ADVERTISEMENT
home / Bollywood
శ్ర‌ద్ధాక‌పూర్.. పుట్టిన రోజు సంద‌ర్భంగా సాహో టీజ‌ర్..!

శ్ర‌ద్ధాక‌పూర్.. పుట్టిన రోజు సంద‌ర్భంగా సాహో టీజ‌ర్..!

ప్ర‌భాస్ (Prabhas).. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న ఈ రెబ‌ల్ స్టార్ త‌న ఖాతాలో ఎన్నో హిట్స్‌ను జ‌మ చేసుకున్నారు. బాహుబ‌లి సిరీస్‌తో యావత్ ప్రపంచం దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సాహో (Saaho) చిత్రంపై కేవ‌లం ప్ర‌భాస్ అభిమానుల‌కు మాత్ర‌మే కాదు.. యావ‌త్ సినీ అభిమానులంద‌రిలోనూ ఓ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 1 (Shades of Saaho chapter- 1) పేరిట విడుద‌ల‌ చేసిన మేకింగ్ వీడియోకు అద్భుత స్పంద‌న ల‌భించింది. అంతేనా.. క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ఆ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌, వీడియోలు.. ఏవీ బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌రొక వీడియోను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నార‌నే వార్త‌లు చిత్ర‌సీమ‌లో కాస్త గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

మార్చి 3వ తేదీన శ్రద్ధాక‌పూర్ (Shraddha kapoor) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మరొక వీడియోను షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2 పేరిట ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోందీ చిత్ర‌బృందం. ఈ సినిమా ఆమెకు తెలుగులో తొలిచిత్రం కాగా; హిందీలో ప్ర‌భాస్‌కు తొలిచిత్రం కావ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మై కూడా దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఈ ఏడాది ఆగ‌స్టు 15 తేదిన సాహోను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తోంది చిత్ర‌బృందం.

shraddha-kapoor-facebook

ADVERTISEMENT

శ్ర‌ద్ధాక‌పూర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసే ఈ టీజ‌ర్‌లో ఆమె పాత్రను పరిచ‌యం చేయ‌డంతో పాటు, ఆమెకు, ప్ర‌భాస్ పాత్ర‌కు మ‌ధ్య గ‌ల సంబంధం గురించి కూడా తెలియ‌నుంద‌ని.. ఈ టీజ‌ర్‌లో భాగంగా ప్ర‌త్యేక‌మైన కెమెరాతో వీరిపై షూట్ చేసిన కొన్ని షాట్స్‌ని పొందుప‌ర‌చ‌నున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో నిజం ఎంత‌వ‌ర‌కు ఉందో తెలియాలంటే మాత్రం ఆ వీడియో విడుద‌ల అయ్యే వ‌ర‌కు మ‌నం కాస్త వేచి చూడాల్సిందే.

ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ట‌! ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను దుబాయ్, రొమేనియాలో కూడా జరిపారు. అయితే సాహోకు సంబంధించిన వీడియో త్వ‌ర‌లో విడుద‌ల కానుంద‌నే వార్త తెలియ‌గానే అందులో ఏం ఉండ‌నుంది? ఎలాంటి ఎలిమెంట్స్  ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేయ‌నున్నారు.. మొద‌లైన అంశాల‌పై అంద‌రిలోనూ  ఆలోచ‌న‌లు రేకెత్త‌డం మొద‌ల‌య్యాయి.

prabhas-saaho

ఈ క్ర‌మంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు మీకోసం..

ADVERTISEMENT

* మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రాలలో 3వ స్థానంలో ఉంది సాహో .

* ఈ చిత్రం ప్రభాస్‌కి తొలి హిందీ చిత్రం కాగా.. శ్రద్ధ కపూర్‌కి తొలి తెలుగు చిత్రం.

* కెన్నీ బేట్స్ (Kenny Bates) వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేయగా; దాదాపు 400 మంది టెక్నీషియన్స్ సాహోలోని యాక్షన్ సన్నివేశాల కోసం కష్టపడ్డారు.

* అబు దాబీలో(Abu Dhabi) దాదాపు 60 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న భారతీయ చిత్రంగా ఇది ఒక రికార్డు సృష్టించింది.

ADVERTISEMENT

* ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్రత్యేకమైన టెక్నాలజీ ఉన్న కెమెరాలను ఉప‌యోగించిన‌ట్లు సమాచారం.

* సాహో చిత్ర థియేట్రికల్ రైట్స్‌ని T సిరీస్ (T-Series) సంస్థ రూ. 300 కోట్లు చెల్లించి పొందినట్టుగా ఒక వార్త ప్రచారంలో ఉంది. థియేట్రికల్ రైట్స్ పరంగా ఇది కూడా పెను సంచలనమనే చెప్పాలి.

ఇవి సాహో చిత్రానికి సంబందించిన కొన్ని ఆసక్తికర వివరాలు. ఇక మార్చ్ 3న టీజర్ విడుదలయ్యాక మరిన్ని ఆసక్తికర వివరాలు బయటకి తెలిసే అవకాశం ఉంది. యువ దర్శకుడైన సుజీత్ (Sujeeth) & నిర్మాతలు వంశీ (Vamsi) & ప్రమోద్ ‌(Pramod) కూడా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఏదేమైనా డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఇది ఒకరకంగా ప్రీ – రిలీజ్ గిఫ్ట్ అనుకోవచ్చు.

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

తేజ‌స్‌లో గ‌గ‌న‌విహారం చేసిన తెలుగు తేజం.. పీవీ సింధు..!

దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?

నాట్యం నేర్చుకున్న 43 ఏళ్ల‌కు.. అరంగేట్రం చేసిన సినీన‌టి సుహాసిని..!

ADVERTISEMENT
25 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT