“ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్… ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ … ఈ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ … ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్” మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పాడిన ఈ పాట గుర్తుందిగా.. నిజంగానే ఛాయ్ లేదా టీ మన దైనందిన జీవితాలలో ఒక భాగం అని చెప్పొచ్చు.
అయితే ఇదే ఛాయ్ హైదరాబాద్‌కి వస్తే ఇరానీ ఛాయ్ రూపంలో ( Irani Chai ) మనకి పరిచయమవుతుంది. అసలు ఈ ఇరానీ ఛాయ్ అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది అని చెప్పాలి. వందల సంవత్సరాల క్రితం మన దేశానికి వలస వచ్చిన ఇరానీయన్ల నుండి మన దేశానికి పరిచయమైందే ఈ ఇరానీ ఛాయ్. వారు మన దేశంలోకి వచ్చాక క్రమక్రమంగా ముంబై, పుణె & హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు.
ఇరానీ చాయ్ హైదరాబాద్ లో (List Of Cafes Serving Irani Chai)
అలా స్థిరపడడమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ స్టైల్ ఛాయ్‌ని ఇక్కడి వారికి అలవాటు చేసి క్రమక్రమంగా అదే వృత్తిగా చేపట్టి ఇరానీ కేఫ్‌లకి తెరతీశారు. ఇదే ఆ తరువాతి కాలంలో ఇరానీ ఛాయ్‌గా ప్రాశస్త్యం పొందగలిగింది. మనకి లభించే చాలా రకాల టీలలో “ఇరానీ ఛాయ్” ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి.
ఇక ఈ ఇరానీ ఛాయ్‌కి మన హైదరాబాద్ ( Hyderabad ) లో ఉన్న ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. వేరే ప్రాంతం, రాష్ట్రం లేదా విదేశాల నుండి వచ్చే వారు తప్పక రుచి చూసేది ఇక్కడి ఇరానీ ఛాయ్. అంతటి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉంది అంటే అతిశయోక్తి కాదు.
దాదాపు ఒక శతాబ్ద కాలం నుండి ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఇరానీ ఛాయ్ కేఫ్‌లు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోకతప్పదు. అందులో ఇప్పటికీ ప్రజానీకం బాగా ఆదరిస్తున్న కేఫ్‌ల జాబితా ఇదే …
హోటల్ నయాబ్ (Hotel Nayaab)- నయాపూల్ రోడ్ , చార్మినార్ (Charminar)
షా గౌస్ కేఫ్ (Shah Ghouse Cafe & Restaurant) – టోలీచౌకి (Tolichowki)
తైబా భేకరీ (Taibha Bakery)- మాసబ్ ట్యాంక్ (Masab Tank)
సార్వీ (Sarvi Restaurant) – మెహదీపట్నం (Mehdipatnam)
కేఫ్ బహార్ (Cafe Bahar) – బషీర్ బాగ్ (Basheerbagh)
షాదాబ్ (Shadab) – ఓల్డ్ సిటీ (Old City)
కేఫ్ నీలోఫర్ (Cafe Niloufer) – లక్డికాపూల్ (Lakdikapul)
కరాచీ బేకరీ (Karachi Bakery) – నాంపల్లి (Nampally)
కేఫ్ మదీనా (Cafe Madhina) – ఓల్డ్ సిటీ (Old City)
ఆల్ఫా హోటల్ (Alpha Hotel) – సికింద్రాబాద్ (Secunderabad)
బ్లూ సి హోటల్ (Blue Sea Hotel)- సికింద్రాబాద్ (Secunderabad)
గ్రాండ్ హోటల్ (Grand Hotel) – అబిడ్స్ (Abids)
ఇక ఈ ఇరానీ కేఫ్‌లలో మనకి స్న్యాక్ ఐటమ్స్ కూడా భలే రుచికరమైనవి లభిస్తాయి. ఉదాహరణకి – ఇరానీ ఛాయ్‌లోకి ఎవరౌనా ఎక్కువగా ఇష్టపడేది ఉస్మానియా బిస్కట్స్ . అలాగే ఓల్డ్ సిటీలో మనకి దొరికే చాంద్ బిస్కెట్స్ కూడా చాలా పాపులర్. వీటితో పాటు సమోసా (Samosa), పఫ్స్ ఇలా అనేకమైన స్నాక్ ఐటమ్స్ మనకి అత్యల్ప ధరలో లభిస్తాయి. అందుకే ఇక్కడ సామాన్య ప్రజానీకం ఒక కప్ ఛాయ్ & బిస్కెట్‌తో వారి రోజుని ప్రారంభిస్తారు.
అయితే నేను పైన చెప్పిన కేఫ్‌లలోనే కాకుండా హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాలలో ఇంకా చాలా చోట్ల అద్భుతమైన ఇరానీ ఛాయ్ మనకు లభిస్తుంది. ఈ సారి హైదరాబాద్ వచ్చిన వారు తప్పకుండా ఈ ఛాయ్ రుచి చూస్తారుగా …
చివరగా – నేను హైదరాబాద్‌లో గత పన్నెండేళ్లుగా ఉంటున్నాను, నేను ఇరానీ ఛాయ్ తాగకుండా ఉన్న రోజులు బహు అరుదు అని చెప్పగలను. దీన్నిబట్టి నేను ఇరానీ ఛాయ్‌కి ఏ స్థాయిలో ఫిదా అయ్యాను అనేది మీకు ఇప్పటికే అర్ధమైపోయింది కదా.