ఈ ట్రైక‌ల‌ర్ కేక్‌ లతో.. గణతంత్ర స్ఫూర్తిని ఘనంగా చాటండి..!

ఈ ట్రైక‌ల‌ర్ కేక్‌ లతో.. గణతంత్ర స్ఫూర్తిని ఘనంగా చాటండి..!

గణతంత్ర దినోత్సవ (Republic day) వేడుకలను దేశమంతా ఉత్సాహంగా జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో తమ సంతోషాన్ని తెలియజేయడానికి కొంద‌రు తోటివారికి మిఠాయిలు పంచిపెడుతుంటారు. మీరు కూడా జనవరి 26న ఇలా మిఠాయిలు పంచిపెట్టాలనుకొంటున్నారా? అయితే ఆ మిఠాయిలు తీయ‌గా ఉండ‌డంతో పాటు దేశభక్తిని కూడా తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది కదా.. అందుకే ఈ సారి ఈ ట్రైకలర్ కేక్(tricolor cake) లను తయారు చేసి చూడండి. చాలా సులభంగా వీటిని తయారుచేసుకోవచ్చు. ఆ రెసిపీస్(recipes) మీ కోసమే..


ట్రైకలర్ కేక్


1-RD-cake-recipe


Image: Youtube


కావాల్సినవి:


ఆల్ పర్పస్ ఫ్లోర్ - రెండు కప్పులు


షుగర్ - రెండు కప్పులు


పాలు - ఒక కప్పు


బటర్ - ఒక కప్పు


గుడ్లు - మూడు


ఉప్పు - సరిపడినంత


ఆరెంజ్, గ్రీన్ ఫుడ్ కలర్స్ - కొన్నిచుక్కలు


బేకింగ్ పౌడర్ - స్పూన్


ఉప్పు - చిటికెడు


ఫ్రాస్టింగ్ కోసం కావాల్సినవి:


బటర్ - 100 గ్రా


పంచదార - రెండు కప్పులు


వెనీలా ఎసెన్స్ - అర చెంచా


పాలు - 4-5 స్పూన్లు


తయారీ విధానం:


గిన్నెలో ఆల్ పర్పస్ ఫ్లోర్ (ఇది ప్రస్తుతం మార్కెట్లో విరివిగానే దొరుకుతోంది), బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గుడ్లు, కరిగించిన బటర్ కూడా వేసి బాగా కలపాలి. అనంత‌రం చక్కెర, పాలు కూడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు కేక్ తయారుచేయడానికి అవసరమైన బాటర్ సిద్ధమైంది. దీన్ని మూడు గిన్నెల్లో సమాన భాగాలుగా తీసుకోవాలి. ఒక భాగంలో కాషాయం రంగులో ఉన్న ఫుడ్ కలర్, మరో దానిలో పచ్చ రంగు కలపాలి. ఇప్పుడు కేక్ పాన్ లో కాషాయ రంగు కలిపిన కేక్ బాటర్ వేసి 20 నిమిషాలు ఉడికించాలి. ఇలా మిగిలిన రెండింటినీ కూడా విడివిడిగా బేక్ చేయాలి. పాన్ నుంచి కేక్ సులభంగా తీయడానికి వీలుగా బాటర్ వేయడానికి ముందే బేకింగ్ పేపర్ వేసుకోవాలి.


ఇప్పుడు ఫ్రాస్టింగ్ కోసం పంచదార, వెనీలా ఎసెన్స్, పాలు, బటర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కేక్ ల మధ్య పొరలా వేసి జెండాలోని రంగుల‌కు అనుగుణంగా కేక్ లేయ‌ర్స్ ఒక‌దానిపై మ‌రొక‌టి వేస్తే ట్రైక‌ల‌ర్ కేక్ సిద్ధమైనట్లే!


ఈ కేక్ తయారీ మరింత బాగా అర్థం కావాలంటే.. ఇక్కడ వీడియో చూడండి.


ఎగ్ లెస్ ట్రైకలర్ ఫ్రూట్ కేక్


2-RD-eggless-cake-recipe


Image: Youtube


కేక్ తయారీకి కావాల్సినవి:


ఆల్ పర్పస్ ఫ్లోర్ -  మూడు కప్పులు 


పంచదార పొడి - ఒకటిన్నర కప్పు


కండెన్సెడ్ పాలు - ఒకటింపావు కప్పు


సాధారణ పాలు - ఒక కప్పు


కరిగించిన బటర్ - ఒకటిన్నర కప్పు


అరటి పండు - సగం


బేకింగ్ పౌడర్ - 3 టీస్పూన్


బేకింగ్ సోడా - ఒకటింపావు టీస్పూన్


వెనీలా ఎసెన్స్ - టేబుల్ స్పూన్


ఫ్రాస్టింగ్ కు కావాల్సినవి:


బటర్(కరిగించనిది) - అరకప్పు


పౌడర్ షుగర్ - ముప్పావు కప్పు


ఫ్రూట్ టాపింగ్ కోసం కావాల్సినవి:


కివీ లేదా గ్రీన్ గ్రేప్స్,


ఆరెంజ్ లేదా క్యారెట్, 


ఆరెంజ్, గ్రీన్ ఫుడ్ కలర్స్ - కొన్ని చుక్కలు


పౌడర్ షుగర్ - రెండు టేబుల్ స్పూన్లు 


టీస్పూన్ - పాలు


తయారీ విధానం:


ముందుగా ఒవెన్ ను 180డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో అరటి పండును మెత్తని గుజ్జులా చేసి బటర్, ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కండెన్సెడ్ పాలు, పంచదార, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలపాలి. చివరిగా పాలు నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలి. మిశ్రమం బాగా కలిసిన తర్వాత కేక్ పాన్ లో వేసి ఒవెన్ లో పెట్టి 35 నిమిషాలు బేక్ చేయాలి. ఆ తర్వాత బయటకు తీసి టూత్ పిక్ సాయంతో ఉడికిందో లేదో చెక్ చేయాలి. 


కేక్ బేక్ అయ్యేలోపు ఫ్రాస్టింగ్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థాలను ఒక గిన్నెలో వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి.


ఫ్రూట్ టాపింగ్ కోసం పండ్లను స్లైస్ లుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు గిన్నెలు తీసుకొని.. ఒక్కొక్క దానిలో టీస్పూన్ పాలు, టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి క్యారెట్ లేదా ఆరెంజ్ ముక్కలు వేయాలి. మరోదానిలో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి కలిపి కివి లేదా గ్రీన్ గ్రేప్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.  


కేక్ బేక్ అయిన త‌ర్వాత‌ ఒవెన్ లో నుంచి బయటకు తీసి పావుగంట చల్లారనివ్వాలి. దీన్ని కేక్ బేస్ పై ఉంచి ముందుగా సిద్ధం చేసి పెట్టుకొన్న ఫ్రాస్ట్ ను సమానంగా అప్లై చేయాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకొన్న ఫ్రూట్స్ ను జాతీయ జెండాలా టాప్ చేసుకోవాలి. ఆఖ‌రులో బటర్ ఫ్రాస్ట్ లో కొద్దిగా నీలం రంగు కలిపి దాంతో అశోక చక్రం గీస్తే ట్రైకలర్ ఫ్రూట్ టాప్ కేక్ రెడీ.


ఈ కేక్ ఫ్రిజ్ లో మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.


ఈ కేక్ తయారీ మరింత బాగా అర్థం కావాలంటే.. ఇక్కడ వీడియో చూడండి.


ట్రైకలర్ వెనీలా మఫిన్స్


3-RD-eggless-muffins-recipe


Image: Youtube 


కావాల్సినవి:


కేక్ ఫ్లోర్ - రెండు కప్పులు(రెండు కప్పుల మైదాలో నాలుగు టీస్పూన్లు తీసేసి దాని స్థానంలో రెండు కప్పుల కార్న్ ఫ్లోర్ కలపాలి) 


పంచదార పొడి - 125 గ్రా


బేకింగ్ పౌడర్ - టీ స్పూన్


బేకింగ్ సోడా - అర టీస్పూన్


ఉప్పు - పావు టీస్పూన్


నూనె - అరకప్పు


వెనీలా ఎసెన్స్ - రెండు టీస్పూన్లు


పాలు - ఒక కప్పు


వెనిగర్ - టీస్పూన్


ఆరెంజ్, గ్రీన్ ఫుడ్ కలర్స్ - కొన్ని చుక్కలు


తయారీ విధానం:


ముందుగా ఒవెన్ ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో కేక్ ఫ్లోర్, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకంగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో పాలు, నూనె, వెనిగర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేక్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని మూడు గిన్నెల్లోకి సమాన భాగాలుగా తీసుకోవాలి. ఒకదానిలో గ్రీన్, మరోదానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్స్ వేసి కలపాలి. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్స్ తీసుకొని ముందు గ్రీన్ కలర్ కేక్ బాటర్ వేయాలి. ఆ తర్వాత ఏ రంగూ కలపనిది, చివరిగా ఆరెంజ్ కలర్ కలిపిన కేక్ బాటర్ వేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్స్ ను ఒవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద పావుగంట సమయం బేక్ చేస్తే ట్రైకలర్ వెనీలా మఫిన్స్ సిద్దమైనట్లే.


కేక్ మఫిన్స్ తయారీ మరింత బాగా అర్థం కావాలంటే ఇక్కడ వీడియో చూడండి.


Featured Image: Shutterstock


ఇవి కూడా చ‌ద‌వండి


గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి మువ్వ‌న్నెల రుచుల‌తో రంగుల‌ద్దండి..!


ఈ బాలీవుడ్ చిత్రాలు.. మీలో దేశ‌భ‌క్తిని మ‌రింత పెంచుతాయి..!


రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?