ADVERTISEMENT
home / సౌందర్యం
పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం.. లిప్ స్టిక్ ఇలా వేసుకోండి..

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం.. లిప్ స్టిక్ ఇలా వేసుకోండి..

కొంతమంది అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. మీకు నచ్చిన మేకప్ వస్తువు ఏంటి? అనడిగితే.. ఎక్కువ మంది lipstick అనే చెబుతారు. అంత వరకూ ఎందుకు? నా విషయమే చూడండి. నేను మేకప్ వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కానీ లిప్ స్టిక్ లేకుండా బయటకు రాను. దాని వల్ల నా ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు లిప్ స్టిక్ వేసుకోవడం అనుకొన్నంత సులభమేమీ కాదనిపిస్తుంది. ఇలా  మీక్కూడా అనిపించే ఉంటుంది కదా..! అందుకే ఈ విషయంలో మీకు కొన్ని చిట్కాలు అందించాలనుకొంటున్నాను. లిప్ స్టిక్ చాలా ఈజీగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? లిప్ స్టిక్ వేసుకోవడానికి ముందు.. ఆ తర్వాత ఏం చేయాలి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం.

కథనంలోని ముఖ్యాంశాలు

లిప్ స్టిక్ వల్ల కలిగే ప్రయోజనాలు

లిప్ స్టిక్ రెడీ పెదవుల కోసం ఏం చేయాలి?

లిప్ స్టిక్ ఎలా వేసుకోవాలి?

ADVERTISEMENT

మనకు నప్పే రంగు లిప్ స్టిక్ ఎలా ఎంచుకోవాలి?

లిప్ స్టిక్ అందంగా కనిపించాలంటే ఏం చేయాలి?

Lipstick-2

లిప్ స్టిక్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. అందంగా కనిపిస్తాం: పెదవులకు వన్నె తీసుకురావడానికి ఎలాంటి లిప్ స్టిక్ ఉపయోగించామనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకొన్నా.. అది మీ సౌందర్యానికి మరింత వన్నెలద్దుతుంది. పైగా పూర్తిగా మేకోవర్ అయిన అనుభూతినిస్తుంది. జీన్స్, టీ షర్ట్ వేసుకొని లిప్ స్టిక్ వేసుకొని చూడండి. మీ లుక్ మొత్తం మారిపోతుంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.
  2. పెదవులను రక్షిస్తుంది:  లిప్ స్టిక్ అప్లై చేసుకొంటే అది పెదవులకు రక్షణ కల్పించే పొరలా పనిచేస్తుంది. ఫలితంగా దుమ్ము, ధూళి పెదవులపైకి చేరకుండా ఆపుతుంది. ఇటీవలి కాలంలో లిప్ స్టిక్స్‌ను నూనెలతో తయారుచేస్తున్నారు. ఇలాంటి లిప్ స్టిక్స్ అధరాలకు పోషణ అందిస్తాయి. దీనివల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి. పొడిబారకుండా ఉంటాయి.
  3. హైడ్రేషన్:  అధరాలు అందంగా కనిపించాలంటే.. అవి ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు పెదవుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి కుదరకపోవచ్చు. అప్పుడు పెదవులు పొడిబారి పగిలినట్లుగా తయారవుతాయి. అదే ఎస్సెన్సియల్ ఆయిల్స్‌‌తో తయారైన లిప్ స్టిక్ వేసుకొంటే.. పెదవులకు తగినంత పోషణ అందడంతో పాటు.. అందంగా కనిపిస్తాయి. అంటే ప్రయాణాల్లో లిప్ బామ్ మరిచిపోయినా దానికి బదులుగా లిప్ స్టిక్ ఉపయోగించవచ్చు.

lipstick-3

ADVERTISEMENT
  1. సన్ స్క్రీన్‌గా పనిచేస్తుంది: సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికే కాదు.. పెదవులకూ హాని చేస్తాయి. అయితే మనం ఎక్కువగా సన్ స్క్రీన్ లోషన్ చర్మానికి మాత్రమే రాసుకొంటూ ఉంటాం. పెదవులను నిర్లక్ష్యం చేస్తుంటాం. లిప్ స్టిక్ వేసుకొంటే.. యూవీ కిరణాల ప్రభావం పెదవులపై పడకుండా ఉంటుంది.
  2. ఆకర్షణగా కనిపించేలా చేస్తుంది: లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదవులు మాత్రమే కాదు.. ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ముఖంలో కొత్త ఆకర్షణ వస్తుంది. అలాగే లిప్ స్టిక్‌కి తోడుగా.. లిప్ లైనర్ కూడా వేసుకొంటే.. ముఖం మరింత కాంతిమంతంగా కనిపిస్తుంది.
  3. కళ్లు అందంగా కనిపిస్తాయి: అదేంటీ? లిప్ స్టిక్ వేసుకొంటే.. కళ్లు అందంగా కనిపించడమేంటనుకొంటున్నారా? మనకు నప్పే రంగు లిప్ స్టిక్ వేసుకొంటే.. కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి. అంతేకాదు.. కళ్ల రంగు బ్రైట్ గా కనిపిస్తుంది.
  4. ఆరోగ్యం కూడా: చర్మంతో పోలిస్తే పెదవులపై మెలనిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే సూర్యుని నుంచి వెలువడే కిరణాల ప్రభావానికి గురవుతుంటాయి. అందుకే ఎస్పీఎఫ్ 15 ఉన్న లిప్ స్టిక్ ఉపయోగించడం వల్ల పెదవుల చర్మాన్ని కాపాడుకోవచ్చు.

(ఆన్ లైన్‌లో లభించే లేత రంగు లిప్ స్టిక్ షేడ్స్ గురించి ఇక్కడ ఆంగ్లంలో చదవండి)

lipstick-4

లిప్ స్టిక్ రెడీ పెదవుల కోసం ఏం చేయాలి?

చాలామంది తమ చర్మ సంరక్షణపై కనబరిచే శ్రద్ధ పెదవులపై చూపించరు. కానీ పెదవులు అందంగా కనిపించాలంటే.. క్రమం తప్పకుండా రాత్రి నిద్రపోయే ముందు మాయిశ్చరైజ్ చేసుకొంటూ ఉండాలి. అలాగే పెదవులపై ఉన్న మృతకణాలను తొలగించుకోవడానికి తరచూ ఎక్స్ఫోలియేట్ చేసుకొంటూ ఉండాలి.

ఎక్స్ఫోలియేట్: మృతకణాలు చర్మం మీద మాత్రమే కాదు.. పెదవులపై కూడా ఉంటాయి. కాబట్టి అధరాలను కూాడా తరచూ ఎక్స్ఫోలియేట్ చేసుకొంటూ ఉండాలి. దానికోసం లిప్ స్క్రబ్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం పొడిగా చేసిన పంచదారను ఉపయోగిస్తే సరిపోతుంది. పంచదార పొడితో పెదవులను మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అలాగే బ్రష్ పై టూత్ పేస్ట్ వేసి సున్నితంగా రుద్దుకొన్నా సరిపోతుంది.

ADVERTISEMENT

మాయిశ్చరైజ్: ప్రతిరోజూ పెదవులను మాయిశ్చరైజ్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే లిప్ స్టిక్ వేసుకొన్నా అందంగా కనిపించవు. దీనికోసం లిప్ బామ్ ఉపయోగించాలి. రోజూ నిద్రపోయే ముందు దీన్ని అప్లై చేసుకోవాలి. దీనికోసం జిడ్డుగా అనిపించని లిప్ బామ్ ఉపయోగించాలి. అధరాలను మాయిశ్చరైజ్ చేసుకోవడానికి సహజసిద్ధమైన ఉత్పత్తులను సైతం వాడచ్చు. మన నానమ్మలు, అమ్మమ్మలు దీనికోసం నెయ్యి, వెన్న ఉపయోగించేవారు. దీన్ని మనం కూడా పాటించవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం కూడా ఉండదు.

lipstick-5

పెదవులు మృదువుగా తయారవడానికి ఈ రెండు చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా తరచూ లిప్ బామ్ రాసుకోవాల్సిన అవసరం రాదు.

లిప్ స్టిక్ ఎలా వేసుకోవాలి? A step- by step guide

పెదవులు అందంగా కనిపించాలంటే లిప్ స్టిక్ వేసుకోవాలి. మరి ఆ లిప్ స్టిక్ అందంగా రావాలంటే.. మేం చెప్పే చిట్కాలు పాటించాలి. అందుకే లిప్ స్టిక్ ఎలా వేసుకోవాలి? అది ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకొందాం.

ADVERTISEMENT

Step 1 – పెదవులు శుభ్రంగా

లిప్ స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులపై జిడ్డు లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే లిప్ బామ్ పెదవులపై అధికంగా ఉంటే.. లిప్ స్టిక్ నిలబడదు.

Step 2- ఫౌండేషన్

మీరు అనుకొంటున్నది కరెక్టే. ముఖానికి మేకప్ వేసుకొనేటప్పుడు ఫౌండేషన్ వేసుకొన్నట్లుగానే లిప్ స్టిక్ వేసుకొనే ముందు కూడా కొద్దిగా ఫౌండేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల లిప్ స్టిక్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అలాగే ముద్ద ముద్దగా కనిపించకుండా ఉంటుంది. దీనికోసం మేకప్ కోసం ఉపయోగించే ఫౌండేషన్‌నే.. లిప్ ఫౌండేషన్‌గానూ వాడొచ్చు. దీన్ని కొద్దిగా వేలితో తీసుకొని పెదవులపై సమానంగా రాసుకోవాలి.

ADVERTISEMENT

Step 3 – లిప్ లైనర్

ఫౌండేషన్ రాసుకొన్న తర్వాత పెదవుల చుట్టూ లిప్ లైనర్‌తో అవుట్ లైన్ గీసుకోవాలి. దీనికోసం మీరు వేసుకొనే లిప్ స్టిక్ రంగు లేదా దాని కంటే లేతరంగు లిప్ లైనర్ ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా లిప్ స్టిక్ పెదవులను దాటకుండా అప్లై చేసుకోవడానికి ఉంటుంది.

Step 4- లిప్ స్టిక్

ADVERTISEMENT

లిప్ లైనర్ రాసుకొన్న తర్వాత లిప్ స్టిక్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేరుగా లిప్ స్టిక్ పెదవులకు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్రష్ సాయంతో ఉఫయోగించవచ్చు. ఇలా చేసేటప్పుడు లైనర్ పరిధి దాటకుండా.. వేసుకోవాలి. అప్పుడే పెదవులు అందంగా కనిపిస్తాయి. అవసరమైతే రెండోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Step 5 – కాంటౌరింగ్

పర్ఫెక్ట్ లిప్ మేకప్ కావాలని మీరు కోరుకుంటే.. కాంటౌరింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసం మేకప్ ఫౌండేషన్ ఉపయోగించాలి. బ్రష్‌తో పెదవుల చుట్టూ ఫౌండేషన్‌ను తక్కువ మొత్తంలో అప్లై చేసుకోవాలి. ఆపై గడ్డానికి పౌడర్ అద్దుకొంటే సరిపోతుంది.

ADVERTISEMENT

Step 6 – ఫినిషింగ్ టచ్

చివరిగా.. మీ పెదవులకు మరొక్కసారి లిప్ స్టిక్ వేసుకోవాల్సిన అవసరం ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ ఆ అవసరం ఉందనిపిస్తే లిప్ గ్లాస్ అప్లై చేసుకొంటే సరిపోతుంది. హైలైటర్ ఉపయోగించడం ద్వారా పెదవుల ఆకృతి చక్కగా ఉంటుంది.

పెదవులకు నప్పే లిప్ స్టిక్ ఎలా ఎంచుకోవాలి?

మనకు నప్పే రంగు లిప్ స్టిక్ అప్లై చేసుకొన్నప్పుడే మన అందం మరింత ఇనుమడిస్తుంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అలాంటి లిప్ స్టిక్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? ఏ షేడ్ అయితే బాగుంటుంది? అని ఆలోచిస్తున్నారా? లిప్ స్టిక్ కొనేముందు మేం చెప్పే ఈ విషయాలను ఓ సారి గుర్తు తెచ్చుకోండి.

1. చర్మం రంగుకి సరిపోయేలా..

ADVERTISEMENT

చాలామంది లిప్ స్టిక్ కొనేటప్పడు తమకు నచ్చిన రంగులనే కొంటారు. కానీ అవి తమకు నప్పుతాయా? లేదా? అని పట్టించుకోరు. చర్మతత్వానికి సరిపోయే షేడ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి వాటిని ఎంచుకొంటేనే.. మరింత సౌందర్యంగా కనిపిస్తాం.

మీది తెలుపు మేనిఛాయ అయితే మీకు లేత గులాబీ, డస్టీ రెడ్, న్యూడ్ కలర్స్ బాగుంటాయి.

చామనఛాయ కలిగిన వారికి ముదురు రంగులు నప్పుతాయి. ఎరుపు, ప్లమ్, క్రిమ్సన్ రంగులు మిమ్మల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

మీ చర్మం గోధుమ వర్ణంలో ఉన్నట్లయితే మీకు గులాబీ, చెర్రీ రంగులు బాగా నప్పుతాయి.

ADVERTISEMENT

2. ఆకారమూ ముఖ్యమే..

లిప్ స్టిక్ ఎంచుకొనే క్రమంలో పెదవుల ఆకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అధరాలు కాస్త సన్నగా ఉండేవారు ముదురు రంగు లిప్ స్టిక్‌లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి పెదవులను మరింత సన్నగా కనిపించేలా చేస్తాయి. వీరికి creamy shades, glossy shades పర్ఫెక్ట్‌గా ఉంటాయి. పెదవులు లావుగా ఉండేవారు మాత్రం ఈ రెండిటికి దూరంగా ఉండాలి.

3. దంతాలు, జుట్టు కూడా..

ADVERTISEMENT

హెయిర్ కలర్, దంతాల రంగు కూడా మనం అప్లై చేసుకొన్న లిప్ స్టిక్ రంగుపై ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కొన్ని రకాల షేడ్స్ లిప్ స్టిక్స్ వల్ల మన పళ్ల రంగు వేరేలా కనిపించవచ్చు. ఉదాహరణకు న్యూడ్ కలర్ లిప్ స్టిక్ దంతాలను పసుపు రంగులో కనిపించేలా చేస్తాయి. అందుకే ఈ రెండింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

4. మీకు నప్పనివి పారేయద్దు.

కొన్ని సందర్భాల్లో లిప్ స్టిక్ రంగు బాగుందని మనం ఎంచుకోవచ్చు. లేదా షాపులో లైట్ల వెలుగులో బాగా కనిపించిన లిప్ స్టిక్ రంగు ఆ తర్వాత మనకు నచ్చకపోవచ్చు. ఇలాంటి వాటిని పారేయకుండా.. వేరే వాటితో కలగలిపి కొత్త లిప్ స్టిక్‌ని తయారుచేయండి. నప్పని వాటితోనే కాదు.. మనకు సరిపోయే లిప్ స్టిక్ రంగులతోనూ ఇలాంటి ప్రయోగాలు చేయచ్చు.

వివిధ రకాల లిప్ స్టిక్ ట్రెండ్స్

బ్యూటీ ఇండస్ట్రీలో లిప్ స్టిక్స్‌తో ప్రయోగాలు చేయడం సర్వ సాధారణం. వాటిలో కొన్ని అసాధారణమైనవి అయినప్పటికీ.. బాగా పాపులర్ అయినవి కూడా ఉన్నాయి. వాటిలో ఒక్కటైనా సరే మీరు ప్రయత్నించాల్సిందే. Ombre లిప్ షేడ్ నుంచి గ్లిట్టర్ లిప్స్ వరకు చాలా లిప్ స్టిక్ ట్రెండ్స్ ఉన్నాయి. మరి వాటిలో మీ ఫేవరెట్ ఏంటి?

ADVERTISEMENT

ఈ జీనియస్ లిప్ స్టిక్ చిట్కాలు మీ కోసమే..

  1. పెదవులను ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి టూత్ బ్రష్ లేదా మస్కారా బ్రష్‌ని ఉపయోగించండి.
  2. లిప్ స్టిక్ పళ్లకు అంటుకోకుండా ఉండాలంటే.. పెదవుల మధ్య వేలిని ఉంచి లిప్ స్టిక్ వేసుకొంటే సరిపోతుంది. ఇలా చేసేటప్పుడు పెదవులను పౌట్ మాదిరిగా పెట్టాల్సి ఉంటుంది.
  3. ఎప్పుడైనా మీ దగ్గర బ్లష్ అయిపోతే.. దానికి బదులుగా లిప్ స్టిక్ ఉపయోగించవచ్చు.
  4. ఐషాడోని కూడా లిప్ స్టిక్‌గా ఉపయోగించవచ్చు. దానికోసం ఐ షాడోని లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీతో కలపాల్సి ఉంటుంది.
  5. ముదురు రంగు లిప్ స్టిక్‌ను లేత లేదా న్యూడ్ కలర్ మాదిరిగా కనిపించేలా చేయాలంటే.. కన్సీలర్ ఉపయోగించాలి.
  6. మీ లిప్ స్టిక్ విరిగిపోయినట్లయితే.. దాన్ని రోజంతా ఫ్రిజ్‌లో ఉంచితే.. తిరిగి అతుక్కుపోతుంది.
  7. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు లిప్ స్టిక్ కరిగిపోకుండా ఉండాలంటే వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉంచాలి.
  8. మీ దగ్గర ఎరుపు, నారింజ రంగు లిప్ స్టిక్ ఉంటే వాటిని కన్సీలర్‌గా ఉపయోగించవచ్చు.
  9. నీలం రంగు లిప్ స్టిక్ మీ దగ్గర ఉంటే.. దాన్ని ఐ షాడో, ఐ లైనర్‌గా ఉపయోగించవచ్చు.

మేం సూచించిన ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయనే భావిస్తున్నాం. మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటీ హ్యాక్స్ ఏమైనా ఉంటే మాతోనూ పంచుకోండి. అలాగే లిప్ స్టిక్ కొనడానికి వెళ్లేటప్పడు మేం చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకోండి. హ్యాపీ షాపింగ్..!

ఇవి కూడా చదవండి.

#WhatsThatLipColor: ప్రియాంక లిప్ స్టిక్ రహస్యం గురించి ఆంగ్లంలో చదవండి.

ADVERTISEMENT

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నారా? ఈ 11 రకాల లిప్ స్టిక్స్ మీకోసమే.

పెళ్లికూతురికి నప్పే బెస్ట్ రెడ్ లిప్ స్టిక్స్ గురించి ఇక్కడ ఆంగ్లంలో చదవండి.

25 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT