అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి మీరు చేయాల్సిన పనులివే..

అబ్బాయిలూ.. ప్రేమతో మీ భాగస్వామికి మీరు చేయాల్సిన పనులివే..

హలో మిస్టర్స్.. అమ్మాయిలను సంతోషంగా ఉంచడం మీరనుకొన్నంత సులభమేమీ కాదండోయ్.. అలాగని మాకోసం మీరు పెద్దగా కష్టపడి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి చిన్న చిన్న పనులు చేస్తే చాలు. కానీ అవి మీమీద ప్రేమ మరింత పెరిగేలా చేస్తాయి. మరి దానికోసం మీరేం చేయాలో తెలుసా? ఆ.. మరేం ఫర్లేదులెండి.. అవేంటో మేం చెప్తాంగా..


అంతకంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. మీ భాగస్వామి సంతోషంగా లేకపోతే.. మీరూ సంతోషంగా ఉండలేరు.


1. మీరు ఫోన్ చేస్తానన్న సమయానికే ఫోన్ చేయండి. గంటలు గడిచిపోయిన తర్వాత కాదు.


Point-1-commandment


2. ఆమె ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటోలను ఒక్కదాన్ని కూడా మిస్సవ్వకుండా అన్నింటికీ లైక్ కొట్టండి.


Point-2-Commandment


3. మీరు ఒకరితో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మరో అమ్మాయికి సైట్ కొట్టకండి. అది మీ భాగస్వామి మనసుని గాయపరుస్తుంది.


Point-3-Commandments


4. పెళ్లయిన కొత్తలో లేదా ప్రేమించుకొనే రోజుల్లో మీ భాగస్వామికి తరచూ ఏదో ఒక బహుమతి ఇచ్చే ఉంటారు కదా.. కానీ ఆ తర్వాత అలా చేయడం కూడా మానేసి ఉంటారు. ఇప్పుడు మళ్లీ ఆ గిఫ్ట్ రొటీన్ ప్రారంభించండి. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు పది రూపాయలు పెట్టి ఓ గులాబీ కొనివ్వండి. మీ భాగస్వామి కళ్లలో కనిపించే మెరుపు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.


promises-all-men-make-point-41


5. అమ్మాయిలు బాగా ఇష్టపడే ఒకే ఒక్క విషయం షాపింగ్. తమకు నచ్చిన వస్తువు లేదా డ్రస్ కొనే విషయంలో వారు ఎలాంటి రాజీ పడరు. అవసరమైతే పదిషాపులు తిరిగైనా సరే తమకు కావాల్సిందే కొనుక్కొంటారు. ఇలాంటప్పుడు మీరు వారిని తప్పు పట్టకూడదు. అలాగే వారు దానికోసం ఖర్చు పెట్టిన డబ్బు విషయంలో లెక్కలేసుకోకూడదు. ఎందుకంటే మీ భార్య రోజంతా కుటుంబ బాధ్యతలతోనే గడిపేస్తుంటుంది. ఆమెకు ఎప్పుడో గానీ షాపింగ్ చేసే అవకాశం రాదు.


promises-all-men-make-point-5


6. ఆ సమయంలో అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమెకు విశ్రాంతినివ్వండి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ప్రేమగా చూసుకోండి.


promises-all-men-should-make


7. ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే ఆ గొడవలను సాగదీయకుండా.. దాన్ని అక్కడే సర్దుబాటు చేసుకోవడం మంచిది. అలాగే కోపంతో మంచంపై అటు పక్కకి తిరిగి అస్సలు నిద్రపోకండి.


8. మీ భాగస్వామి తన స్నేహితురాళ్లతో కలసి బయటకు వెళ్లినప్పుడు కాస్త ఆలస్యంగా వస్తే కోప్పడకండి. అలాగే బయటకు వెళ్లిన తర్వాత ఎప్పుడు వస్తున్నావంటూ ఫోన్లు చేయకండి.


boyfriend-commandments-gif-8


9. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది పురుషులు వంటల విషయంలో తమ భార్యను ఎప్పుడూ తమ తల్లితో పోలుస్తారు. ఇలా మాత్రం అస్సలు చేయద్దు.


10. పడకపై అలసిపోయిన తర్వాత మీ భాగస్వామిని హత్తుకొని నిద్రపోండి.


GIFs: tumblr.com, reddit.com, sprung.com, giphy