సంక్రాంతి ఫ్యాషన్: మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

సంక్రాంతి ఫ్యాషన్:  మీరు మెచ్చే 25 రకాల కుర్తా డిజైన్లు ఇవి..

పండగంటేనే పిండి వంటలు, కొత్త దుస్తులు, ఆటపాటలు. అందులోనూ సంక్రాంతి అంటే ఆ ఉత్సాహం మరింత ఎక్కువగా ఉంటుంది. ముత్యాల ముగ్గులను తీర్చిదిద్దే మగువలు నూతన వస్త్రాలు ధరించి సందడి చేస్తుంటే.. ఆ ఇల్లు లక్ష్మీకళతో కళకళలాడిపోతుంది. అందుకేనేమో ఈ సీజన్‌లో మహిళల కోసం ఎన్నో డిజైన్లు మార్కెట్లో కనువిందు చేస్తాయి. సంక్రాంతి (Pongal) ప్రకృతి పండగ. ఈ పండగ సమయంలో అటు సంప్రదాయబద్ధంగానూ ఇటు మోడ్రన్‌గానూ కనిపించాలనుకొంటారు యువతులు. వారికోసమే ది బెస్ట్ అని చెప్పుకోదగిన కొన్ని డిజైన్లు మీకోసం..


పంజాబీ సూట్స్ విత్ పటియాలా


1-sankranti-fashion-kurta


ఎరుపు రంగు దుస్తులలో మనం మరింత సౌందర్యవంతంగా కనిపిస్తాం. అందుకే ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్లో ఈ రంగు దుస్తులు కచ్చితంగా ఉంటాయి. ఈ డ్రస్ చూడండి. రెడ్ కలర్ కుర్తాపై అదే రంగు ధోతీ ప్యాంట్‌తో చూడముచ్చటగా ఉంది కదా..


POPxo recommends: నేయో ఎరుపు, గోల్డ్ ప్రింటెడ్ కుర్తా ధోతీ ప్యాంట్ (రూ. 1,799)


2-sankranti-fashion-kurta


చాలామందికి గ్రే కలర్‌లోని దుస్తులు పండగ లుక్ ని తీసుకురావని భావిస్తారు. కానీ దాన్ని మల్టిపుల్ కలర్ కాంబినేషన్‌గా ధరిస్తే అదిరిపోయే లుక్ ఇస్తుంది. నీలం, నేవీ బ్లూ, గోల్డ్, తెలుపు రంగుల మేళవింపుతో ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది.


POPxo recommends: పీచ్ మోడ్ గ్రే కలర్ ఎంబ్రాయిడరీ పార్టీ వేర్ సిల్క్ పటియాలా సూట్ (రూ. 1,799)


3-sankranti-fashion-kurta


సంక్రాంతికి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్దంగా అడుగులు వేస్తుంటారు. మరి దీనికి తగిన డ్రస్ వేసుకోవడమూ ముఖ్యమే. పీచ్, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కుర్తీ, ధోతీ దానికి సరైన ఎంపిక.


POPxo recommends: అభీష్టి పీచ్ కలర్ ధోతీ కుర్తా (రూ. 2,099)


4-sankranti-fashion-kurta


రాణీ పింక్, మెరూన్ రంగులు క్లాసిక్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కూడా. రాణీ పింక్ షార్ట్ పెప్లమ్ కుర్తీ, దానికి కాంబినేషన్‌గా మెరూన్ రంగు ధోతీ ప్యాంట్‌తో అల్ట్రా మోడ్రన్‌గా కనిపిస్తారు. టాప్ పై బంగారు వర్ణంలోని ఫాయిల్ ప్రింట్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.


POPxo recommends: ఇండస్ పింక్ మెరూన్ కుర్తీ, ధోతీ ప్యాంట్ (రూ 2,267)మిర్రర్ వర్క్, ఎంబ్రాయిడరీతో అందంగా కనిపిస్తోన్న ఈ నలుపు రంగు పంజాబీ డ్రస్ ఈ పండగ సీజన్‌కు సరైన ఎంపిక.


POPxo recommends: ఉత్సవ్ ఫ్యాషన్ ఎంబ్రాయిడర్డ్ టఫేటా సిల్క్ పంజాబీ సూట్ (రూ. 3,597)


6-sankranti-fashion-kurta


గ్రే, పింక్ రంగుల కాంబినేషన్‌లో ఉన్న ఈ డ్రస్ మీకు సంక్రాంతి లుక్‌ను అందిస్తుంది. చమ్కీలతో ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్టా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.


POPxo recommends: చబ్రా 555 ఎంబలిష్డ్ కుర్తా, పటియాలా, దుపట్టా (రూ. 4,950)


7-sankranti-fashion-kurta


ఆరెంజ్, పసుపు రంగుల కలయిక వైబ్రంట్ లుక్ ఇస్తుంది. ఈ డ్రస్ చూస్తుంటే సంక్రాంతికి సరైన ఎంపిక  అని నాకనిపిస్తోంది.


POPxo recommends: పీచ్ మోడ్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ పార్టీ వేర్ సూట్  (రూ. 1,799)


8-sankranti-fashion-kurta


మోనోటోన్ రంగుల్లోని దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారికి ఈ డ్రస్ సరైన ఎంపిక. గ్రే రంగు బటన్ అప్ కుర్తాకి మ్యాచింగ్‌గా ధరించిన నీలం రంగు బాటమ్, చున్నీ మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ డ్రస్ పై ధరించిన దుప్పట్టా మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.


POPxo recommends: జైపూర్ కుర్తీ గ్రే, బ్లూ యోక్ డిజైన్ కుర్తా, దుపట్టా, సల్వార్ (రూ. 1,479)


సూట్స్ విత్ చుడీదార్ ప్యాంట్స్


9-sankranti-fashion-kurta


పగడపు రంగులోని అనార్కలీ చుడీదార్ సూట్ పండగ సీజన్‌కు సరైన ఎంపిక. టాప్ నడుం భాగం వరకు చేసిన ఎంబ్రాయిడరీ దీన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది.


POPxo recommends: బీబా కోరల్ రెడ్ ఎంబలిష్డ్ కుర్తా, చుడీదార్, దుపట్టా (రూ . 4,975)


10-sankranti-fashion-kurta


సరదా సరదాగా గడిపే ఈ సంక్రాంతికి ఫెస్టివ్ లుక్ సొంతం చేసుకోవడంతో పాటు.. వైబ్రంట్‌గా కనిపించాలంటే.. పసుపు, తెలుపు కలయికల్లో డిజైన్ చేసిన చుడీదార్ ధరించాల్సిందే. ఇది మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.


POPxo recommends: అరెలియా యెల్లో సాలిడ్ పలాజ్, కుర్తా, దుపట్టా (రూ 3,225)


12-sankranti-fashion-kurta


ఈ డ్రస్ నెక్ డిజైన్ చూడండి.. చాలా కొత్తగా ఉంది కదా. దానికి తోడు నీలం రంగు అనార్కలీకి మెరూన్ రంగు ప్యాంట్ చక్కగా సూటయింది. పండగకి ధరించడానికి పర్ఫెక్ట్ డ్రస్ ఇది.


POPxo recommends: అభీష్టి బ్లూ ప్రింటెడ్ కుర్తా, ప్యాంట్ సెట్ (రూ 2,039)


13-sankranti-fashion-kurta


స్ట్రెయిట్ కట్ కుర్తాలు సైతం ఈ పండగ సీజన్లో ధరించడానికి అనువుగా ఉంటాయి. పింక్ రంగు ఎంబ్రాయిడరీ కుర్తా చూడండి. ఇది మీకు క్లాసిక్ లుక్ ఇస్తుంది.


POPxo recommends: అనౌక్ పింక్ ఎంబ్రాయిడర్డ్ కుర్తా, చుడీదార్, దుపట్టా (రూ. 3,419)


14-sankranti-fashion-kurta


గోల్డ్ కలర్ పైపింగ్ చేసిన ఆలివ్ గ్రీన్ డ్రస్ అటు సంప్రదాయంగా.. ఇటు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తూ యూత్ ఫుల్ లుక్ ఇస్తుంది.


POPxo recommends: జునిపెర్ గ్రీన్ సాలిడ్ కుర్తా, ప్యాంట్ సెట్ (రూ 1,899)


పంజాబీ సూట్స్ విత్ పలాజో, షరారా


15-sankranti-fashion-kurta


నలుపు రంగు దుస్తులు అందరికీ అందంగానే ఉంటాయి. అందులోనూ వాటిపై గోల్డ్ ప్రింట్ లేదా ఎంబ్రాయిడరీ ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ షార్ట్ కుర్తీ, షరారా మీకు ఫెస్టివ్ లుక్ అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


POPxo recommends: భామా కోషర్ బ్లాక్ ప్రింటెడ్ పలాజో కుర్తా సెట్ (రూ. 2,199)


16-sankranti-fashion-kurta


సీ గ్రీన్ రంగులోని కుర్తాకి అదే రంగులోని షరారాతో మ్యాచ్ చేశారు. షరారాపై ఉన్న ఫాయిల్ ప్రింట్, బూటీ వర్క్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోంది. వీటిపైకి అదే రంగులోని ఎంబలిష్డ్ దుపట్టా డ్రస్‌ని అందంగా మార్చేస్తోంది.


POPxo recommends: చబ్రా555 సీ గ్రీన్ ఎంబ్రాయిడర్డ్ అనార్కలీ కుర్తా, షరారా, దుపట్టా (రూ. 5,560)


17-sankranti-fashion-kurta


ఆరెంజ్ కలర్ స్ట్రెయిట్ కట్ కుర్తా, పలాజో సూట్ సింపుల్ గానే ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.


POPxo recommends: ఏకేఎస్ ఆరెంజ్ ప్రింటెడ్ పలాజో, కమీజ్, దుపట్టా (రూ. 2,599)సంక్రాంతి పండగ కోసం మరో నలుపు రంగు కుర్తా ఇది. ప్రింట్ ఆన్ ప్రింట్ కాంబినేషన్‌లో ఉన్న ఈ స్లీవ్ లెస్ బ్లాక్ డ్రస్ మీ స్టైల్ స్టేట్మెంట్‌ను తెలియజేస్తుంది.


POPxo recommends: అనౌక్ బ్లాక్ ప్రింటెడ్ కుర్తా, పలాజో, దుపట్టా (రూ. 2,219)


కుర్తా-లెహంగా, స్కర్ట్


19-sankranti-fashion-kurta


తెలుపు రంగు చందేరీ ప్రింటెండ్ లాంగ్ కుర్తా దానికి మ్యాచింగ్‌గా ధరించిన మస్టర్డ్ ఎల్లో స్కర్ట్ మీకు వైవిధ్యమైన లుక్‌ని ఇస్తాయి. స్కర్ట్ కి ఉన్న కుచ్చులు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. దీనికి మ్యాచింగ్‌గా ఎంబ్రాయిడరీ దుపట్టా ధరిస్తే మరింత అందంగా ఉంటుంది.


POPxo recommends: తెలుపు, మస్టర్డ్ ఎల్లో చందేరీ ప్రింటెడ్ కుర్తా, స్కర్ట్(ఆల్ అబౌట్ యు) (రూ. 2,149)


20-sankranti-fashion-kurta


పూర్తిగా విభిన్నమైన నీలం, పసుపు రంగుల్లో రూపొందిన ఈ కుర్తా, లెహంగా సెట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మీరు కూడా దీన్ని ఓసారి ప్రయత్నించి చూడండి.


POPxo recommends: ఇమారా ప్రింటెడ్ స్ట్రైట్ కుర్తా విత్ స్కర్ట్ (రూ. 2,999)


21-sankranti-fashion-kurta


బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పడానికి మరో ఉదాహరణ ఈ కుర్తా లెహంగా. ఈ ప్రింటెడ్ కుర్తా గాగ్రా ఈ సంక్రాంతికి మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.


POPxo recommends: వరంగా విమన్ బ్లాక్ ప్రింటెడ్ కుర్తీ విత్ స్కర్ట్ (రూ. 2,519)


22-sankranti-fashion-kurta


తెలుపు రంగు పై ఆలివ్ గ్రీన్ రంగు ప్రింట్ ఉన్న కాటన్ కుర్తా, స్కర్ట్ కూడా పండగ సీజన్లో ధరించడానికి అనువుగా ఉంటాయి.


POPxo recommends: గేరువా క్రీం అండ్ గ్రీన్ కుర్తా విత్ స్కర్ట్ (రూ. 1,099)


23-sankranti-fashion-kurta


నీలం రంగు కుర్తా, పింక్ లెహంగా.. ఇది నా పర్సనల్ ఫేవరెట్. కుర్తాపై ఉన్న ఎంబ్రాయిడరీ, లెహంగా బోర్డర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనికి మ్యాచింగ్ గాజులు, చెవులకు జుంకాలు అలంకరించుకొంటే.. మరింత అందంగా కనిపిస్తాం.


POPxo recommends: మన్వా బ్లూ కలర్ సెమీ స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ సూట్ (రూ. 1,444)


24-sankranti-fashion-kurta


సింపుల్ డిజైన్ అయినప్పటికీ గ్రాండ్‌గా కనిపిస్తూ.. సౌకర్యవంతంగా ఉండే దుస్తుల కోసం వెతికేవారికి ఈ కుర్తా, లెహంగా సెట్ మంచి ఎంపిక. తెలుపు, ఎరుపు రంగు కాంబినేషన్‌లో రాయల్ లుక్‌తో హుందాగా కనిపిస్తారు.


POPxo recommends: ఇండస్ రెడ్ & వైట్ కుర్తా, స్కర్ట్,దుపట్టా (రూ. 3,239)


25-sankranti-fashion-kurta


కొందరికి హెవీ ఎంబ్రాయిడరీ ఉన్నదుస్తులు వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి మెటాలిక్ ఫ్యాబ్రిక్‌తో తయారైన దుస్తులు బాగుంటాయి. గ్రే కలర్ మెటాలిక్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ లెహంగా, కుర్తా సెట్‌కి మ్యాచింగ్‌గా షీర్ దుపట్టా ధరిస్తే మరింత బ్రైట్ లుక్ మీ సొంతమవుతుంది.


POPxo recommends:  దేశీ వీవ్స్ సెల్ప్ డిజైన్ గ్రే కుర్తా , స్కర్ట్(రూ. 3,499)


ఇవీ సంక్రాంతి పండగకి కుందనపు బొమ్మలాంటి మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేసే కుర్తా డిజైన్లు. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకొని ఫెస్టివ్ లుక్‌లో మెరిసిపోండి.


ఇవి కూడా చదవండి


కపూర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిల ఫ్యాషన్ల గురించి ఆంగ్లంలో చదవండి


కంగనా రనౌత్ డిజైనర్ శారీ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి


2019 పాపులర్ కుర్తా బ్రాండ్స్ పై వ్యాసాన్ని ఆంగ్లంలో చదివేయండి