ప్రభాస్ అభిమానులకు పండగే.. సాహో రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..?

ప్రభాస్ అభిమానులకు పండగే.. సాహో రిలీజ్ డేట్ తెలిసిపోయిందిగా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) స్థాయి బాహుబలి చిత్రం తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇందుకనుగుణంగానే ఆయన తాజాగా చేస్తున్న 'సాహో' చిత్రాన్ని తెలుగు, తమిళ & హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అయితే ఇది కూడా భారీ యాక్షన్-ఎంటర్టైనర్ అని దర్శక-నిర్మాతలు చెప్పడమే కాకుండా ఈ మధ్యనే "షేడ్స్ అఫ్ సాహూ " అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో మనం చూడబోయే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకా టీజర్‌ని మనకి ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది.


ఇక ఈ వీడియో చూసాక , సాహూ (Saaho) ఎప్పుడు విడుదలవుతుందా .. ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత అందరిలోనూ .. ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లోనూ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే వీరి ఎదురుచూపులకి తగిన సమాధానం బయటికొచ్చింది. సాహూ చిత్రం విడుదల తేదీ వివరాలు బయటకు రావడంతో ప్రస్తుతం ఆయన అభిమానులు
పండగ చేసుకుంటున్నారు.


తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం వచ్చే ఆగష్టు 15, 2019 తేదిన విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ & హిందీ బాషలలో విడుదలకానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది అని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాని హిందీ మార్కెట్‌లో పెద్ద ఎత్తున విడుదల చేయాలంటే హిందీ హీరోయిన్ అయితేనే సరిపోతుంది.. అని ఏరి కోరి మరి హిందీ నటి శ్రద్ధా కపూర్‌ని (Shraddha Kapoor) ఈ చిత్రం కోసం ఎంపిక చేయడం జరిగింది.


అలాగే ఈ సినిమాలో తెలుగు , తమిళ & హిందీ భాషలకి చెందిన ప్రముఖ నటీనటులంతా నటిస్తున్నారు . ప్రభాస్ ఈ చిత్రం కోసం తొలిసారిగా హిందీలో డబ్బింగ్ చెప్పుకునేందుకు.. ఇప్పటికే హిందీ కూడా నేర్చుకుంటున్నట్టుగా తెలిసింది . దీన్నిబట్టి హిందీలో ప్రభాస్ ఎలా డైలాగ్స్ చెబుతాడు అనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి అన్నీ పక్కనపెడితే ఇంత పెద్ద బడ్జెట్ చిత్రాన్ని , ఇంతమంది నటీనటుల్ని ఒక యువ దర్శకుడైన సుజీత్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. దుబాయ్‌లో చేసిన 45 రోజుల యాక్షన్ షెడ్యూల్ ఈ చిత్రానికి హైలైట్ అని.. దానిని అత్యంత ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో దర్శకుడు సుజీత్ కృతకృత్యుడయ్యాడు అని యూనిట్ వర్గాల సమాచారం.


ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం జరిగింది. సంగీత త్రయం శంకర్-యెహసాన్-లాయ్ స్వరాలు అందిస్తుండగా నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని నిర్మిస్తున్న UV క్రియేషన్స్ సంస్థ వారు ఈ చిత్ర రిజల్ట్ పైన గట్టి నమ్మకంతో ఉన్నారు.


చివరగా ... తమ డార్లింగ్ చిత్రం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నవారి మాత్రం ప్రభాస్ డార్లింగ్ ఇండిపెండెన్స్ డే (Independence Day) గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పాల్సిందే.