ADVERTISEMENT
home / Bollywood
ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!

ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!

మనలో చాలామందికి మేడమ్ ట్యూసాడ్స్ (Madame Tussauds) గురించి.. అందులో ఏర్పాటు చేసే మైనపు విగ్రహాల గురించి అవగాహన ఉండే ఉంటుంది. అయితే దీని గురించి ఇప్పటివరకు అవగాహన లేనివారికి – ఇది ఒక మ్యూజియం. అయితే సాధారణ మ్యూజియమ్స్‌లా కాకుండా.. ఇక్కడ పురాతన వస్తువులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో పేరు గడించిన వారిని గుర్తించి, వారి మైనపు ప్రతిమలను తయారుచేసి ప్రదర్శనకు ఉంచుతారు. అయితే అలా వారి మైనపు బొమ్మలను తయారు చేసేముందు.. సదరు వ్యక్తి దగ్గరికి వెళ్లి వారి శరీరపు కొలతలు అన్ని క్షుణ్ణంగా తీసుకుని మరీ ఈ బొమ్మలని తయారు చేయడం జరుగుతుంది.

ఇక ఈ మ్యూజియంలో స్థానం సంపాదించడమంటే.. మనకి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన్నట్లుగానే భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానం సంపాదించిన వారంతా, తమతమ రంగాల్లో నిష్ణాతులు లేదా ఉన్నత స్థాయికి చేరుకున్న వారే. ఇక మన టాలీవుడ్‌కి సంబంధించి ఇప్పటివరకు మ్యూజియం ప్రదర్శనకు ఇద్దరి వ్యక్తుల మైనపు విగ్రహాలకు అవకాశం దక్కింది. వారే – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) & సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).

బాహుబలి (Baahubali) చిత్ర విజయం.. దాని తాలూకా ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉండడంతో ఆ పాత్ర పోషించిన ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారుచేసి బ్యాంకాక్  మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి తెలుగువాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇక గత ఏడాది ఈ జాబితాలో చోటు సంపాదించుకుని మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని మరింతగా పెంచిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన మైనపు ప్రతిమని మ్యూజియంలో పెట్టేందుకు నిర్ణయించుకున్న తరువాత ..నిర్వాహకులు ఇక్కడికి రావడం, ఆయన తాలూకా కొలతలు తీసుకుని వెళ్లడం జరిగింది.

ఇంతవరకు రొటీన్‌గానే ఉన్నా.. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఈ విషయం పై ఇంకాస్త ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. అదేంటంటే మహేష్ బాబు మైనపు బొమ్మని సిద్ధం చేసిన తరువాత.. దానిని మ్యూజియంలో పెట్టే ముందు.. ఆయన ఫ్యాన్స్ కోసం హైదరాబాద్‌లో ఒకరోజు ప్రదర్శనకి పెట్టనున్నారు.  గచ్చిబౌలి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన AMB సినిమాస్ ఈ ప్రదర్శనకు వేదిక కావడం విశేషం. ఈ సినిమాస్‌కు మహేష్ బాబు సహయజమానిగా ఉన్న విషయం విదితమే.

ADVERTISEMENT

ఇక ఎప్పుడు ఆ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్‌కి తీసుకువస్తారు అన్నదాని పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఈ నెలాఖారులో ఈ విగ్రహం హైదరాబాద్‌కి వచ్చే అవకాశం ఉందనేది విశ్వసనీయ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం.  ఇక్కడ ప్రదర్శన ముగిసిన తరువాత  ఈ విగ్రహాన్ని లండన్ (London)లోని ప్రధాన మ్యూజియంకి పంపించడం జరుగుతుంది. ఇలా మనదేశంలో ప్రదర్శనకి మైనపు బొమ్మని పెట్టడం.. మేడమ్ ట్యుసాడ్స్ చరిత్రలో ఇదే తొలిసారి అని అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నారు.

ఇదిలావుండగా మన దేశం నుండి మేడం ట్యుసాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించుకున్న ఇతర సెలబ్రిటీలు, వారి మైనపు విగ్రహాలు స్థాపించిన సంవత్సరం & మ్యూజియం వివరాలు ఈ క్రింద చూడవచ్చు ..

 

* అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – 2000 – లండన్, బ్యాంకాక్, హాంకాంక్, సింగపూర్, వాషింగ్టన్ DC & శాన్ ఫ్రాన్సిస్కో

ADVERTISEMENT

 

* ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) – 2004 – లండన్ & శాన్ ఫ్రాన్సిస్కో

 

* షారుఖ్ ఖాన్ (Sharukh Khan) – 2007 – బెర్లిన్, సిడ్నీ, సింగపూర్ & లండన్

ADVERTISEMENT

 

* సల్మాన్ ఖాన్ (Salman Khan) – 2008 – లండన్ & న్యూయార్క్

 

* సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) – 2009 – లండన్

ADVERTISEMENT

 

* కరీనా కపూర్ (Kareena Kapoor) – 2011 – లండన్ & సింగపూర్

 

* హృతిక్ రోషన్ (Hrithik Roshan) – 2011-లండన్

ADVERTISEMENT

 

* నరేంద్ర మోడీ (Narendra Modi) – 2012- లండన్ , సింగపూర్ , హాంకాంగ్ & బ్యాంకాక్

 

* మాధురి దీక్షిత్ (Madhuri Dixit) – 2012 – లండన్

ADVERTISEMENT

 

* కత్రినా కైఫ్ (Katrina Kaif)  – 2015 – లండన్

 

* అనిల్ కపూర్ (Anil Kapoor) – 2017 – సింగపూర్

ADVERTISEMENT

 

* వరుణ్ ధావన్ (Varun Dhawan) – 2018- హాంకాంగ్

Featured Image: https://www.facebook.com/MBofficialTeam

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

ఈ పాపులర్ తెలుగు వెబ్ సిరీస్ చూశారా

రామ్ చరణ్ సరసన RRRలో నటించబోయే హీరోయిన్ ఈమేనా

ప్రీతి జింటా.. చక్కని నటి మాత్రమే కాదు.. ధైర్యశాలి కూడా..

 

ADVERTISEMENT
07 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT