హైదరాబాద్‌లో న్యూ ఇయర్ స్పెషల్ 'కేక్స్'కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ స్పెషల్ 'కేక్స్'కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

మన జీవితంలో ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలనే ఆలోచన వస్తే.. వెంటనే గుర్తొచ్చేది "కేక్".  అది పుట్టినరోజు అయినా కావచ్చు. లేదా పెళ్లిరోజు అయినా కావచ్చు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలంటే "కేక్"  కట్ చేయాల్సిందే అన్న ట్రెండ్ ఇప్పటి రోజుల్లో పెరిగిపోయింది. 


ముఖ్యంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి నెలల్లో ఈ కేకులకు మంచి గిరాకీ ఉంటుందన్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం క్రిస్మస్ (Christmas) సీజన్‌తో పాటుగా న్యూ ఇయర్ (New Year) వేడుకలు ఆ నెలల్లోనే జరగడం.  


అయితే జనాలు ఎంతో  ఆదరిస్తూ.. రుచి చూసే ఈ 'కేక్' అనేక వెరైటీల్లో తయారవుతుంది అంటే అతిశయోక్తి కాదు. మన హైదరాబాద్‌లో కూడా పలుచోట్ల వివిధ రకాల కేకులు దొరుకుతున్నాయి.... అదేంటి కేక్  ఎక్కడైనా దొరుకుతుంది కదా.. దానికోసం ఇప్పుడు ఒక ఆర్టికల్ రాయాలా అని మీరు అనుకోవచ్చు. అయితే మామూలు రోజుల్లో "కేక్" తినడం వేరు.. నూతన సంవత్సరం సందర్భంగా లేదా క్రిస్మస్ సమయంలో వివిధ రకాల కేకులను తిని ఎంజాయ్ చేయడం వేరు. ఈ క్రమంలో భాగ్యనగరంలో వివిధ వెరైటీల కేకులను ప్రత్యేకంగా తయారుచేసే బేకరీల జాబితాను మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. 

కరాచీ  బేకరీ (Karachi Bakery) - హైదరాబాద్‌లో అన్ని బ్రాంచెస్


ప్యారడైస్ బేకరీ (Paradise Bakery) - హైదరాబాద్‌లో అన్ని బ్రాంచెస్


నిమ్రా బేకరి (Nimrah Bakery) - చార్మినార్


బికనేర్వాల బేకరీ (Bikanerwala Bakery) - బంజారా హిల్స్


కేఫ్ నిలోఫర్ (Cafe Niloufer) - లక్డికాపూల్


మెరైన్  బేకరీ (Morine Bakery) - నానాల్  నగర్, మెహదీపట్నం


పిస్తా  హౌస్ (Pista House) - చార్మినార్


యూనివర్సల్ బేకరీ (Universal Bakery) - NMDC, మాసబ్ ట్యాంక్ 


లెబోనల్ ఫైన్ బేకింగ్ (Lebanol Fine Baking) - రోడ్ నెం 3, బంజారా హిల్స్


కాంక్యు కేక్స్ (Concu Cakes) - రోడ్ నెం 37, జూబ్లీ హిల్స్


కేఎస్ బేకర్స్ (KS Bakers) - కూకట్ పల్లి


బెంగళూరు అయ్యంగార్  బేకరీ (Bengaluru Iyengar Bakery) - కూకట్ పల్లి 


సుభాన్ బేకరీ (Subhan Bakery) - నాంపల్లి


స్విస్ క్యాజిల్ (Swiss Castle) - నారాయణగూడ & సికింద్రాబాద్ & బంజారా హిల్స్


గిల్ట్  ట్రిప్ (Guilt Trip) - బంజారా హిల్స్


టెస్టా రోసా కేఫ్ (Testa Rossa Cafe) -  బంజారా హిల్స్


ఆల్మండ్ హౌస్ (Almond House) - హిమాయత్ నగర్


క్రీమ్ స్టోన్ కాన్సెప్ట్స్ (Cream Stone Concepts) - బంజారా హిల్స్ 


వెల్వెట్ కేక్స్ (Velvet Cakes) - హైటెక్ సిటీ


 

ఈ కేక్ అవుట్ లెట్స్ మాత్రమే కాకుండా మన జంట నగరాల్లో ఇంకా ఎన్నో మంచి బేకరీలు, కేఫ్‌లు ఉన్నాయి. ఇక్కడ కేవలం కొన్నింటి గురించి మాత్రమే తెలియజేయడం జరిగింది. ఇది చదివాక మేము ఏదైనా ప్రముఖ బేకరీ లేదా కేఫ్ గురించి ఇక్కడ పేర్కొనకపోతే మీరు క్రింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయవచ్చు. మేము దానిని ఈ జాబితాలో చేరుస్తాము.


ఇక మీకు నచ్చే.. మీరు మెచ్చే కేక్స్ ఎక్కడ దొరుకుతాయో అన్న సమాచారం తెలిసిపోయిందిగా.. ఇంకెందుకు లేట్.. ఆలస్యం చేయకుండా మీ నచ్చిన కేక్ కొని ఎంజాయ్ చేయండి.  ఈ హాలిడే  సీజన్‌‌లో మంచి నోరూరించే కేక్‌ని ఆస్వాదించండి.


మీ అందరికి మా తరపున హ్యాపీ హాలిడేస్...


Image: Pixabay


ఇవి కూడా చదవండి


రెడ్ వెల్వెట్ కేక్ తయారుచేయడం ఎలా.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


వెడ్డింగ్ కేకులపై ప్రత్యేకమైన వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


కేక్ ఇన్ ఏ మగ్.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి