కొత్త ఏడాదిలో కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్. మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాం

కొత్త ఏడాదిలో కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్.  మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాం

కొత్త ఏడాది ప్రారంభమైంది. ఫ్యాషన్ నుంచి బ్యూటీ ఉత్పత్తుల వరకు లేటెస్ట్ ట్రెండ్ అనుసరించడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. దానికోసం అటు అంతర్జాలంలో.. ఇటు దుకాణాల్లో తమకు నచ్చిన, చర్మానికి నప్పే మేకప్ ఉత్పత్తుల కోసం వెతుకుతారు. ప్రస్తుతం మీరు కూడా అదే పనిలో ఉన్నారా? అయితే మీకు సాయం చేసేందుకు మేం కూడా ప్రయత్నిస్తాం. 2019లో ప్రయత్నించదగిన కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ గురించిన సమాచారాన్ని మీముందుచుతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే.. నేను కూడా వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగిద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


Ouai


1-beauty-products-try-in-2019


అందంగా.. అలలా ఎగిరిపడే జుట్టు ఉంటే ముఖారవిందం ఎంత అందంగా ఉంటుంది? మరి అలాంటి కురులు కావాలంటే హాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ లు ఉపయోగించే Ouai ఉపయోగించాల్సిందే. హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ కురుల అందం వెనుక ఉన్నవి Ouai ఉత్పత్తులే. ఇవి ఈ జనవరి చివరికి ఇండియన్ సెఫోరా స్టోర్స్ లో అందుబాటులోకి రానున్నాయి.


Clinique Hydrating Jelly


2-beauty-products-try-in-2019


పారాబెన్స్, సల్ఫేట్స్, ఫ్రాగ్రెన్స్ లేని, జిడ్డుగా అనిపించని మాయిశ్చరైజర్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ క్లినిక్ హైడ్రేటింగ్ జెల్లీని ట్రై చేయండి. ఇది కచ్చితంగా మీకు నచ్చుతుంది. Clinique ఉత్పత్తులు ప్రత్యేకంగా చర్మాన్ని మాయశ్చరైజ్ చేయడానికే తయారుచేస్తున్నారు. నేనైతే ఈ హైడ్రేటింగ్ జెల్లీని ఉపయోగించమని పర్సనల్ గా రికమెండ్ చేస్తాను.


ఇక్కడ కొనండి: క్లినిక్ డ్రమాటికల్లీ డిఫరెంట్ హైడ్రేటింగ్ జెల్లీ. ధర: రూ. 2000


Huda Beauty మెల్టెడ్ ఐ షాడో & ఓవర్ అచీవర్ కన్సీలర్


3-beauty-products-try-in-2019


బ్యూటీ బ్లాగర్ గా ప్రయాణం ప్రారంభించి సౌందర్య ఉత్పత్తులతో ట్రెండ్ సెట్ చేసింది హుడా బ్యూటీ. ఫాల్స్ ఐ లాషెస్(కృత్రిమ క‌నురెప్ప‌లు) తో వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత  ఐషాడో, లిప్ స్టిక్, హైలైటర్స్, ఇతర మేకప్ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. ఈ విషయంలో ఆమె సృజ‌నాత్మ‌కత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ సారి ఆమె రెండు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అవే మెల్టెడ్ ఐ షాడో, ఓవర్ అచీవర్ కన్సీలర్. ఈ కన్సీలర్ ఫౌండేషన్ లా పనిచేసి ఫ్లాలెస్ మేకప్ మీకందిస్తుంది. ఈ రెండు ఉత్పత్తులు ఇండియాలో లాంచ్ అవడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోగా Huda Beauty #FauxFilter Foundation (రూ. 2,990) ట్రై చేయండి.


Fenty Beauty Pro Filt'r Concealers


తన 40 రకాల ఫ్లాలెస్ ఫౌండేషన్స్ తో బ్యూటీ ఇండస్ట్రీని షేక్ చేసింది క్వీన్ రిరి(Queen RiRi). రిహన్నాస్ బ్యూటీ లైన్ నుంచి ఫెంటీబ్యూటీ గతేడాది ఫౌండేషన్ లో 40 రకాల షేడ్స్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది 50 షేడ్స్ ను విడుదల చేయబోతోంది. మీకు ఎన్నారై ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే.. వారిని ఈ ఫెంటీ బ్యూటీ కన్సీలర్ పంపించమని అడగండి.


Neutrogena's Hydro-Boost Collection


4-beauty-products-try-in-2019


కొంతమంది చర్మం పొడిగా ఉన్నప్పటికీ మాయిశ్చరైజర్ రాసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి సరైన ఎంపిక Neutrogena అందించే  Hydro-Boost water gel(రూ. 849). ఇది చర్మంపై చాలా సులభంగా పరుచుకొంటుంది. పైగా జిడ్డుగా అనిపించదు. ఈ సంస్థ అందించే మిగిలిన హైడ్రో బూస్ట్ కలెక్షన్ కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే.


Dior Lip Glow


5-beauty-products-try-in-2019


బ్యూటీ లవర్స్ పర్స్ లో కచ్చితంగా డియోర్ లిప్ గ్లో ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇది పెదవులకు అందమైన రంగుతో పాటు చక్కగా మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది. అంతేకాదు.. పెదవులకు సహజమైన మెరుపు అందిస్తుంది. ఇవి ఇండియాలోని అన్ని సెఫోరా స్టోర్స్ లో లభ్యమవుతున్నాయి.


Sephora Primer Mask


6-beauty-products-try-in-2019


చాలామంది మేకప్ ఆర్టిస్ట్ లు మేకప్ వేయడానికి ముందు షీట్ మాస్క్ ను ఉపయోగిస్తారు. ఇది మెరిసే చర్మాన్ని మీకందిస్తుంది. షీట్ మాస్క్ తో పాటుగా ప్రైమర్ కూడా కలిపి ఉన్న మాస్క్ అయితే చాలా బాగుంటుంది కదా.. అందుకే సెఫోరా ప్రైమర్ మాస్క్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ షీట్ ఉపయోగిస్తే మేకప్ వేసుకొన్నప్పుడు మాయిశ్చరైజింగ్, ప్రైమింగ్ ఒకేసారి వేసుకొన్నట్టే. అందుకే నేను దాన్ని ఇప్పుడే కొనేస్తున్నా.


ఇక్కడ కొనండి: Sephora The Primer Mask (రూ. 500)


GLAMGLOW - Starpotion™ Liquid Charcoal Clarifying Oil


7-beauty-products-try-in-2019


చర్మాన్ని మెరిపించి, అందంగా కనిపించేలా చేసే Supermud Clearing Treatment (రూ. 1,750) తో అందరికీ సుపరిచితమైంది గ్లామ్ గ్లో. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ గ్లామ్ గ్లో సంస్థ ఇటీవలే చార్కోల్ ఫేషియల్ నూనెను మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది దాదాపుగా అన్ని బ్యూటీ బ్రాండ్స్ ఫేషియల్ నూనెలను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. ఈ ఏడాది అదే బాటలో గ్లామ్ గ్లో కూడా నడిచింది. చార్కోల్ తో తయారైన ఈ నూనె చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. అందుకే మీరు కూడా దీన్ని ఓ సారి ప్రయత్నించి చూడండి.


ఇక్కడ కొనండి: స్టార్ పోషన్ లిక్విడ్ చార్కోల్ క్లారిఫైయింగ్  ఆయిల్ (ధర: రూ . 3,950)


ఇవి కూడా చదవండి


గ్లోయింగ్ స్కిన్ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


15 అమేజింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి