నుపుర్ కనోయ్ - సారా అలీ ఖాన్ మెచ్చిన డిజైనర్.. ఆమె డిజైన్లు మనకూ నచ్చుతాయి

నుపుర్ కనోయ్ - సారా అలీ ఖాన్ మెచ్చిన డిజైనర్.. ఆమె డిజైన్లు మనకూ నచ్చుతాయి

సారా అలీ ఖాన్.. ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల కళ్లన్నీ ఆమెపైనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సెలబ్రిటీ కిడ్ బద్రినాథ్, సింబా సినిమాలతో త్వరలోనే వెండితెరపై తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతోంది. కానీ అంతకు ముందే ఆమె తన రూపంతో, స్టయిల్ తో ఫ్యాషన్ ప్రియులను మనసును దోచేసుకొంది. ఆమె ధరించిన వస్త్రాలను చూస్తే.. ‘వావ్ ఎవరో గానీ చాలా బాగా డిజైన్ చేశారు’ అని అనుకోకుండా ఉండలేం.


ఇప్పటి వరకు బాగా పేరొందిన డిజైనర్ల దుస్తులనే ధరించింది సారా అలీ ఖాన్ (Sara Ali Khan). వారిలో అబూ జానీ, సందీప్ ఖోస్లా, రా మాంగో వంటి ప్రముఖ డిజైనర్లు కూడా ఉన్నారు. ఇటీవలే సారా అలీ ఖాన్ ధరించిన వస్త్రాల మాదిరి వాటినే ప్రముఖ స్టయిలిస్ట్ తాన్యా గావ్రి కూడా ధరించారు. ఇద్దరికీ అవి ఎంతో బాగా నప్పాయి. అప్పుడు వచ్చింది సందేహం.. ఈ దుస్తులను ఎవరు రూపొందించారు అని?పూర్తిగా భారతీయత ప్రతిఫలించే ఈ అవుట్ ఫిట్ లో అందరి చూపులు తనవైపే తిప్పుకొనేలా మెరిసిపోతోంది సారా. ఎంబ్రాయిడరీతో హంగులద్దిన నీలం రంగు క్రాప్ టాప్ పై అదే రంగులో తీర్చిదిద్దిన హై వెయిస్ట్ ఫ్లేర్డ్ ప్యాంట్ ధరించి హొయలు ఒలికిస్తోంది.రాజస్థానీ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన టాప్ అదరహో అనిపిస్తోంటే.. బాందినీ టై అండ్ డై ప్రింట్ తో ప్యాంట్ దానికి మరింత ఆకర్షణను జోడించింది. టాప్ అంచులతో పాటుగా.. బాటమ్ కి ఉన్న వెయిస్ట్ బాండ్ సారా ధరించిన దుస్తులకు రిచ్ లుక్ అందిస్తున్నాయి.చూడముచ్చటగా ఉన్న ఈ దుస్తుల వెనుక ఉన్నడిజైనర్ ఎవరో తెలుసుకోవాలని మాతో పాటు మీరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా..ఆమే నుపుర్ కనోయ్. కోల్ కతాకు చెందిన ఈమె 2006 నుంచి డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆమె రూపొందించే దుస్తులు ఎంబ్రాయిడరీ, రంగుల మేళవింపుతో కళాత్మకంగా ఉంటాయని FDCI పేర్కొంది. 


నుపుర్ కనోయ్ (Nupur Kanoi) ప్రొఫైల్ చూసిన తర్వాత గతంలోనే ఆమె రూపొందించిన వస్త్రాలను ప్రముఖ బాలీవుడ్ తారలు ధరించారని మాకు తెలిసింది. 


వారిలో పరిణీతి చోప్రా, శిల్పాశెట్టి, కాజోల్, నేహా ధూపియా ఉన్నారు.


ఆమె రూపొందించిన ఫ్లోరల్ ప్రింట్ వస్త్రాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. 


నుపుర్ దుస్తులను రూపొందించడానికి రాజస్థానీ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అందుకే అవి అందరినీ ఆకట్టుకొనేలా ఉంటున్నాయి.


ఇది చాలు కదా నుపుర్ టాలెంట్ గురించి చెప్పడానికి. అందుకే మేం ఆమె అధికారిక పేజీని ఫాలో అవుతూ ఆమె డిజైన్లతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే పనిలో ఉన్నాం. మరి మీరు?


 Images: Instagram