మానవత్వానికి మచ్చుతునకలు ఈ ఛాయా చిత్రాలు

మానవత్వానికి మచ్చుతునకలు ఈ ఛాయా చిత్రాలు

యుద్ధాలు, హత్యలు, మారణకాండలు, అత్యాచారాలు, వేధింపులు.. వీటి గురించి వార్త లేని పత్రిక ఏ రోజైనా చదివామా? కొన్ని సంఘటనల గురించి తెలుసుకొన్నప్పుడు.. వాటి గురించి చదివినప్పుడు ఈ రోజుల్లో మానవత్వం ఎవరిలోనైనా మచ్చుకైనా కనిపిస్తుందా? అనిపించకమానదు. అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనల వలన మానవత్వం (Humanity) ఇంకా బతికే ఉందనిపిస్తుంది. దానికి సజీవ సాక్ష్యాలే ఈ ఛాయా చిత్రాలు. ఈ సంఘటనలన్నీ ఈ ఏడాదిలోనే అంటే 2018 లోనే జరిగాయి. అవి మన హృద‌యాన్ని తడి చేయకమానవు.


1. శునకాలకు ఆశ్రయం..


Image: Reddit


ఇంట్లోకి కుక్క వస్తే దాన్ని ఆదరించేవారి కంటే తరిమేసే వారే ఎక్కువ. కానీ టర్కీలో ఓ షాపింగ్ మాల్‌లో మాత్రం రాత్రివేళల్లో వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పైగా వాటికి దుప్పట్లు కూడా కప్పుతున్నారు. వారు చాలా మంచి పని చేస్తున్నారు కదా..?2.  మానవత్వం ఆకలి తీర్చింది.


Image: Harsha Bhargavi on Twitter


ఈ ఘటన మన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆకలితో అలమటిస్తూ రోడ్డు పక్క సొమ్మసిల్లిన ఓ వృద్ధ‌ మహిళ ఆకలిని తీర్చారు ఈ పోలీస్. విధి నిర్వహణలో ఉన్న సమయంలో రోడ్డు పక్కన పడిపోయిన ఆమెను చూశారాయన. అన్నపానీయాలు లేక నీరసించిన ఆమె ఆకలిని తీర్చడం కోసం ఆహారం తీసుకొచ్చారు. కనీసం ఆహారాన్ని తినలేనంత నిస్సత్తువగా ఉన్న ఆమెకు తన స్వహస్తాలతో తినిపించారు. ఈ పని చేయడానికి ఆయన తన విధి నిర్వహణను సైతం పక్కన పెట్టారు. తన ఖాకీ డ్రస్ వెనుక మానవత్వం ఉన్న మనిషి ఉన్నారని నిరూపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకొన్న తర్వాత మన కళ్లు చెమ్మగిల్లుతాయి.3. మరో అమ్మయింది.. 


Image: Reddit


సాధారణంగా ప్రయాణాల్లో పసిపిల్లలు ఏడుస్తూ ఉంటారు. వారిని ఎలా సముదాయించాలో తెలియక తల్లులు అయోమయ స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో వారికి సాయం చేయకపోగా వారిని విసుక్కొనే వారే ఎక్కువ ఉంటారు. అయితే ఈమె మాత్రం ఆ పిల్లాడు ఎవరో తనకు తెలియకపోయినా.. ఏడుస్తుంటే అతడిని ఊరుకోబెట్టింది. అంతే కాదు ఆ రాత్రంతా ఆ చిన్నారిని తన ఒళ్లోనే పడుకోబెట్టుకొంది. ఈ సంఘటన ఓ విమాన ప్రయాణంలో జరిగింది. అంతేకాదు ఫ్లయిట్ దిగిన తర్వాత బ్యాగేజ్ కౌంటర్ వరకు ఆ చిన్నారికి, అతడి తల్లికి ఆమె తోడుగా ఉంది. 


4. ఆ యూనిఫాం వెనుక మంచి మనసుంది..


Image: City of Tallahassee Police Department ఫేస్ బుక్ నుంచి


పోలీస్ అంటే కాస్త కఠినంగానే ఉంటారని మనం భావిస్తాం. కానీ అది తప్పని మరో పోలీస్ నిరూపించారు. ఫ్లోరిడాలోని ఓ పోలీస్ అధికారి.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ నిరాశ్రయునికి గడ్డం గీశారు.5. శునకాలకు ప్రియనేస్తం


Image: Reddit


బొలీవియాలో నివసిస్తున్న ఈ మహిళ కొన్నేళ్లుగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. ఆమెను చూడగానే అవి అన్నీ ఆమె చుట్టూ చేరతాయి. ఆమెను రోజూ గమనిస్తున్న ఓ వ్యక్తి ఈ ఫొటో తీసి Reddit లో షేర్ చేశారు. 


6. క్రీడాస్ఫూర్తికి నిదర్శనం ఈ చిత్రం


Image: Suman Pandit ట్విట్టర్ నుంచి


ఇండియా, పాకిస్థాన్ దాయాదులైనప్పటికీ చిరకాల ప్రత్యర్థులే. అది క్రీడల్లోనూ కనిపిస్తుంది. ఈ ఏడాది రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ పాకిస్థానీ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాన్‌కు షూ లేస్ బిగించాడు. ఈ చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.7. నిజంగానే ఇది ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ ప్లేస్


Image: Reddit


డిస్నీ వరల్డ్‌కి వెళ్లిన ఈ చిన్నారి ఆటిజమ్‌తో బాధపడుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత నేలమీద అలా పడుకొన్నాడు. అతనిని పైకి లేపడం అతని తల్లిదండ్రుల వల్ల కూడా కాలేదు. అదుగో అప్పుడే డిస్నీ క్యారెక్టర్ అయిన సోఫియా వేషం వేసుకొన్న అమ్మాయి ఈ చిన్నారిని సముదాయించింది. అయితే ఇలా చేయడానికి డిస్నీ వరల్డ్ నిబంధనలు ఒప్పుకోవు. అయినప్పటికీ ఆమె ఆ బాలుడ్ని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించింది.8. కనలేదు కానీ తండ్రిగా మారారు.


Image: Jerica Phillips ట్విట్టర్ నుంచి


డల్లాస్‌లోని ఓ పాఠశాల ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దాని సారాంశం ఏంటంటే.. తండ్రి లేని పిల్లలకు ఆ లోటు తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ‘బ్రేక్ ఫాస్ట్ విత్  ఫాదర్స్’ కార్యక్రమానికి 50 మంది వ్యక్తులను రావాల్సిందిగా ఆహ్వానించింది. కానీ ఆశ్చర్యకరంగా 600 మంది హాజరయ్యారు. హృద‌యాన్ని బరువెక్కించే ఈ తండ్రుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇవి కూడా చదవండి


ముంబయి వర్షాల సమయంలో మానవత్వపు పరిమళాల వెల్లువ.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి