తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!

తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!

జీవితంలో మ‌నం ఎన్ని విజ‌యాలు సాధించినా మొద‌టి ఉద్యోగం అందించే సంతోషం ఇంకేదీ ఇవ్వ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.. ఎట్ట‌కేల‌కు చ‌దువు పూర్తిచేశామ‌న్న సంతృప్తి ఒక‌వైపు.. ఇక‌పై మ‌ళ్లీ ప‌రీక్ష‌ల‌కు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేద‌నే ఆనందం మ‌రోవైపు.. వీట‌న్నిటితో పాటు కొత్త ఉద్యోగం ఇచ్చే కిక్కే వేర‌ప్పా అని చెప్పుకోవాల్సిందే.. అయితే ఉద్యోగం సంపాదించేశాం అన్నసంతోషం కంటే మొద‌టిసారి జీతం తీసుకున్న‌ప్పుడు మ‌న‌కు క‌లిగే ఫీలింగ్ ఎంతో ప్ర‌త్యేకం అని చెప్పుకోవాలి.


ఉద్యోగం సాధించిన‌ప్పుడు క‌లిగే ఆనందం జీవితంలో మ‌రో జాబ్ మారిన‌ప్పుడు క‌లుగుతుందేమో గానీ.. మొద‌టిసారి జీతం వ‌చ్చిన‌ప్పుడు ఎదుర‌య్యే ఫీలింగ్ మాత్రం మ‌రోసారి అనుభ‌వించ‌లేం.. అంతే కాదు.. ఆ ఫీలింగ్‌ని జీవితాంతం మ‌ర్చిపోలేం కూడా.. మ‌రి, తొలిసారి జీతం (salary) అందుకున్న అమ్మాయి ఎలా ఫీల‌వుతుందో తెలుసా? ఒక‌సారి చూసేద్దాం రండి..1.వావ్‌.. ఎట్ట‌కేల‌కు నా జీతం వ‌చ్చేసింది.. నేను ఇంత పెద్ద‌దాన్ని అయిపోయానంటే నాకే న‌మ్మ‌కం కుద‌ర‌ట్లేదు..ఇప్ప‌టివ‌ర‌కూ అంద‌రూ మిమ్మల్ని చిన్న‌ పిల్ల‌గా చూసేవారు కానీ ఇప్పుడు మీరు పెద్ద‌వాళ్ల‌యిపోయారు.
2. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అమ్మాయిని.. ఏదైనా సాధించ‌గ‌ల‌ను. న‌న్ను స‌క్సెస్‌ఫుల్ కాకుండా ఎవ‌రూ ఆప‌లేరు..బాస్ లేడీ అంటే నేనే!3. అయ్యో.. నా జీతం నుంచి ట్యాక్స్ క‌ట్ అవుతుంది క‌దా.. నేను ఆ విష‌య‌మే మ‌ర్చిపోయాను.. అయినా ఈ ప్రభుత్వానికి నా డ‌బ్బులతో ఏం అవ‌స‌ర‌మో..
4. అయ్యో.. నా జీతం మొత్తం ఇంతేనా.. నేను నెలంతా ప‌నిచేసింది కేవ‌లం ఈ మాత్రం జీతానికేనా.. ఇది చాలా త‌క్కువ‌.. అనుభ‌వం ఉంటే కాస్త ఎక్కువొచ్చేదేమో..5. అయినా ఫ‌ర్వాలేదులే.. ఇది నా మొద‌టి జీత‌మే క‌దా.. త‌ర్వాత అనుభ‌వం పెరుగుతున్న కొద్దీ నాకు జీతం పెరుగుతుందిగా..ఇప్పుడైతే నా మొద‌టి జీతం తీసుకున్నా అన్న ఆనందం నాకు చాలు..
6. ఈ జీతంతో ముందు అమ్మానాన్న‌ల‌కు ఏదైనా ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తి కొంటాను.. తాత, బామ్మ‌ల‌కు కూడా.. వాళ్లంద‌రి వ‌ల్లేగా నేను ఈ స్థానంలో ఉన్నా.7. నా కోసం జారాలో పోయిన వారం చూసిన డ్ర‌స్సు కొనుక్కుంటా. నేను గ‌త నెల‌లో కొన్న హీల్స్ ఆ డ్ర‌స్సుకి చ‌క్క‌గా న‌ప్పుతాయి.
8. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో.. నేను ఇది తీసుకుంటాను.. అరె ఇది కూడా బాగుందే.. దీన్ని కూడా కొంటా.. ఇంకోటి కూడా అందంగా ఉంది. దీన్ని కూడా.. అమ్మో.. నేను షాపింగ్‌కి అతుక్కుపోతున్నా..9. అమ్మో.. అప్పుడే ఆరువేలు అయిపోయాయా? కాస్త నెమ్మ‌దిగా ఆలోచించి ఖ‌ర్చు చేయాలి.. ముందు ఖ‌ర్చుల నుంచి దూరంగా ఉండేందుకు కాస్త మెడిటేష‌న్ అవ‌స‌రం.. గ‌ట్టిగా గాలి లోప‌లికి పీల్చి వ‌ద‌లాలి.. హ‌మ్మ‌య్య‌.. అయిపోయింది..9. ఈ వీకెండ్‌లో నేను ఎప్ప‌టినుంచో వెళ్లాల‌నుకుంటున్న ఆ పెద్ద రెస్ట‌రంట్‌కి వెళ్లి నాకు న‌చ్చ‌ని వంట‌కాల‌న్నీ ఆర్డ‌ర్ చేస్తాను. ఇంత సంపాదించినందుకు నాకోసం నేను ఆమాత్రం చేసుకోవాల్సిందే..10. కానీ ఇప్ప‌టినుంచే నా భ‌విష్య‌త్తు కోసం ఆలోచించి మంచి నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉందేమో.. మ్యూచువ‌ల్ ఫండ్స్ గురించి.. సిప్ గురించి ఆ యాడ్‌లో చూశా క‌దా.. దాని గురించి కాస్త ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటా.11. అయినా పొదుపు చేసుకోవ‌డానికి నేను చాలా చిన్న‌దాన్ని. మ‌రికొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్రారంభిస్తాను. అయినా రేపేం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు.. మ‌నం బ‌తికున్న‌ప్పుడే ఆనందంగా న‌చ్చిన‌ట్లు జీవించాలి.
12. డ‌బ్బుల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో.. అమ్మానాన్న‌లు దీన్ని అంత సులువుగా ఎలా చేసేస్తారు? వాళ్ల‌ను అడిగి డ‌బ్బు ఎలా ఖ‌ర్చు చేయాలో నిర్ణ‌యించుకుంటా.. నేను అనుకున్న‌ట్లు నేను ఇండిపెండెంట్ కాద‌ని ఇప్పుడు నాకు అర్థ‌మ‌వుతోంది.13. అయినా.. ఈరోజు కాక‌పోతే రేపైనా నేను అవి నేర్చుకోవాల్సిందే క‌దా.. నేను పెద్ద‌దాన్నయిపోయా. నాకు నేనే అవ‌న్నీ నేర్చుకోగ‌ల‌ను.. మిగిలిన‌వ‌న్నీ నేర్చుకుంటున్న‌ప్పుడు ఇది మాత్రం నేర్చుకోలేనా?
14. ఇప్ప‌డు జీతం వ‌చ్చేసిందంటే మ‌ళ్లీ జీతం రావ‌డానికి కేవ‌లం 30 రోజులు మాత్ర‌మే ఉంది.. యాహూ..!ఇవి కూడా చదవండి


మీటూ ఉద్యమం గురించి వ్యాసాన్ని తెలుగులో చదవండి


మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఈ పనులు చేయాల్సిందే


లక్ష్యం చేరుకొనే ప్రయాణంలో మనం నేర్చుకొనే పాఠాలివే