ADVERTISEMENT
home / వినోదం
బాక్సాఫీస్ రేసులో సంక్రాంతి సినిమాలు.. ఇదే మా ప్రోగ్రస్  రిపోర్ట్..!

బాక్సాఫీస్ రేసులో సంక్రాంతి సినిమాలు.. ఇదే మా ప్రోగ్రస్ రిపోర్ట్..!

తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి సంక్రాంతి (Sankranthi) సీజన్ మంచి వసూళ్ళకి అవకాశం ఉండేదిగా ప్రసిద్ధి. అలాగే ఈ సీజన్‌లో విడుదలయ్యే చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కురిపించడమే కాకుండా పండగ సమయంలో సినీ అభిమానులకి కూడా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంటాయి.

ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి నాలుగు చిత్రాలు వచ్చాయి. మరి ఆ చిత్రాలు ప్రేక్షకుల మనసుని ఎంతవరకు గెలుచుకున్నాయి అనే విషయాన్ని కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం…

ముందుగా జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) గురించి మాట్లాడుకుంటే – ఈ చిత్రం పైన విడుదలకి ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని దర్శకుడు క్రిష్ (Krish) అందుకోగలడా అన్న మీమాంసల నడుమ ఈ చిత్రం విడుదలకావడం.. హిట్ అవ్వడం జరిగిపోయాయి.

అభినయం విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగానే ఈ పాత్రని చేయడంతో.. ఆ పాత్రకి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇతర నటీనటుల వర్గం కూడా తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ చిత్రం రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పండగ సమయానికి హౌస్ ఫుల్స్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. 

ADVERTISEMENT

ntr-kathanayakudu-1

ఇక ఈ సీజన్‌లో విడుదలైన రెండవ చిత్రం – పేట (Petta). సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తమిళంలో  చేసిన ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ చేయబడింది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్ దొరకడం లేదు అన్న విమర్శల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అలా విడుదలైన ఈ చిత్రానికి కాస్త మందకొడిగానే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే తమిళనాట వచ్చిన పాజిటివ్ టాక్‌కి తోడుగా ఇక్కడ కూడా పర్వాలేదు అన్న మౌత్ పబ్లిసిటీ వల్ల రెండో రోజు నుండి కాస్త వసూళ్ళు మెరుగుపడ్డాయి అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక తెలుగులో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుంది ఈ చిత్రం అన్నది మొదటివారం పూర్తయ్యాక కాని తెలవదు.

petta-1

ఈ సంక్రాంతి సందర్బంగా ముచ్చటగా విడుదలైన మూడవ చిత్రం వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama). మొదటిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Powerstar Ram Charan) & దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కలయికలో వస్తున్న ఈ చిత్రం పై మెగా అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.

ADVERTISEMENT

అలాగే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో కూడా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది అన్న నమ్మకం వ్యక్తం చేయడం జరిగింది. తీరా విడుదలయ్యాక చూస్తే, ఈ చిత్రం మిశ్రమ స్పందనలను పొందింది. ఇక కొందరు అభిమానులు సైతం ఈ చిత్రం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మొదటిరోజు వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నా.. రెండవ రోజు నుండి వసూళ్ళు తగ్గుముఖం పడుతున్నాయని పలు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

vinayavideyarama-1

ఇక ఈ సీజన్‌లో ఆఖరుగా వచ్చినా.. ఆకర్షణీయంగా వచ్చిన చిత్రం F2. టీజర్ విడుదలైన రోజే ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రతిఒక్కరిలో కలిగింది. అదే నమ్మకాన్ని పెంచుతూ ట్రైలర్ సైతం సూపర్ హిట్ ఆశలని రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రం విడుదలయ్యాక సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేష్ (Venkatesh)-వరుణ్ తేజ్ (Varun Tej)ల అభినయానికి తమన్నా-మెహ్రీన్‌లు గ్లామర్ తోడవ్వడంతో సినిమా అభిమానులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచింది.

f2images

ADVERTISEMENT

ప్రకాష్ రాజ్ (Prakash Raj), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) లతో పాటు సుమారు 10 మంది ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోయిందని… ఈ సీజన్‌లో చూడదగ్గ కుటుంబకథా చిత్రమని ప్రేక్షకులు అంటున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోయే అవకాశం ఉందని.. ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవండీ.. ఈ నాలుగు పందెం కోళ్ళ (సినిమాల) విశేషాలు. ఇదే మేము అందిస్తున్న ఈ సంవత్సరపు సినిమాలకి సంబంధించిన సంక్రాంతి సీజన్ ప్రోగ్రస్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి

F2 (ఫన్ & ఫ్రష్ట్రేషన్) సినిమాని ఎందుకు చూడాలంటే.. ?

ADVERTISEMENT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘వినయ విధేయ రామ’ ప్రత్యేకతలేమిటి..?

సంబ‌రాల సంక్రాంతి.. ఈసారి టాలీవుడ్‌కి ఎలాంటి విజయాలను అందిస్తోంది..?

 

 

ADVERTISEMENT
13 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT