home / లైఫ్ స్టైల్
జయహో మహిళ… “నారీ శక్తి”కి అసలైన నిర్వచనం.. ఈ గణతంత్ర దినోత్సవం

జయహో మహిళ… “నారీ శక్తి”కి అసలైన నిర్వచనం.. ఈ గణతంత్ర దినోత్సవం

భారతదేశం తనకి తానుగా ఒక రాజ్యాంగాన్ని రచించుకుని దాని అమలుచేసిన రోజుగా ప్రసిద్ధికెక్కిన జనవరి 26ని ప్రతి యేటా మనం గణతంత్ర దినంగా (Republic Day) జరుపుకుంటుంటున్నాము. గత 70 ఏళ్ళుగా అంటే 1950 నుండి ఈ సంప్రదాయానికి తెరతీయడం జరిగింది. ఇక ప్రతి గణతంత్ర దినోత్సవానికి భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని రాజధాని ఢిల్లీలోని ఆవిష్కరించడంతో మొదలయ్యే ఈ వేడుకలు 29 జనవరి నాడు మన దేశ త్రివిధదళాలు చేసే బీటింగ్ రిట్రీట్‌తో ముగుస్తాయి. ఇదే సంప్రదాయం గత 70 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తోంది.

Assam-Rifles-1

Image: Official Twitter/Assam Rifles

ఇక ఈ వేడుకలకి ప్రపంచంలోని ఏదో ఒక దేశం నుండి ఆ దేశ ప్రధాని లేదా రాష్ట్రపతిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ సంవత్సరం ముఖ్య అతిధిగా సౌతాఫ్రికా (South Africa) దేశ అధ్యక్షుడు మటమేలా సిరిల్ రమఫోజా (Matamela Cyril Ramaphosa) గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 90 నిమిషాల పాటు జరిగే పరేడ్ ఈ సంవత్సరం కూడా జరిగింది. అయితే ఈ సంవత్సరం త్రివిధదళాలకి ముందు అస్సాం రైఫిల్స్ రెజిమెంట్ (Assam Rifles Regiment) పరేడ్ చేసింది. ఈ సంవత్సరం ఈ పరేడ్ ఈ రెజిమెంట్‌తో ప్రారంభం అయ్యింది. మేజర్ ఖుష్బూ కన్వర్ (Major Khushbu Kanwar) ఈ రెజిమెంట్‌కి నాయకత్వం వహించారు.

Republic-Day-12x

Image: Twitter/PMO

ఈ సంవత్సరం పరేడ్‌లో మహిళలు అత్యంత ఆకర్షణగా నిలిచారు. మోటార్ సైకిల్స్‌తో స్టంట్ చేసే డేర్ డెవిల్ టీంలో తొలిసారిగా శిఖ సురభి (Shikha Surabhi) స్టంట్స్ చేశారు. తద్వారా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా శిఖ రికార్డులకెక్కారు. ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణగా 90 ఏళ్ళు పైబడిన నలుగురు ఆర్మీ వెటరన్స్ వేడుకలలో పాలుపంచుకున్నారు.

ఇక ఈ పరేడ్‌లో ప్రదర్శించే యుద్ధ క్షిపణులు, ట్యాంకర్లతో పాటుగా ఈ సంవత్సరం అమెరికా నుండి కొనుగోలు చేసిన అత్యాధునిక M7777 ఆర్టిల్లరీ గన్ సిస్టంని కూడా ప్రదర్శించారు. వీటితో పాటుగా త్రివిధదళాలకి చెందిన యుద్ధ సామాగ్రిని ఈ పరేడ్‌లో ప్రదర్శించారు.

Bhavana-Kasturi-1

Image: Twitter/AjayKumarNandy

ఇక ప్రతియేడు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అందరిని ఆకట్టుకునే వివిధ రాష్ట్రాలు మరియు మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలు ఈసారి కూడా పరేడ్‌లో పాల్గొన్నాయి. సుమారు 22 శకటాలు (Tableaux) పాల్గొన్నట్లు సమాచారం. అలాగే దేశనలుమూలల నుండి 58 మంది గిరిజనుల్ని అతిధులుగా ఈ వేడుకలకి ఆహ్వానించారు.

Dancing-Girls-in-Republic-Day

Image: Twitter/Prime Minister of India

ఇవే వేడుకల్లో ఆర్మీ, నేవీ & ఎయిర్ ఫోర్స్‌లలో సేవలు అందించిన సైనికులకి వారి త్యాగాలని గుర్తిస్తూ పరమ వీరచక్ర (Param Vir Chakra), వీర చక్ర (Vir Chakra), & మహా వీర చక్ర (Maha Vir Chakra), అశోక చక్ర (Ashoka Chara) మెడల్స్‌ని అందచేయడానికి రంగం సిద్ధమైంది. అలాగే గత సంవత్సరం తమ ధైర్యాన్ని ప్రదర్శించిన పిల్లలకు సాహస బాలల (Sahas Bal Awards) అవార్డులని సైతం ఇక్కడ ప్రదానం చేయనున్నారు.

ఇలా ఈ సంవత్సరం 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు చూడడానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 7 జనవరి నుండి 25 జనవరి వరకు ఈ వేడుకలకి సంబంధించిన టికెట్స్‌ని విక్రయించారు. ఆసక్తి ఉన్నవారు అక్కడ టికెట్స్‌ని కొనుక్కొని ప్రత్యక్షంగా ఈ వేడుకల్ని వీక్షిస్తున్నారు. ఢిల్లీ వరకు వెళ్ళని వారు మన టీవీల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకల్ని వీక్షించవచ్చు.

ఈ సందర్భంగా పాఠకులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు…

Featured Image: Twitter/Assam Rifles

ఇవి కూడా చదవండి

ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశ‌భ‌క్తిని మ‌రింత పెంచుతాయి..!

రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

దేశభక్తిని ఆవిష్కరించిన.. అద్భుత సినీ ఆణిముత్యాలు ఇవే..!

24 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this