కౌగిలింత.. ప్రేమను ప్రేమగా వ్యక్తం చేస్తుంది. సంతోషమైనా.. బాధైనా.. మనసుకి నచ్చిన వ్యక్తితో పంచుకోవడానికి కౌగిలిని మించిన మార్గం మరొకటి ఉంటుందా? ఆ సమయంలో మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. మనకే ఇలా ఉంటే.. మనల్ని ప్రేమగా దగ్గరగా తీసుకొన్నవారికి ఎలా ఉంటుంది? ఆ అనుభూతి గురించి కొందరు అబ్బాయిలు (మోడరన్ రోమియోలు) Quora లో పంచుకొన్నారు. తమ ప్రేయసిని కౌగిలించుకొన్నప్పుడు వారి మనసులో ఎలాంటి భావాలకు గురయ్యారో వివరించారు.
1. ఆమెను మొదటిసారి హత్తుకున్న క్షణం నాకింకా గుర్తుంది. తొలి కౌగిలి అందించిన అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. అది నిజంగా ఓ అద్భుతం. ఆ మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలను వెతుక్కున్నారు. ‘ఆమె కురులు పట్టులా ఉన్నాయి. పూల సుగంధాలను వెదజల్లుతున్నాయి. ఎప్పటికీ ఆమెను అలాగే పట్టుకొని ఉండిపోవాలనిపించింది’. – ఆకాశ్ ఆనంద్.
2. ‘కౌగిలించుకొన్న తర్వాత..నా కళ్లలోకి చూడకు. నాకు సిగ్గేస్తుంది. వద్దన్నా వినకుండా అలా చూస్తే ఎలా? సరే.. నన్ను పెళ్లి చేసుకో..’ – లక్ష్య కౌశిక్.
3. ‘ఆమెను ప్రేమగా హత్తుకున్నప్పుడు నా పట్ల ఆమెకున్న ప్రేమను అనుభవించానంతే. అది తియ్యనైన భావన. ఆ క్షణంలో నా మనసులో ఎన్నో భావాలు చెలరేగాయి. ‘ఐ లవ్ యూ’, ‘ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు’, ‘నేను చాలా లక్కీ’, ‘ఎప్పటికీ నాతోనే ఉండిపో ప్లీజ్’, ‘నన్ను ముద్దు పెట్టుకోవా’ ఇవన్నీ నా మనసులో అలా వచ్చి వెళ్లిపోతున్నాయి. కానీ ఆ కౌగిలితో ఆమె ప్రేమను అనుభవిస్తున్న భావన మాత్రం అలా ఉండిపోయింది. – అనికేత్ కదమ్.
4. ‘ప్రేమించిన అమ్మాయి కౌగిలిలో కరిగిపోవడాన్ని మించిన ఆనంద ఇంకేముంటుంది. నేను నా ప్రేయసిని తొలిసారి కౌగిలించుకొన్నప్పుడు నా మనసులో ఎలాంటి ఆలోచనలు రావు. నా మనసు పూర్తిగా భావోద్వేగంతో నిండిపోయింది. చాలా తృప్తిగా అనిపించింది.’- కొనోర్ క్లార్క్.
5. ‘నేను నా ప్రేయసిని హత్తుకొన్నప్పుడు తనపై నాకెంత ప్రేమ ఉందో తెలియజేయాలనుకొంటా. నా కౌగిలింత ద్వారా ఆమె పట్ల ఎంత శ్రద్ధ తీసుకోవాలో ఆమెకు తెలియజేయాలనుకొంటా.’ – మహదేవన్ వెంకట్రామన్
కౌగిలి గురించి Quora లో మిగిలిన వారి అభిప్రాయాలు కూడా చదవండి.
సో అమ్మాయిలు.. అబ్బాయిలు ఏమనుకొంటున్నారో తెలుసుకొన్నారుగా.
ఇవి కూడా చదవండి
కొన్ని ప్రేమబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసా
సెల్ఫ్ లవ్: మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే
టీనేజ్ క్రష్.. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్.. అచ్చం సినిమా లాంటి ప్రేమకథ