భారతీయ వివాహాలు (Indian Weddings) వివిధ రకాల సంప్రదాయాల (Traditions) కలబోతగా జరుగుతాయి. ఇందులో కొన్ని అందరికీ ఆనందాన్ని, సరదాను అందిస్తే.. మరికొన్ని మాత్రం అసలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కన్యాదానం, వధువు వరుడి కాళ్లు మొక్కడం వంటి ఇబ్బందిపెట్టే సంప్రదాయాలు కూడా చాలానే ఉంటాయి.
కానీ ఇటీవలే ఈ పద్ధతులు పాటించమంటూ చాలామంది చెప్పడం మనం చూస్తున్నాం. ఆ మధ్య కన్యాదానం లేకుండా జరిగిన పెళ్లి గురించి, వధువు కాళ్లు మొక్కిన వరుడి గురించి వార్తలు రావడం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పాత తరం పెళ్లి పద్ధతులను (Wedding rituals) తాను పాటించనని చెబుతూ ఓ బెంగాలీ వధువు (Bengali bride) చెప్పడం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది.
సాధారణంగా పెళ్లయిన తర్వాత ఏ అమ్మాయైనా పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లడం సహజం. అయితే పెళ్లి తర్వాత ఆమెకు తన పుట్టింటికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పే సంప్రదాయం మాత్రం తప్పనే చెప్పుకోవాలి. అలాంటి సంప్రదాయాన్ని తాను పాటించను అని చెప్పి.. సంప్రదాయాలకు కొత్త అర్థం చెప్పిందీ వధువు. దీనికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో ప్రస్తుతం పాపులర్‌గా మారింది.
ఈ వీడియోలో ఎరుపు రంగు బనారసీ చీర కట్టుకున్న ఆ వధువు అప్పగింతల(vidaai) సమయంలో ఏడవడానికి నిరాకరించింది. అంతేకాదు.. తన పుట్టింటి నుంచి తనని ఏ సంప్రదాయం విడదీయలేదని.. తాను ఎప్పుడూ ఇక్కడికి వస్తూనే ఉంటాను కాబట్టి అప్పగింతల అవసరం లేదని చెప్పుకొచ్చింది.కోల్‌కోతాకి చెందిన మున్‌మున్ అక్కడే ఓ బీపీఓలో పనిచేస్తోంది. తన స్నేహితుడైన అవి ప్రియాని జనవరి 27న వివాహమాడింది. పెళ్లి సందర్భంగా తీసిన ఓ వీడియో కారణంగా ప్రస్తుతం తను పాపులర్‌గా మారింది.
రెండు నిమిషాల ఈ వీడియో మున్‌మున్‌ని కనకాంజలి (kanakanjali) అనే బెంగాలీ ఆచారాన్ని పాటించమని బంధువులు చెబుతుండడం కనిపిస్తుంది. ఈ ఆచారం మన అప్పగింతల కార్యక్రమం లాంటిదే. అయితే ఇందులో భాగంగా అమ్మాయి గుప్పిళ్ల నిండా బొరుగులు పట్టుకొని వాటిని తన వెనుకే ఉన్న తన తల్లి ఒడిలో పోసి.. ఈరోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ వధువు మాత్రం అలా చెప్పడానికి అస్సలు ఒప్పుకోలేదు.
“తల్లిదండ్రుల రుణాన్ని మనం ఏం చేసినా తీర్చుకోలేం.. అలాంటిది ఈ సంప్రదాయం ద్వారా నా ఇంటికి నాకు బంధం తెగిపోతుందంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను..” అంటూ దాన్ని నిర్వహించేందుకు నో చెప్పిందీ వధువు. అంతే కాదు.. అప్పగింతల వేడుకలో ఏడుస్తూ అత్తవారింటికి వెళ్లే సాధారణ వధువులకు భిన్నంగా నవ్వుతూ.. ఫొటోలకు పోజులిస్తూ ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ అత్తవారింటికి పయనమైంది.
పెళ్లి అనేది అమ్మాయికి జీవితంలోనే ఒక్కసారి వచ్చే వేడుక. అలాంటి పెళ్లిలో బాధపడడం సరికాదని.. పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటితో అమ్మాయికి బంధం ఏమాత్రం మారదని చెప్పిన ఈ బిందాస్ బ్రైడ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తనలా ఇతరులు కూడా చేయాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది.
మున్‌మున్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి దాదాపు నాలుగు లక్షల వ్యూస్ రావడంతో పాటు.. ఎనబై వేల షేర్లు కూడా రావడం విశేషం. ఈ వీడియో సంప్రదాయానికి కొత్త అర్థం చెబుతుందని చాలామంది నెటిజన్లు అంటున్నారు. అందుకే దాదాపు నాలుగు లక్షల వ్యూస్‌తో నిలిచిన ఈ వీడియోని కొన్నివేల మంది షేర్ చేయడం విశేషం. చూసిన ప్రతి ఒక్కరూ.. మూసధోరణులను బద్ధలు కొట్టిన ఈ వధువుని మెచ్చుకుంటున్నారు.
అద్భుతమైన వార్త.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చక్కటి మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మరెన్నో ఇక్కడ 25 శాతం డిస్కౌంట్‌తోనే లభిస్తున్నాయి. POPXOFIRST అనే కూపన్ కోడ్‌ని ఉపయోగించండి. దీంతో మహిళలకు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.
ఇవి కూడా చదవండి
మీ పెళ్లి డెకరేషన్‌కి స్ఫూర్తినిచ్చే మండపం డిజైన్ల గురించి ఆంగ్లంలో చదవండి.
మీ పెళ్లిలో పాటించాల్సిన వెడ్డింగ్ ఎటికెట్ గురించి ఆంగ్లంలో చదవండి.
మీ వివాహ వేడుకకి నప్పే సెలబ్రిటీ హెయిర్‌స్టైల్స్ గురించి ఆంగ్లంలో చదవండి.
Image : Facebook