ADVERTISEMENT
home / సౌందర్యం
ఈ చిట్కాలతో.. నొప్పి లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవడం సాధ్యమే..!

ఈ చిట్కాలతో.. నొప్పి లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవడం సాధ్యమే..!

వ్యాక్సింగ్ చేసేటప్పుడు చాలా నొప్పి పెడుతుంది. ఆ సమయంలో నొప్పి పెట్టకుండా ఏదైనా చేస్తే బాగుండునని అనుకోకుండా ఉండలేం. అందుకే వ్యాక్సింగ్‌కి ముందు ఈ పది చిట్కాలు పాటిస్తే.. నొప్పి లేకుండా వ్యాక్స్ (painless wax) చేసుకోవచ్చు.

1. వ్యాక్సింగ్‌కి ముందు స్నానం

1-painless-wax-bath

వ్యాక్స్ చేసుకోవడానికి ముందు వేడి నీటితో స్నానం చేయండి. వేడి నీరు మీ చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. అలాగే.. చర్మ రంధ్రాలను తెరుచుకొనేలా చేస్తుంది. అంతేకాదు.. చర్మంపై ఉన్న రోమాల కుదుళ్లను వదులుగా మారుస్తుంది. దీనివల్ల వ్యాక్సింగ్ చేసేటప్పుడు పని సులభతరమవుతుంది. కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.

ADVERTISEMENT

2. వదులుగా ఉన్న దుస్తులు..

వ్యాక్సింగ్ పూర్తైన తర్వాత చ‌ర్మం చాలా సెన్సిటివ్‌గా మారిపోతుంది. కాస్త నొప్పిగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకొంటే ఆ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వ్యాక్సింగ్ తర్వాత వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవడం మంచిది. మీరు పార్లర్లో వ్యాక్సింగ్ చేయించుకొంటే.. ముందుగానే వదులు దుస్తులు వేసుకెళితే మంచిది.

3. ఎక్స్ఫోలియేట్ తప్పనిసరి..

3-painless-wax-exfoliate

ADVERTISEMENT

వ్యాక్సింగ్‌కి ఎక్స్ఫోలియేషన్‌కి సంబంధమేంటని సందేహిస్తున్నారా? ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలగిపోతాయి. అలాగే వెంట్రుకల కుదుళ్లను సైతం వదులుగా మారుస్తాయి. అందుకే వ్యాక్సింగ్‌కు ముందు ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం మంచిది. దీనికోసం ఆప్రికాట్ సీడ్ పౌడర్, దానిమ్మ స్క్రబ్ ఎంచుకోవాలి. ఇలా ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల వెంట్రుకలు లోపలికి పెరగకుండా ఉంటాయి.

4. బ్యుటీషియన్ అయితేనే బెటర్..

మీరు కొత్తగా వ్యాక్సింగ్ చేసుకోవాలనుకొంటున్నారా? అయితే ఇంటి దగ్గర వ్యాక్స్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీకు అలవాటు లేకపోవడం వల్ల చాలా ఆలస్యంగా వ్యాక్స్ చేసుకోవడం పూర్తవుతుంది. పైగా నొప్పి కూడా ఎక్కువ పెడుతుంది. అదే బ్యుటీషియన్ అయితే.. తక్కువ సమయంలో వ్యాక్సింగ్ పూర్తి చేస్తారు. దీనివల్ల నొప్పి కూడా తక్కువగా ఉంటుంది.

5. బేబీ పౌడర్ అద్దుకొని..

ADVERTISEMENT

5-painless-wax-baby-powder

మీకు తెలుసా? బేబీ పౌడర్ చెమటను, చర్మం మీద జిడ్డును పీల్చుకొంటుంది. అందుకే బ్యూటీ సెలూన్ కి వెళ్లే ముందు చర్మానికి బేబీ పౌడర్ అద్దుకొని వెళ్లండి.

