్నా..
తనకు కాబోయే భార్య చేతిలో చేయేసి నేనున్నానంటూ.. ఓ ప్రేమ పిపాసి ఇచ్చిన ఈ స్టిల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.Image Courtesy : Gireesh Chalakudy on Instagram


ఊహలు గుసగుసలాడే
ఇండియా గేట్ వద్ద ఓ జంట తీసుకున్న ఈ ఫోటో.. వారి ఊహలు గాల్లో తేలియాడుతున్న ఫీలింగ్‌ను కలిగిస్తోంది కదా.Image Courtesy : Gireesh Chalakudy on Instagram


ప్రేమాలయం
తాజ్ మహల్ బ్యాక్ గ్రౌండ్‌గా ఓ జంట తీసుకున్న ఈ రొమాంటిక్ చిత్రం.. కొత్త జంటలకూ రొమాంటిక్ ఫీలింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.Image Courtesy : Gireesh Chalakudy on Instagram


ప్రేమ పక్షులు
అజ్మీర్ కోట బ్యాక్ గ్రౌండ్‌లో.. పక్షుల కిలకిలరావాల మధ్య ఓ కొత్త జంట తీసుకున్న ఈ ఫోటో లుక్ చాలా బాగుంది కదాImage Courtesy : The Photo Mantra on Instagram


కలిసి నడుద్దాం..
తాజ్ మహల్ బ్యాక్ గ్రౌండ్‌లో తీసుకున్న ఈ చిత్రం కూడా వైరైటీగా ఉందని అనుకోవచ్చు.Image Courtesy : Artistry_png on Instagram


ఏ మంత్రం వేసావే
పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఓ జంట.. అండర్ వాటర్‌లో తీసుకున్న ఈ చిత్రాలు మిమ్మల్ని కూడా మంత్ర ముగ్ధుల్ని చేశాయి కదా.
 


Image Courtesy : The Photodiary3 on Instagram


ఓరి.. నీ ప్రేమ బంగారం కానూ..!
పూర్తి దేశీ లవ్ స్టైల్‌లో ఓ కొత్త జంట తీసుకున్న ఈ చిత్రం కిరాక్‌గా ఉంది కదా..Image Courtesy : Hiren Makwana Photography on Instagram


మనసుంటే చాలు
మనసుంటే చాలు.. నువ్వు ఎంత బరువున్నా.. నిన్ను ఎత్తేయగల సత్తువ నా సొంతం అని ప్రియుడు ప్రేయసితో అంటున్నట్లు ఉంది కదా ఈ చిత్రం.Image Courtesy : Studio P3 on Instagram


ప్రేమకు వేళాయెరా
ఓ ఫారెస్ట్ ఏరియాలో ఓ కొత్త జంట తీసుకున్న ఈ చిత్రం.. అనంతమైన ప్రేమతో కూడిన దాంపత్య బంధానికి స్వాగతం చెబుతున్నట్లు ఉంది కదా.Image Courtesy : Clouds Picture Photography on Instagram


నువ్వు నేను
మంచు కొండల్లో ఒంటరి పక్షుల్లా ఓ అమ్మాయి, అబ్బాయి తీసుకున్న ఈ చిత్రం వెరైటీగా ఉందని అనుకుంటున్నారా..?Image Courtesy : Gireesh Chalakudy on Instagram


 


తొలి ముద్దు
దాంపత్య బంధంలోకి అడుగుపెడుతున్న ఓ జంట తీసుకున్న ఈ చిత్రం.. తొలి ముద్దు తియ్యదనంలోని ఆనందాన్ని చూపిస్తున్నట్లు ఉంది కదా.Image Courtesy : The Foto Mantra on Instagram


ప్రేమించుకుందాం..రా
ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో.. పెళ్లి చేసుకొన్నాక ప్రేమలో పడడంలో కూడా అంతే ఆనందం ఉంది. అలా ప్రేమలో పడిన ఓ జంట తొలి కలయిక ఎలా ఉంటుందో ఈ చిత్రం చెప్పకనే చెబుతుంది.Image Courtesy : Oragraphy on Instagram


చూపులు కలిసిన శుభవేళ
పెళ్లి చేసుకొని.. ఇంటికి ప్రియమైన భార్యలను ఇంత ముచ్చటగా తీసుకెళ్లే భర్తలు కూడా ఉంటారాImage Courtesy : Gireesh Chalakudy on Instagram


పడి పడి లేచె మనసు
మనసు లోతుల్లో దాగున్న ప్రేమ ఒక్కసారిగా బయటపడితే.. ఆ జంట కళ్లలో కనిపించే ఆనందం వర్ణనాతీతం కదా. ఈ చిత్రాన్ని చూస్తే మీకూ అదే ఫీలింగ్ కలుగుతోందాImage Courtesy : Avinash Jadhav Photography on Instagram


నన్ను దోచుకొందువటే
ఒకే పందిరిలో ప్రేయసీ ప్రియులిద్దరూ దోబూచులాడుతున్నట్లు ఉన్న ఈ చిత్రం.. రొమాంటిక్ ఫీలింగ్‌కు సిసలైన నిర్వచనాన్ని ఇస్తుంది కదా.
Image Courtesy : Click2remember on Instagram


ప్రేమ యుద్ధం
వావ్.. ఇంత స్టైలిష్‌గా వారియర్ గెటప్స్‌లో ఫోటోలు దిగే కొత్త జంటలూ ఉంటాయా
Image Courtesy : Harsh Salvi Photography on Instagram


 


ప్రేమ ప్రయాణం
తనతో ప్రేమ ప్రయాణానికి సిద్ధమైన ఈ రాకుమారిని.. ఆ రాకుమారుడు ఏ  నందనవనానికి తీసుకెళ్తాడో అన్న ఫీలింగ్ ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది కదా
Image Courtesy : Photoholic on Instagram


ప్రేమ పుస్తకం
కొత్తగా పెళ్లి అయిన ఆలుమగలిద్దరికీ పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం ఉంటే.. ఇలాంటి ఫోటో ట్రై చేయవచ్చేమోImage Courtesy : The Foto Mantra on Instagram


కుదిరితే కప్పు కాఫీ
పెళ్లి చేసుకోబోయే వారిద్దరూ కాఫీ ప్రియులైతే.. ఆ మజాయే వేరుImage Courtesy : The Foto Mantra on Instagram


ఉలవచారు బిర్యానీ
పెళ్లి చేసుకొనే వారిద్దరూ తిండి ప్రియులైతే.. ఇక అంతకన్నా ఆనందం ఏముంది..! పాలునీళ్లలా కలిసిపోయి ఓ రోజు ఉలవచారుతో.. మరో రోజు బిర్యానీతో కాపురాన్ని హాయిగా ఎంజాయ్ చేసేస్తారనడంలో సందేహం లేదు.Image Courtesy : The Foto Mantra on Instagram


లవ్ జర్నీ
భార్యతో చేసే లవ్ జర్నీని ఇంత చక్కగా ఆస్వాదించగలిగే భర్తలకు ఈ చిత్రం అంకితం అనవచ్చేమోImage Courtesy : Stories By Vivek Sharma on Instagram


తూనీగ తూనీగ
తూనీగలా గాల్లోకి ఎగురుతున్న భార్యతో ఇలా ఫోటో దిగాలని ఏ భర్తకు ఉండదు చెప్పండి.Image Courtesy : The Foto Mantra on Instagram


100% లవ్
అమ్మో.. భార్యపై 100% లవ్ ఉంటేనే భర్త ఇలాంటి ఫోటోలకు ఫోజిస్తాడేమోImage Courtesy : The Foto Mantra on Instagram


ఫిదా
పెళ్లయ్యాక భార్యతో కలిసి ఇలాంటి చోట ఫోటో దిగాలని భావించే భర్తలు కూడా ఉంటారా.. అయినా.. ఇలాంటి ఐడియాలకే కొందరు ఫిదా అయిపోతారని అనుకోవచ్చు.


ప్


Image Courtesy : The Photo Mantra on Instagram


POPxo ఇప్పుడు ఆ ఆరు భాషల్లో పాఠకులకు సమాచారాన్ని అందిస్తోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ & బంగ్లా


మీ బాయ్ ఫ్రెండ్‌కి ప్రత్యేకం.. ఈ 21 రొమాంటిక్ సందేశాలు.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


అబ్బాయిలకు అమ్మాయిల్లో కనిపించే 9 రొమాంటిక్ అంశాలివే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


ఆలుమగలు సందర్శించదగ్గ 35 రొమాంటిక్ ప్రదేశాలివే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి