ఏవండోయ్ శ్రీవారు..! ప్రేమతో మీ నుంచి నేను కోరుకొనేవి ఇవే..

ఏవండోయ్ శ్రీవారు..! ప్రేమతో మీ నుంచి నేను కోరుకొనేవి ఇవే..

ఏవండోయ్ శ్రీవారు..


ఈ మధ్యే మనం హనీమూన్ నుంచి తిరిగొచ్చాం. బాగా ఎంజాయ్ చేశాం. కానీ నిజం చెప్పాలంటే అప్పుడున్నంత ఆనందంగా ఇప్పుడు నేనుండలేకపోతున్నాను. Instagram, Facebook లో మనం అప్లోడ్ చేసిన ఫొటోలను చూస్తూ.. మళ్లీ అంత సంతోషంగా ఉండే రోజులు వస్తే బాగుంటుందనుకొంటున్నాను. హనీమూన్ సమయంలో నాలోకమే నువ్వుగా.. నీ ప్రపంచమే నేనుగా గడిపాం. కానీ ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి ఒకరితో ఒకరు సరిగ్గా సమయం గడపలేకపోతున్నాం. మన పెళ్లయి ఇంకా ఒక్క నెల కూడా కాలేదు. అప్పుడే నాకు ఏదో వెలితి కనిపిస్తోంది. మరి ఆ వెలితిని పూడ్చటం ఎలా? నా దగ్గరో ప్లాన్ ఉంది. నువ్వు చేయాల్సిందల్లా అది ఫాలో అయిపోవడమే. తప్పదు డార్లింగ్..! మన సంతోషం కోసమే కదా..! ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా.. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు అది మినీ హనీమూన్ అవుతుంది. నాది గ్యారంటీ..!


(Things every newly wed wife wants from her husband)


1. చుక్కల లోకంలో విహరిద్దాం..


అవును.. నువ్వు నాకోసం చేయాల్సిన మొదటి పని ఇదే. ఓ అందమైన రాత్రి నక్షత్రాల దుప్పటి కింద పవళిద్దాం. టెర్రస్ మీద క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి రొమాంటిక్‌గా ఆ రాత్రంతా గడుపుదాం. ఆ రాత్రి ఎప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. మరో సారి వీకెండ్ క్యాంపింగ్‌కి వెళదాం. Moonstone Hammock ఏర్పాుటు చేసే క్యాంపింగ్‌కు తీసుకెళ్లవా? ప్లీజ్.


Inlander Teal Blue Backpack క్యాంపింగ్‌కి వెళ్లడానికి సరైన ఎంపిక.


2. నీ స్నేహితులు, బంధువులందరినీ నన్ను పరిచయం చెయ్యి..


ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే.. నీ జీవితంలో ముఖ్యమైన వారందరినీ నేను కలుసుకోవాలనుకొంటున్నాను. వారితో నేను అనుబంధం పెంచుకొనే కొద్దీ మన జీవితంలోకి మరింత సంతోషం వచ్చి చేరుతుంది. పైగా కొత్తగా పెళ్లయిన వాళ్లం కాబట్టి మనల్ని కాస్త ప్రత్యేకంగా చూస్తారు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది.


మీ బంధువుల ఇంటికి వెళుతున్నారా? వారికోసం మీరేం గిఫ్ట్ తీసుకెళుతున్నారు? టీలైట్ క్యాండిల్ అయితే బాగుంటుంది. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


3. నా కోసం వంట చెయ్యి.. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్


నీతో జీవితం గడుపుతున్న ప్రతి క్షణం.. నా అందమైన కల వాస్తవ రూపంలోకి వచ్చిందనే అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు నాకోసం ఏదైనా వండి పెడితే బాగుంటుందనిపిస్తుంది. ముఖ్యంగా నేను నిద్ర లేవకముందే నాకోసం బ్రేక్ ఫాస్ట్ సిద్దం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా?  అలా చేసినందుకు బహుమతి ఏమివ్వాలో నాకు తెలుసులే..!


మీ భాగస్వామికి షెఫ్ హ్యాట్ బహుమతిగా ఇచ్చి ‘సండే బ్రేక్ ఫాస్ట్ బెడ్ డీల్’ ఒకే చేసేలా చేయండి.4. ప్రతి రాత్రి వసంత రాత్రి కావాలి..


ఇది నాకోసమే కాదు.. మనిద్దరి కోసమూ.. ఇద్దరం కలసి జీవితం మొదలు పెట్టడానికి చాలా రోజులు ఎదురుచూశాం. అందుకే ఒక్క రోజు కూడా నేను సెక్స్‌ని మిస్సవ్వదలుచుకోలేదు. అందుకే ప్రతి రోజూ సెక్స్‌ని ఆస్వాదిద్దాం. దాని కోసం నా దగ్గర అద్భుతమైన భంగిమల లిస్ట్ కూడా ఉంది. అలసిసొలసి ఆ తర్వాత ఇద్దరం ఒకరినొకరు హత్తుకొని నిద్రపోదాం.  ఏమంటావ్?


ఆ అద్భుతమైన రాత్రుల కోసం lacy bodydoll ఇక్కడ కొనండి.


5. నేను పీఎంఎస్‌తో ఉన్నప్పుడు నా మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకో..!


మళ్లీ ఇంకో ముఖ్యమైన విషయం..  నెలసరి రావడానికి ముందు నేనెలా ఉంటానో.. నీకు ఇప్పటి వరకూ తెలీదు. కానీ ఇప్పుడు మనం కలసి ఉంటున్నాం. కాబట్టి ఆ సమయంలో నేను కాస్త చికాగ్గా, కోపంగా ఉంటాను. కాబట్టి ఆ సమయంలో నన్ను కొంచెం అర్థం చేసుకొని మసలుకో. పీఎంఎస్ సమయంలో నా మూడ్ స్వింగ్స్‌ని ఎలా డీల్ చేయాలో కాస్త తెలుసుకో.


నా మూడ్ స్వింగ్స్‌ని తగ్గించడానికి చాక్లెట్ బార్ కంటే మంచి మందు ఇంకోటి లేదు తెలుసా?


6.  నాకు అందమైన బహుమతులు ఇవ్వు(నేను కూడా నీకోసం గిఫ్ట్స్ తెస్తాలే..!)


నువ్వు నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటానో తెలుసా? నాకు ఆ సంతోషం రోజూ కావాలి. అలాగని ఖరీదైనవి కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. పది రూపాయలు పెట్టి ఓ గులాబీ తీసుకొని రా. ఓ చాక్లెట్ కొనివ్వు. లేకపోతే నాకు నచ్చిన పేస్త్రీ తీసుకొని రా. ఇంటి దగ్గర నేను నీ కోసం ఓ మంచి కానుకతో ఎదురు చూస్తూ ఉంటా.. అదేంటో నీకు అర్థమయ్యింది కదా..!7. అప్పుడప్పుడూ మా అమ్మానాన్న దగ్గరికి తీసుకెళ్లు


నీతో కలిసి బతికే ప్రతి క్షణం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కానీ నేను నా అమ్మానాన్నని, నా కుటుంబ సభ్యులను మిస్సవుతూ ఉంటాను. కాబట్టి నేను అడక్కుండానే వారి దగ్గరకు నన్ను తీసుకెళ్లు. అది వారితో నా అనుబంధాన్ని మరింత బలపడేలా చేయడం మాత్రమే కాదు.. నీ పై ప్రేమను కూడా పెరిగేలా చేస్తుంది. కానీ వారితో మన మధ్య జరిగే అన్ని విషయాలను చెప్పకూడదు.


8. ఆఫీసుకెళ్లినా నన్ను లంచ్‌కి తీసుకెళ్లాలి


రోజూ మనం ఆఫీసుకెళ్లాలి. పని చేస్తున్నప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తుంటాను. ఒక్కోసారి నిన్ను చూడాలని అనిపిస్తూ ఉంటుంది.నీక్కూడా అలాగే అనిపిస్తుంటుంది కదా. అప్పుడు గంట పర్మిషన్ తీసుకొనైనా సరే.. నన్ను లంచ్‌కి తీసుకెళ్లు. ఎందుకంటే.. ఇద్దరం ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ పనిపై శ్రద్ధ పెట్టకుండా సమయం వృథా చేయడం కంటే కాసేపు ఇద్దరం కలసి సమయం గడిపి ఆ తర్వాత ఎవరి పని వారు చూసుకోవడం ఉత్తమం కదా..


రొమాంటిక్ బ్రంచ్ డేట్ కి తెల్లని దుస్తులు బాగుంటాయి. వాటిని ఇక్కడ కొనండి.


9. మనకి నచ్చే వస్తువులు కొనుక్కోవడానికి షాపింగ్‌కి  వెళదాం..


మనిద్దరికీ నచ్చిన వస్తువులతో మన పడక గదిని అలంకరించుకొంటే ఎంత బాగుంటుంది? అందుకే ఎంచక్కా షాపింగ్ చేద్దాం. రెండో అభిప్రాయానికి తావు లేకుండా ఇద్దరికీ నచ్చిన డెకరేటివ్ ఐటమ్స్ కొని మన గదిలో పెడదాం. అప్పుడే కదా మనిద్దరి మధ్య నీ సెలక్షన్ ఇంత దారుణంగా ఉంది. అనే మాట రాకుండా ఉంటుంది. కానీ నాకు మాత్రం మన గదిలో ఈ Tiny Bird cage ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నాకు తెలుసు అది నీక్కూడా నచ్చుతుంది.నా కోసం నువ్వు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్న పనుల జాబితా. ఇవి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకొంటూ వెళ్లే కొద్దీ మనిద్దరి సంతోషం.. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ పెరుగుతూనే ఉంటాయి. అంతేకాదు శ్రీవారు.. మీ కష్టాన్ని నేనేం ఉంచుకోను లెండి. దానికి బదులుగా మీకు నచ్చిన బహుమతులు నా దగ్గర లెక్క లేనన్ని ఉన్నాయి. ఏమంటారు?


ప్రేమతో..


మీ ప్రియమైన భార్యామణి.


ఈ ఆర్టికల్స్ కూడా చదవండి


మధురమే... మధురమే... ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..


ఉంగరం తొడగాలా? ప్రేమ లేఖ ఇవ్వాలా? అతడికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి?


డేట్‌కు వెళ్తున్నారా? ఇలా రెడీ అవ్వండి