6. హైడ్రేటెడ్‌గా ఉండండి

వ్యాక్సింగ్ చేసుకోవడానికి వెళ్లాలని మీరు అనుకుంటే కెఫీన్, నికోటిన్‌కు దూరంగా ఉండంటం మంచిది. ఎందుకంటే ఇవి రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. వీటి వల్ల చర్మం మరింత సున్నితంగా తయారవుతుంది. ఫలితంగా వ్యాక్సింగ్ చేసేటప్పడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై పొర ఊడి వచ్చే అవకాశాలున్నాయి.

ADVERTISEMENT

7. సువాసనభరిత క్రీంలు, లోషన్లు దూరం

7-painless-wax-moisture

సువాసనాభరితంగా ఉండే క్రీంలు, లోషన్లు చర్మాన్ని పొడిగా మార్చేస్తాయి. వీటిలో ఉండే ఆల్కహాల్ వల్లే ఇలా జరుగుతుంది. దీంతో వ్యాక్సింగ్ చేసేటప్పుడు అవాంఛిత రోమాలతో పాటు చర్మం కూడా ఊడి వచ్చేస్తుంది. అలాగని క్రీం రాసుకోకపోయినా చర్మం పొడిగా మారిపోతుంది. కాబట్టి మైల్డ్ బాడీ లోషన్ లేదా క్రీం రాసుకొంటే మంచిది. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. వ్యాక్స్ చేసుకోవడానికి కొన్ని నిమిషాల ముందు బాడీ లోషన్ లేదా క్రీం అప్లై చేసుకోకూడదు.

8. అవాంఛిత రోమాలను ఎదగనివ్వండి

ADVERTISEMENT

వ్యాక్సింగ్ మీరు చేసుకోవాలని అనుకొంటే.. చర్మం మీద ఉన్న రోమాలను కాస్త ఎదిగిన తర్వాత వ్యాక్స్ చేసుకోవడం మంచిది. అలాగని రోమాలు పూర్తిగా ఎదిగేంత వరకు ఆగితే నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ చిన్నగా ఉన్నా నొప్పిగా ఉంటుంది. అందుకే మధ్యస్థంగా ఎదిగేంత వరకు ఉండి వ్యాక్స్ చేసుకోవడం మంచిది.

9. దృష్టి మరల్చుకోండి

9-painless-wax-distraction

వ్యాక్సింగ్ చేసుకొనేటప్పుడు నొప్పి పెడుతుందేమోననే మానసిక భావన వల్ల మరింత నొప్పిగా అనిపించవచ్చు. అందుకే ఆ సమయంలో మ్యాగజైన్ చదవడం, మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడం, పాటలు వినడం వంటివి చేయండి. వీటన్నింటి కంటే ఉత్తమమైన మార్గం ఏంటో తెలుసా? పార్లర్ లేడీతో మాటామంతీ కలపండి. నొప్పి లేకుండా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు.

ADVERTISEMENT

10. క్రమం తప్పొద్దు..

క్రమం తప్పకుండా నిర్ణీత కాలవ్యవధిలో వ్యాక్సింగ్ చేయించుకొంటూ ఉండాలి. వ్యాక్సింగ్‌కి, వ్యాక్సింగ్‌కి మధ్య నాలుగు నుంచి ఆరు వారాల సమయం ఉండాలి. రెగ్యులర్‌గా వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల నొప్పిగా అనిపించదు. ఇలా నిర్ణీత వ్యవధిలో వ్యాక్స్ చేసుకోవడం వల్ల చర్మంపై అవాంఛిత రోమాలు సైతం తగ్గుముఖం పడతాయి.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి..

ADVERTISEMENT

చాక్లెట్ వ్యాక్స్ లేదా రెగ్యులర్ వ్యాక్స్.. ఏ చర్మానికి ఏది బాగుంటుంది?

జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?

బ్రెజిలియన్ వ్యాక్స్ గురించి వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

24 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT