ఈ టాప్ 10 చెవి పోగులు చాలా చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

ఈ టాప్ 10 చెవి పోగులు చాలా చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా మనం పార్టీలకు,ఫంక్షన్లకు, శుభకార్యాలకు సిద్ధమయ్యేటప్పుడు.. మేకప్ వేసుకోవడం పూర్తయ్యాక, నగలు అలంకరించుకొన్న తర్వాత.. గాజులు కూడా వేసుకొన్నాక అప్పుడు మనం చెవులకి దిద్దులు, పోగులు(earrings) వంటివి అలంకరించుకొంటాం. కానీ..మిగిలిన నగలతో పోలిస్తే మన అందాన్ని ఇనుమడింపచేసేవి చెవిపోగులే. వాటి విషయంలోనే మనం అలసత్వం వహిస్తాం. అసలే ముందు పండగ సీజన్ వస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలు వరుసగా వస్తున్నాయి. మరి దానికి తగినట్టుగా మనం ఫ్యాషనబుల్‌గా సిద్ధమవ్వాలి కదా..! అందుకే మీ కోసం మేం కొన్ని రకాల చెవిపోగులను మీ ముందుంచుతున్నాం.


రాళ్ల ధగధగలు


Style Fiesta


ఎప్పుడూ పెట్టుకొనే చెవిపోగులనే ఇప్పుడు కూడా పెట్టుకొంటే ఏం బాగుంటుంది? ఈ సారి ఇదుగో ఈ ఫ్లోరల్ హూప్స్ పెట్టుకోండి. చాలా ట్రెండీగా కనిపిస్తారు.


రూ. 499 (ఇక్కడ కొనేయండి) 


టాజెల్స్ వర్ణాలు..


BlueBerry


జామెట్రీ డిజైన్, ప్రకాశవంతమైన దారాలతో తయారుచేసిన టాజెల్స్ అందాలు రెండూ కలిస్తే ఎంత బాగుంటుందో కదా..! వీటికి నప్పే రంగుల్లోని డ్రస్‌ని ఎంచుకొని.. మెరిసిపోండి.


రూ.549 (ఇక్కడ కొనేయండి)పెద్ద రింగుల సోయగం


Krafted With Happiness


రాళ్లు పొదిగి.. పెద్దగా ఉన్న చెవి పోగులు పెళ్లి వంటి శుభకార్యాలకు పెట్టుకోవడానికి చక్కగా నప్పుతాయి. చీర, లంగాఓణీల మీదకు మ్యాచింగ్‌గా వీటిని పెట్టుకొంటే మీకు వింటేజ్ లుక్ వస్తుంది.


రూ.899మినిమల్ మ్యాజిక్


Pipa Bella


పెద్దగా ఉన్న చంకీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడాన్ని మీరు ఇష్టపడరా? అయితే ఇదుగో ఈ బంగారు వర్ణంలో ఉన్న స్లీక్ ఇయర్ రింగ్స్ మీకు సరైన ఎంపిక. సింపుల్‌గా ఉన్నప్పటికీ గ్రాండ్ లుక్ అందిస్తాయి. 


రూ.899 (ఇక్కడ కొనేయండి)


ఉత్తమ స్టైలిష్ చెవిపోగుల గురించి ఈ ఆర్టికల్‌లో చదివేయండి


దేనికైనా నప్పేలా..


Knick Knack Knook


ఏ రకమైన చెవి పోగులు ధరించాలో అర్థం కానప్పుడు ఇదుగో ఈ దేశీ డాంజ్లర్స్‌ని చెవులకు అలంకరించండి. సంప్రదాయ దుస్తులైనా, వెస్ట్రన్ దుస్తులైనా.. ఏ రకమైన దుస్తులు ధరించినా ఈ డాంజ్లర్స్ బాగా నప్పుతాయి.


రూ.299 (ఇక్కడ కొనేయండి)ట్రైబల్ జ్యుయలరీ అందాలు


Tribe by Amrapali


టెంపుల్ జ్యుయలరీ అంటే మగువలందరికీ మక్కువే. ఆ డిజైన్లను స్పూర్తిగా తీసుకొని.. వాటికి గిరిజనులు ధరించే వస్తువుల సొబగులను అద్దారు. అంటే ట్రైబల్ జ్యుయలరీగా కనిపించే టెంపుల్  జ్యుయలరీ అన్నమాట. పైగా ఈ రింగులకున్న డ్రాప్ లెట్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి మీకే కాదు.. మీ ఇంట్లో వాళ్లకి కూడా బాగా నచ్చుతాయి.


రూ. 4,725. (ఇక్కడ కొనేయండి)జామెట్రీ సొగసులు


Style Fiesta


మీరు ఏ రకమైన ఫ్యాషన్ శైలి అనుసరించినా సరే.. వాటి మీదకు నప్పుతాయి ఈ చెవిపోగులు. ఈ చెవి రింగులు పెట్టుకొన్నప్పుడు మీ హెయిర్ స్టైల్ పై కూడా జాగ్రత్త వహించాలి. హై పొనీ టెయిల్ అయితే బాగుంటుంది.


రూ.799 (ఇక్కడ కొనేయండి)మెలికల మెరుపు తీగలు


Style Fiesta


చాలామంది అమ్మాయిలు తమ ఫ్రెండ్ సర్కిల్‌లో తామే ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండాలని కోరుకొంటారు. అలాంటి వారికి సరైన ఎంపిక ఈ ట్విస్టెడ్ ఇయర్ రింగ్స్.


రూ.899 (ఇక్కడ కొనేయండి)స్టైల్ స్టైల్ గా


OutHouse


అందంగా తీర్చిదిద్దిన టాజెల్స్‌తో నిండుగా ఉన్న ఈ చెవిపోగులు ఎవరికైనా నప్పుతాయి. వీటిని మీరు అలంకరించుకొంటే చాలు.. ఇక ఏ నగలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మా మాట మీద నమ్మకం లేకపోతే.. మీరే ఓ సారి ప్రయత్నించండి.


రూ.13,500 (ఇక్కడ కొనేయండి)


హూప్ చెవిపోగుల గురించి ఈ ఆర్టికల్‌లో చదివేయండిసీతాకోక సొగసు


OutHouse


ఫ్యాషన్ ఫాలో అయ్యే విషయంలో మిగిలిన వారందరికంటే తాము భిన్నంగా ఉండాలని కోరుకొంటారు అమ్మాయిలు. ఫ్యాషన్ పరమైన మీ అవసరాన్ని తీర్చేవే ఈ చెవిపోగులు. సీతాకోకచిలుకల మాదిరిగా కనిపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ మీ అందానికి  ఆకర్షణను జోడిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


రూ.16,500 (ఇక్కడ కొనేయండి)


ఆఫీసులో పనిచేసేటప్పుడు ఎలాంటి చెవి పోగులు పెట్టుకోవాలో ఈ ఆర్టికల్‌లో చదివేయండి