లిఫ్ట్‌లో అధర చుంబనం.. ఎలివేటర్ కిస్సింగ్ స్టోరీస్ మీ కోసం..

లిఫ్ట్‌లో అధర చుంబనం.. ఎలివేటర్ కిస్సింగ్ స్టోరీస్ మీ కోసం..

1. లిఫ్ట్ పుణ్యమాని మా ప్రేమ పట్టాలెక్కింది..


నాలుగు నెలల క్రితమే అతడు మా అపార్ట్ మెంట్‌లోకి వచ్చాడు. అతన్ని చూసిన క్షణం నుంచీ నేను తనను ఇష్టపడసాగాను. నెమ్మదిగా మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పిచ్చాపాటి కబుర్ల నుంచి మా ఇష్టాయిష్టాలు తెలుసుకొనేంత వరకు మా పరిచయం పెరిగింది. అతని స్పర్శ నాపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. నాకూ తనంటే ఇష్టమే. కానీ తను బయటపడకుండా.. నేను నా మనసుని అతని ముందుంచడం ఎలా? కొన్ని రోజుల క్రితం అతనితోపాటే నేనూ లిఫ్ట్‌లో వెళుతున్నాను. ఆ సమయంలో ఇంకెవరూ లేరు.


మేమిద్దరమే ఉండటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఉన్నట్టుండి.. అతను నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకొన్నాడు. అది నాలో పులకింతలు కలిగించింది. నా మనసులోని మాటను తన ముందుంచడానికి అదే సరైన సమయమని భావించాను. వెంటనే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేశాను. నాకు తెలుసు లిఫ్ట్ మళ్లీ స్టార్ట్ అవ్వాలంటే ఇంకాస్త సమయం పడుతుందని. అందుకే ధైర్యం చేశా.


నా మనసులో మాట అతని ముందుంచాను.. తనూ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు చెప్పాడు. నన్ను హత్తుకొన్నాడు. అసలే హాట్ హాట్‌గా ఉన్నవాతావరణం మరింత హాట్‌గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మేం చేసిన అడ్వెంచర్ మాకు ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.2. లిఫ్ట్‌లో ఆ కిస్ భయాన్ని పోగొట్టొంది..


లిఫ్ట్‌ (lift) ఎక్కాలంటే నాకు కాస్త భయం. ఏమో నేను ఎక్కగానే లిఫ్ట్ ఆగిపోతుందేమో? అలా కిందికి పడిపోతుందేమోననే భయం నాకు. లిఫ్టే కాదు.. ఎస్కలేటర్ ఎక్కాలన్నా నాకు భయమే. అవును మీరనుకొంటున్నది నిజమే. నాకు కాస్త క్లాస్ట్రోఫోబియా ఉంది. అందుకే నేనెప్పుడూ మెట్లు ఎక్కే వెళతాను. నా వెంట స్నేహితులు వస్తే వారు కూడా అలాగే వస్తారు. నా బాయ్ ఫ్రెండ్ అయితే చాలా సార్లు నన్ను లిఫ్ట్‌లో తీసుకెళ్లాలని ప్రయత్నించేవాడు. కానీ అతని వల్ల కాలేదు.


కానీ ఓ సారి లిఫ్ట్ ఎక్కక తప్పని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే బిల్డింగ్‌లోని 15 వ అంతస్థులోకి మేం వెళ్లాలి. ఇక తప్పదని భయపడుతూనే.. నేను లిఫ్ట్‌లోకి అడుగుపెట్టాను. అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు. భయపడుతున్న నన్ను దగ్గరికి తీసుకొన్నాడు. కాస్త ధైర్యంగానే అనిపించినా.. భయం మాత్రం వదల్లేదు. నన్ను మరిపించడానికో  ఏమో.. తను నన్ను ముద్దు (kiss) పెట్టుకొన్నాడు. అంతే భయం ఎక్కడకి వెళ్లిందో ఏమైందో తెలీదు. 15 ప్లోర్‌లో నేను కళ్లు తెరిచాను. అప్పటి నుంచి ఆ తీపి జ్ఞాపకాన్ని తలుచుకొనేందుకు నేను లిఫ్ట్‌లోనే వెళుతున్నాను.3. లిఫ్ట్‌లో ఆ ఐదు నిమిషాలు..


లిఫ్ట్ గురించి మనం ఒక విషయం ఒప్పుకోవాల్సిందే. అదెప్పుడూ రొమాంటిక్‌గా.. హాట్ హాట్‌గా ఉంటుంది. ఇంత చిన్న లిఫ్ట్‌లో ఇద్దరు మాత్రమే ఉంటే..? ఇక వారి మనసుని ఆపతరమా? కొన్ని రోజుల క్రితమే నాకు ఇలాంటి తియ్యని అనుభవం ఎదురైంది. పార్టీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మా ఫ్లాట్‌కి వెళ్లడానికి  నేను, నా భర్త లిఫ్ట్ ఎక్కాం. అందులో మేమిద్దరమే ఉన్నాం. డోర్ క్లోజ్ అవ్వగానే తను నన్ను దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకొంటుంటే.. మా తొలిముద్దు అనుభవం మళ్లీ గుర్తొచ్చింది.


ముఖ్యంగా నా ఫాంటసీ లిస్ట్‌లోని ఒక విష్ పూర్తవబోతోన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా కోరిక తీర్చేందుకేమో నా భర్త స్టాప్ బటన్ నొక్కి లిఫ్ట్ ఆపేశారు. మరికాసేపు అక్కడే అలాగే గడిపి మా ఫ్లాట్‌కి చేరుకొన్నాం. ఈ ఐదు నిమిషాల లిఫ్ట్ ప్రయాణం నా జీవితంలో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్‌గా మిగిలిపోయింది. అప్పటి నుంచి నేను లిఫ్ట్‌ను లిఫ్ట్‌గా చూడటం మానేశాను. ఎందుకంటే అది నాకు రొమాంటిక్ కిస్సింగ్ ప్లేస్‌గా మారిపోయింది కదా..!Images: Giphy, Shutterstock


ఇవి కూడా చదవండి


ఫ్రెంచ్ కిస్ కథా కమీమాషు ఏమిటి.. ఈ వ్యాసం ఆంగ్లంలో చదవండి


తొలిముద్దు తియ్యదనం ఏమిటో తెలుసా.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


ముద్దిచ్చే భర్త కోసం భార్యకు 15 సూత్రాలు.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి