ADVERTISEMENT
home / వినోదం
శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?

శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్..?

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం “అరవింద సమేత”  (Aravindha Sametha) లోని  టార్చ్ బేరర్ సన్నివేశంలో రావు రమేష్ మాట్లాడుతూ  “సినిమాల్లో కొత్తగా వచ్చేదానినే ట్రెండ్ అంటారు”  అని చెబుతాడు. గుర్తుందా మీకు?! ఇప్పుడు అలాంటి ఒక ట్రెండ్ భారతీయ చలనచిత్ర సీమని ఒక మలుపు తిప్పుతోంది. అదే బయోపిక్ ట్రెండ్.

పేరెన్నిక గల వ్యక్తుల నిజజీవిత పాత్రలాధారంగా రూపొందుతున్న చిత్రాలకి ప్రేక్షకుల దగ్గర నుండి చాలా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సదరు పాత్రకి సంబంధించి.. ఏదైనా ఒక వివాదస్పద అంశం ఉంటే ఆ బయోపిక్‌కి ఏమిచేయకుండానే క్రేజ్ వచ్చేస్తోంది.

ఈ మధ్యనే తెలుగు చిత్రసీమలో కూడా ఇటువంటి కొన్ని బయోపిక్స్ రాగా మరికొన్ని విడుదలకి సిద్ధమవుతున్నాయి. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు ఇప్పటికే విడుదలై హిట్ సినిమాలుగా నిలవగా.. యాత్ర, ఎన్టీఆర్ మహానాయకుడు,లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. క్రీడాకారుల జీవితాల ఆధారంగా వస్తున్న బయోపిక్స్‌కు కూడా ఈ రోజుల్లో కొదువ లేదు. ముఖ్యంగా సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్  & పీవీ సింధు‌లకు సంబందించిన చిత్రాల నిర్మాణం శరవేగంగా జరగనుంది.

ఇలాంటి తరుణంలో నటీనటులు కూడా ఇటువంటి బయోపిక్స్‌లో నటిస్తే.. అవి తమ కెరీర్‌కి బాగా ఉపయోగపడతాయన్న అభిప్రాయంతో ఆసక్తి చూపుతున్నారు. అలాగే అలా లభించే అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ జాబితాలో ముందున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).

ADVERTISEMENT

ఈమె ఇప్పటికే నటి శ్రీదేవి బయోపిక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. 2018లో ఎవ్వరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచివెళ్ళిన శ్రీదేవి చాలామంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఆ హఠాత్ పరిణామం తన కుటుంబసభ్యులనే కాకుండా యావత్ సినీప్రపంచాన్ని శోకసముద్రంలో ముంచేసింది. ఇక ఆమె సినీ కెరీర్ ఒకసారి పరిశీలిస్తే, 54 ఏళ్ళ తన జీవితంలో 4 ఏళ్ళ వయసులో మేకప్ వేసుకోగా.. ఆమె చనిపోయే ముందు వరకు నటించడం జరిగింది.

మధ్యలో ఒక రెండు దశాబ్దాల పాటు కెమెరాకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆమెకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు అన్నది అక్షర సత్యం. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరగగా అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన వేలాదిమంది జనాన్ని చూస్తేనే ఆమె ఎంతటి పెద్ద స్టార్ అనేది మనకి అర్ధమైపోతుంది.

ఈ తరుణంలో ఆమె జీవితం పై ఒక బయోపిక్ రావాలన్న కోరిక ఆమె అభిమానుల నుండి వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్టుగానే శ్రీదేవి భర్త సినీ నిర్మాత బోనీ కపూర్ (Boney kapoor) కూడా ఈ మధ్య ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన భార్య జీవితానికి సంబంధించి.. తను తప్ప మరెవరు కూడా బయోపిక్ తీయకూడదని అనుకున్నాడేమో తెలియదు  కానీ..  శ్రీదేవి బయోపిక్‌కి తానే నిర్మాతగానూ, దర్శకుడిగానూ ఉండబోతున్నట్టుగా తన సన్నిహితుల ద్వారా మీడియాకి సమాచారాన్ని అందించాడు.

ఇక ఈ వార్త బయటకి రాగానే దేశవ్యాప్తంగా ఉన్న నటీమణుల్లో చాలామంది.. ఈ బయోపిక్‌లో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా శ్రీదేవి పాత్ర పోషించాలన్నది తన కల అని చెబుతూ కుండబద్దలు కొట్టేసింది.

ADVERTISEMENT

rakulpreet-in-kathanayakudu

అయితే ఆమెకి ఈ కోరిక కలగడానికి పరోక్షంగా ఓ కారణం కూడా ఉందండోయ్. ఆమె ఈ మధ్యనే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఒక సన్నివేశంలో శ్రీదేవిలా నటించింది. ఎన్టీఆర్-శ్రీదేవి (NTR-Sridevi) నటించిన “వేటగాడు” చిత్రంలోని “ఆకు చాటు పిందె తడిసే” పాటలో బాలకృష్ణ  సరసన నటించింది. దీనికిగాను ఆమెకి మంచి మార్కులే పడ్డాయి. అలా రకుల్‌కి శ్రీదేవి పాత్ర పై మనసు మళ్లిందని టాక్.

అయితే శ్రీదేవిలో అందాన్ని ఎంతలా ఇష్టపడతారో.. ఆమెలోని అభినయానికి కూడా అంతమందే అభిమానులున్నారు. అటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి శ్రీదేవి. అలాంటి ఆమె జీవితం పై తీయబోతున్న చిత్రంలో టైటిల్ రోల్ అంటే అంత సులభం మాత్రం కాదు. అలాంటి పాత్ర చేయడానికి రకుల్ ప్రీత్ సరిపోదు అని అప్పుడే ఒక వాదన మొదలవ్వగా.. మహానటి చేసేముందు కీర్తి సురేష్‌ని కూడా సావిత్రి పాత్రలో ఊహించలేకపోయిన విషయం గుర్తుచేస్తున్నారు మరికొంతమంది.

ఏదేమైనా.. నటించాలి అని కోరిక ఉండడం.. దానికోసం ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే చిత్రపరిశ్రమ అంటేనే అదృష్టం మీద నడిచే ఒక పరిశ్రమగా జనాల్లో స్ధిరపడిపోయింది. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ కోరిక కూడా నిజమవ్వాలంటే మాత్రం.. అదృష్టమే కలిసిరావాలి.

ADVERTISEMENT

చూద్దాం.. రకుల్ ప్రీత్‌కి ఆ అదృష్టం ఉందో? లేదో?

ఇవి కూడా చదవండి

తండ్రికి త‌గిన త‌న‌య‌.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అనిపించుకున్న శృతీ హాసన్..!

రాణీ లక్ష్మీబాయి పాత్రకు వన్నె తెచ్చిన.. కంగనా రనౌత్ చిత్రం “మణికర్ణిక” (సినిమా రివ్యూ)

ADVERTISEMENT

అందరిలోనూ ఆసక్తి రేపుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్కింగ్ స్టిల్స్

 

28 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT