బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!

బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!

కొన్నిసార్లు ఇత‌రుల మాట‌లు మ‌న‌ల్ని ఎంతగానో ఇబ్బందిపెడ‌తాయి. మీరు బాధ‌లో ఉన్న‌ప్పుడు మీపై సానుభూతి చూపిస్తున్న‌ట్లే చూపించి.. ఇత‌రులు మాట్లాడే కొన్ని మాట‌లు బాధ‌ను త‌గ్గించ‌డం ఏమో గానీ మ‌రింత పెంచుతాయ‌ని చెప్పుకోవ‌చ్చు. మ‌నం ప్రేమ‌లో విఫ‌ల‌మైన‌ప్పుడో లేదా భాగ‌స్వామి నుంచి విడాకులు తీసుకున్న‌ప్పుడో అయితే ఇది మరింత బాధ‌గా అనిపిస్తుంది.


చాలాసార్లు మ‌నం ఎదుటివారికి విష‌యం చెప్పిన త‌ర్వాత వారు అడిగే కొన్ని ప్ర‌శ్న‌లు (Annoying questions) వింటుంటే అస‌లు వీళ్ల‌కు నిజం ఎందుకు చెప్పానా? అనుకుంటూ త‌ల బాదుకోవాల‌నిపిస్తుంది. మ‌న‌సులో మంచి ఉద్దేశం ఉండొచ్చు.. కానీ వారి ప్ర‌శ్న‌లు ఎదుటివారిని ఇబ్బంది పెడ‌తాయ‌ని వారు కూడా గుర్తించాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. బ్రేక‌ప్(Breakup) తర్వాత ఇబ్బంది పెట్టే అలాంటి కొన్ని ప్ర‌శ్న‌ల గురించి తెలుసుకుందాం రండి..


breakup1


1. ఇలా ఎందుకు జ‌రిగింది?


అంటే దీనికి వేరే ఏదైనా అంశంతో సంబంధం ఉంటుందా? నా రాహువు, కేతువు.. ఇలా ఏదో బాగోలేక‌పోతే అలా జ‌రిగింద‌ని మీ ఫీలింగా? నా గ్ర‌హాలు నిజంగా బాగుంటే మీకు చెప్పేదాన్ని కాదేమో..2. నువ్వు బ్రేక‌ప్ చెప్పావా? అత‌డా?


ఇద్ద‌రిలో ఎవ‌రు బ్రేక‌ప్ చెప్పినా జ‌రిగేది ఒక్క‌టే.. ఈ రెండింటిలోనూ నీకు పెద్ద తేడా ఏం క‌నిపిస్తుంది? ఒక‌వేళ ఉన్నా దానితో నీకు సంబంధం ఏముంది?


ఇలా ప్ర‌శ్న‌ల‌తో ఇత‌రులు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఒక డైరీ(రూ.339) కొని అందులో మీ ఫీలింగ్స్ అన్నీ రాసుకోండి.


3. ఈ విష‌యాన్ని అత‌డికి ఎలా చెప్పావు?


ఎలా చెప్పాము.. ఏం చేశాము అన్న‌దాని గురించి వారికి సారాంశం చెబితే స‌రిపోదు. పూర్తిగా స‌వివ‌రంగా అత‌డితో  ఏం మాట‌లు చెప్పామో అవ‌న్నీ వినాలని వీళ్ల ఫీలింగ్ అనుకుంటాను..


breakup2


4. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే మార్గ‌మే లేదా?


చెప్పినందుకు చాలా థ్యాంక్స్‌. మాకు అస‌లు ఇప్ప‌టివ‌ర‌కూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటే బాగుంటుందేమోన‌న్న ఆలోచ‌నే రాలేదు..


ఐ ల‌వ్ మీ మ‌గ్ (రూ. 399)లో కాఫీ తాగుతూ మీ వ్య‌క్తిత్వం చాలా అద్భుత‌మైన‌ద‌ని మీకు మీరే చెప్పుకోండి.


5. అత‌డిని నువ్వు మిస్స‌వుతున్నావా?


హుహ్‌.. ఇప్పుడు గ‌ట్టిగా గాలి పీల్చుకుంటే గానీ ప్ర‌శాంతంగా ఉండ‌లేను..


breakup3


6. ఒంట‌రిగా ఉండేందుకు భ‌యంగా ఉందా?


ఇప్పుడా? అస్స‌లు భ‌యం లేదు. పైగా ఒంట‌రిగా ఉండాల‌ని అనిపిస్తోంది. మీలాంటి వారికి దూరంగా ఉండాలా వద్దా అని ఆలోచించడం కంటే.. ఒంట‌రిగా ఉండాల్సి వ‌స్తే అదే నాకు మంచిది. 


ఫిట్‌బిట్ బ్యాండ్ (రూ. 10,499)తో మంచి ఫిట్‌నెస్ సంపాదించండి. ఎందుకంటే మీరు ఇలాంటివారి నుంచి దూరంగా పారిపోవాలి క‌దా..!


7. మీ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసే ఆలోచ‌న ఏదైనా ఉందా?


ఇంత‌సేపు నేను చెప్పింది అస‌లు మీరు వింటున్నారా? వింటే అస‌లు ఈ ప్ర‌శ్న అడిగేవారు కాదు.


ఈ ఫ్రైస్ బిఫోర్ గాయ్స్ కోట్‌తో ఉన్న ఫోన్ క‌వ‌ర్ (రూ.149)ని మీ ఫోన్‌కి త‌గిలించి మీ ప్రాధాన్యాల‌ గురించి ప్రపంచానికి చాటిచెప్పండి.


breakup4


8. త‌ను ప్ర‌స్తుతం ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాడా?


అత‌డు ఇంకొక‌రితో తిరుగుతున్నా.. తిరగకపోయినా నాకు ఫ‌ర్వాలేదు. కానీ త‌ను వేరేవాళ్ల‌తో తిరుగుతున్న‌ట్లుగా నా మ‌న‌సులో ఓ మంచి ముద్ర వేసుకోవ‌డం వ‌ల్లే.. త‌ను దూర‌మ‌య్యాడ‌న్న ఈ బాధ నుంచి నేను త‌ప్పించుకోగ‌ల‌ను. కాబ‌ట్టి త‌ను నిజంగానే వేరే అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌నే చెబుతా.


9. మ‌రి నువ్వు అత‌డిని మ‌ర్చిపోయావా?


అత‌డిని మ‌ర్చిపోయానో లేదో తెలీదు కానీ ప్ర‌స్తుతానికి ఈ చ‌ర్చ గురించి మ‌ర్చిపోదామ‌నుకుంటున్నా.


breaup5


 


ఇవి కూడా చ‌ద‌వండి.


అమ్మాయిలూ.. 2019లో ఈ మాట‌లు మీరు త‌ప్ప‌క‌ చెప్పాల్సిందే..


కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా?


సెల్ఫ్ లవ్ : మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే


Images : Giphy.