ADVERTISEMENT
home / వినోదం
సోషల్ మీడియాలో అమ్మాయిలకు..  ఈ ఆరు పనులూ చాలా చాలా ప్రత్యేకం

సోషల్ మీడియాలో అమ్మాయిలకు.. ఈ ఆరు పనులూ చాలా చాలా ప్రత్యేకం

ఉత్తరం , దక్షిణం , ఈశాన్యం , పశ్చిమం .. ఇలా దిక్కులేవైనా .. ఈ రోజూ అమ్మాయిలు … తాము ఎప్పటికప్పుడు చేసే పనులన్నీ ప్రపంచానికి తెలియచేసేలా ఫోటోలు, సెల్ఫీలు తీయడం.. వాటిని తమ తమ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తుండడం చాలా పరిపాటిగా మారిపోయింది ..

అలా చేసే వారిలో ఎక్కువమంది ఈ క్రింద చెప్పబోయే ఆరు పనులని తప్పనిసరిగా చేస్తుంటారు .. ఇంతకీ అవి ఏమిటంటే

 

1. ఫోటో ఫస్ట్ .. ఫుడ్ నెక్స్ట్ ..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే ఫోటోలలో అధిక శాతం ఫుడ్ ఐటమ్స్ ఉంటున్నాయి . ఏదైనా రెస్టారెంట్ లేదా ఫుడ్ కోర్టుకి వెళ్ళి తమకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం , అది రాగానే ముందు దానిని తినకుండా ఆ ఫుడ్ ఐటమ్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ రోజు అమ్మాయిలు చేస్తున్న మొదటి పని.

ADVERTISEMENT

 

2. ఫోటో ఫిల్టర్స్

ఇక రెండో పనేంటి అంటే … సెల్ఫీ. ఈ రోజు అమ్మాయిలు ప్రతి రోజు తీసే ఫోటోలలో 90 శాతం ఫోటోలు సెల్ఫీలు అంటే కచ్చితంగా నిజమనే చెప్పాలి. అయితే ఇప్పుడు వాడుకలో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లలో ఉండే ఫోటో ఫిల్టర్స్ వాడి సదరు సెల్ఫీలను ఆకర్షణీయంగా తయారుచేసి పోస్ట్ చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది.

 

ADVERTISEMENT

3. ఆకట్టుకునే డ్రెస్ …

సాధారణంగా అమ్మాయిలు తాము ఫోటో దిగే సమయంలో ఎటువంటి డ్రెస్ వేసుకున్నారు … ఆ డ్రెస్ ఏ డిజైనులో ఉందనేది కూడా చాలా శ్రద్ధగా ఈ రోజు వారు గమనిస్తున్నారనేది నిజం. సెల్ఫీల్లో లేదా ఫొటోల్లో తాము ఎంత ఆకర్షణీయంగా ఉన్నామనే విషయాన్ని కూడా వారు ఆలోచిస్తారు అనేది కూడా వాస్తవమే.

4. హ్యాష్ ట్యాగ్ (#)

ఈ రోజు అమ్మాయిలు తాము ఫోటో తీసుకునే సందర్భాన్ని బట్టి , అవసరాన్ని బట్టి ఆ ఫోటోకి సంబంధించిన వివరాలని హ్యాష్ ట్యాగ్స్ రూపంలో చెప్పడానికి కూడా వెనుకాడడం లేదు ###. అయితే ఈ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే కాకుండా.. కొందరైతే తమకు సంబంధించిన ఫన్నీ ఫన్నీ ఫోటోలు లేదా సెల్ఫీలు కూడా వీలైనన్ని ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.. అవి కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.

 

ADVERTISEMENT

5. లైక్ & షేర్ …

ఫోటోలు దిగడం.. వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడం అనేది ఈ రోజు సర్వసాధారణం . అయితే ఆ ఫోటోలు తమ స్నేహితులకి , ప్రియమైనవారికి , కుటుంబసభ్యులకు నచ్చాయో లేదో అనేది తెలిసేది మాత్రం ఈ లైక్ & షేర్ వల్లే అని చెప్పవచ్చు . ఈరోజుల్లో మనం పోస్ట్ చేసే ఫొటోలకి ఎంత స్థాయిలో లైక్ & షేర్ లు లభిస్తే అంతలా మన చిత్రాలకి ఆదరణ ఉన్నట్టుగా కూడా ఒక అభిప్రాయానికి వచ్చేయొచ్చు.

 

6. సెలబ్రిటీల దారిలో ..

ఎక్కువగా మనం సోషల్ మీడియాలో అనుసరించేది సెలబ్రిటీలనే ! వారు ఫాలో అవుతున్న ట్రెండ్స్ , మరీ ముఖ్యంగా వారి స్టైల్ స్టేట్మెంట్ ని అనుసరించే వారు ఈ రోజు అమ్మాయిల్లో లక్షల్లో ఉంటారు . ఒక సారి వారి స్టైల్ పాపులర్ అయితే.. వారికున్న ఫాలోయింగ్ కూడా ఇట్టే పెరిగిపోతుంది అని చెప్పొచ్చు . ఈ రోజుల్లో చాలామంది ఫాలోయింగ్ ఉన్న వారి అకౌంట్ కి తమ ఫోటోని కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ ఫోటో కూడా ఎక్కువమందికి రీచ్ అవుతుందనే స్ట్రాటజీతో ఈ పని చేస్తున్నారు.

సోషల్ మీడియాలో తమ ఫోటోలని ఎక్కువగా పోస్ట్ చేసే అలవాటు ఉన్న వారు ఈ పైన చెప్పిన ఆరు అలవాటులలో ఏదో ఒక్కటైనా కచ్చితంగా ఫాలో అవ్వడం అనేది పక్కా ..

ADVERTISEMENT

అయితే మీరు సోషల్ మీడియాలో చేసే ఈ పనులు అన్నింటికీ ముఖ్య కారణం సెల్ఫీలు అంటే నమ్ముతారు కదా. అయితే ఇలాంటి అత్యద్భుతమైన సెల్ఫీలకు కారణం OPPO F7 అంటే మీరు కచ్చితంగా నమ్మాల్సిందే.

 

06 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT