రామ్ ఒక్క‌డే కాదు.. ఇలాంటి ఖ‌రీదైన గిఫ్టులు చాలామందే ఇచ్చారు..

రామ్ ఒక్క‌డే కాదు.. ఇలాంటి ఖ‌రీదైన గిఫ్టులు చాలామందే ఇచ్చారు..

బ‌హుమ‌తులంటే (Gifts) ఇష్టం లేనివారు ఎవ‌రుంటారు చెప్పండి? ప‌్ర‌తి ఒక్క‌రికీ చిన్న‌వో.. పెద్ద‌వో గిఫ్టులు అందుకోవ‌డం ఇష్ట‌మే. ఎదుటివారిపై మ‌న‌కున్న ప్రేమ‌ను బ‌హుమ‌తుల రూపంలో చూపించ‌వ‌చ్చ‌ని అంటూ ఉంటారు చాలామంది. ఇలాంటి బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకోవ‌డంలో ఎప్పుడూ ముందుంటారు మ‌న టాలీవుడ్ సెల‌బ్రిటీలు (Tollywood celebrities). అనేకమంది సెలబ్రిటీలు త‌మ స్నేహితులు, సన్నిహితుల కోసం ఖ‌రీదైన బ‌హుమ‌తులు ఇచ్చి వార్త‌ల్లో నిలిచారు.


తాజాగా హీరో రామ్ త‌న "ఇస్మార్ట్ శంక‌ర్" సినిమా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కి కొన్ని ఖ‌రీదైన కాఫీ ప్యాకెట్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చార‌ట‌. కాఫీ ప్యాకెట్లే క‌దా అనుకుంటున్నారా? అయితే ఆ కాఫీ ప్యాకెట్ల గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే. కోపీ లువాక్ అనే ఈ కాఫీ పొడిని ఏషియ‌న్ పామ్ కివెట్ అనే పిల్లిలాంటి జంతువు విస‌ర్జ‌కాల నుంచి త‌యారుచేస్తారు.


తొలుత కాఫీ పండ్ల‌ను ఆ జంతువుతో తినిపిస్తారు.. అవి దాని జీర్ణాశ‌యంలో అరిగిపోతాయి. కాఫీ గింజ‌ల‌ను మాత్రం అది అరిగించుకోలేదు కాబ‌ట్టి వాటిని విస‌ర్జిస్తుంది. ఈ గింజ‌ల‌ను ఎండ‌బెట్టి పొడిచేసి అమ్ముతారు. ఈ కాఫీ ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి ప్యాకెట్ల‌ను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కి అందించాడు రామ్‌. అయితే ఇలాంటి ఖ‌రీదైన బ‌హుమ‌తులు కేవ‌లం రామ్ ఒక్క‌డే కాదు.. చాలామంది తమ స్నేహితులకు, సన్నిహితులకు అందించారు. వారి వివ‌రాలు తెలుసుకుందాం రండి..


1431862533 charmme-kaur-shows-diamond-ring


1. సి క‌ల్యాణ్ - ల‌య‌న్ రింగ్‌


సి క‌ల్యాణ్ నిర్మాణంలో రూపొందిన "జ్యోతిల‌క్ష్మీ" చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది ఛార్మి. ఆ సినిమా మంచి విజ‌యం సాధించిన త‌ర్వాత ఆ విజ‌యానికి గుర్తుగా ఆ త‌ర్వాత ఛార్మి పుట్టిన రోజున త‌న‌కి ఓ చ‌క్క‌టి ఉంగరాన్ని బ‌హుమ‌తిగా అందించారు సి క‌ల్యాణ్‌. ఈ ఉంగ‌రం సాధార‌ణ‌మైనదేమీ కాదు.. వ‌జ్రాలు పొదిగిన ఈ ఉంగ‌రం ఎంతో ఖ‌రీదైన‌ద‌ని అప్ప‌ట్లోనే టాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకున్నాయి. ఆ ఉంగ‌రం ధ‌ర కొన్ని ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా.


Ck4J1AiUgAEfYTP


2. నాగబాబు - ఆడి కారు


నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారికా కొణిదెల. త‌మ కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మొద‌టి క‌థానాయిక‌గా పేరు సాధించింది. ముందు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా కొన‌సాగిన నిహారిక "ఒక మ‌న‌సు" చిత్రంతో వెండితెర‌పై మెరిసింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయినా.. క‌థానాయిక‌గా మారిన త‌న కూతురి స‌క్సెస్‌ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి సినిమా విడుద‌ల‌కు ముందే ఆమెకు ఓ చ‌క్క‌టి ఆడి కారును బ‌హుమ‌తిగా అందించారు. దాదాపు యాభై ల‌క్ష‌ల విలువైన ఈ కారు అందుకున్న నిహారిక ఎంతో పొంగిపోయింద‌ట‌.


cartier-rotonde-astrotourbillon-carbon-crystal-watch


3. చిరంజీవి - లిమిటెడ్ ఎడిష‌న్ వాచ్‌


కార్టియ‌ర్ లిమిటెడ్ ఎడిష‌న్ వాచ్‌... కొన్ని ల‌క్ష‌ల ఖ‌రీదైన వాచీని ప‌దుల సంఖ్య‌లోనే విడుద‌ల చేస్తుందీ సంస్థ‌. అలాంటి చ‌క్క‌టి క‌పుల్ వాచీల‌ని త‌న మేన‌ల్లుడు అల్లు అర్జున్‌కి బ‌హుమ‌తిగా అందించారు చిరంజీవి. అల్లు అర్జున్, స్నేహ వివాహం త‌ర్వాత వీటిని ఆ కొత్త జంట‌కు అందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు చిరంజీవి. త‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కూడా చిరంజీవి ఇలాంటిదే ఓ లిమిటెడ్ ఎడిష‌న్ టైమ్ లెస్ వాచీని అందించిన సంగ‌తి తెలిసిందే..


toyota-land-cruiser


4. రామ్ చ‌ర‌ణ్ ఖ‌రీదైన కారు


"శంక‌ర్ దాదా జిందాబాద్" త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై రాజ‌కీయాల్లో బిజీగా మారారు చిరంజీవి. ఆ త‌ర్వాత దాదాపు ప‌దేళ్ల‌కు తిరిగి మేక‌ప్ వేసుకొని కెమెరా ముందుకొచ్చి సినిమాలో న‌టించారు చిరు. అందుకే తండ్రి 150వ చిత్రం "ఖైదీ నం.150" విడుద‌ల సంద‌ర్భంగా ఆయన‌కు "లాండ్‌క్రూజ‌ర్ వీ8"ని బ‌హుమ‌తిగా అందించాడు చెర్రీ. దాదాపు ఒక‌టిన్న‌ర కోట్ల విలువైన ఈ కారును అందించి తండ్రిపై త‌న‌కెంత ప్రేముందో చాటిచెప్పాడు.


Anjali-BMW-Car


5. కోన వెంక‌ట్ బీఎండ‌బ్ల్యూ


అంజ‌లి హీరోయిన్గా న‌టించిన "గీతాంజ‌లి" చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ క‌థ‌ను అందించ‌డంతో పాటు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన త‌ర్వాత కోన వెంక‌ట్ అంజ‌లికి ఓ మంచి బీఎండ‌బ్ల్యూ కారును బ‌హుమ‌తిగా అందించి సినిమా స‌క్సెస్ సాధించిన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో అంజ‌లి ద్విపాత్రాభిన‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇవి కూడా చ‌ద‌వండి..


బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?


స‌మంత మేక‌ప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మ‌న‌మూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!


విజేతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అమ్మకు మాత్రం పసిబిడ్డే..!