ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పొట్టి వారే.. కానీ ఆత్మస్థైర్యంలో గట్టివారు..!

పొట్టి వారే.. కానీ ఆత్మస్థైర్యంలో గట్టివారు..!

సీలింగ్‌కు ఉన్న బూజు దుల‌పాల‌న్నా.. కాస్త ఎత్తులో ఉన్న వ‌స్తువులు అందుకోవాల‌న్నా ఒక స్టూల్ స‌హాయం లేనిదే ప‌ని పూర్తి కాదు. ఎత్తు త‌క్కువ‌గా ఉన్న వారు (short girls) త‌మ రోజువారి జీవితంలో కేవ‌లం ఇవే కాదు.. ఇలాంటి ఇబ్బందులు (Struggles) చాలానే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీటిలో కొన్ని న‌వ్వు తెప్పిస్తే, ఇంకొన్ని ఎత్తు త‌క్కువ‌గా ఉన్నందుకు త‌మ‌పై త‌మ‌కే కాస్త చిరాకు క‌లిగేలా కూడా చేస్తాయి. ఇంత‌కీ డైలీ లైఫ్‌లో పొట్టిగా ఉన్నవారు ఎదుర్కొనే ఆ ఇబ్బందులేంటో ఓసారి మ‌న‌మూ తెలుసుకుందాం రండి..

 * బాట‌మ్స్ రీసైజ్ చేయించాల్సిందే..!

షాపింగ్‌కు వెళ్లిన త‌ర్వాత ఎంతో ఇష్ట‌ప‌డి న‌చ్చిన డ్ర‌స్ కొనుక్కోవ‌డం స‌హ‌జ‌మే. మామూలుగా అయితే ర‌డీమేడ్ దుస్తులు కొన్న‌ప్పుడు చాలామంది వాటిని అలానే ధ‌రిస్తూ ఉంటారు. కానీ ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు మాత్రం బాట‌మ్ త‌ప్ప‌నిస‌రిగా రీసైజ్ చేయించుకోవాల్సిందే! త‌మ ఎత్తుకు స‌రిప‌డా బాట‌మ్ చివ‌ర్ల అంచుల‌ను మ‌డ‌త‌పెట్ట‌డం లేదా క‌ట్ చేయించ‌డం వంటివి చేస్తుంటారు. అదీకాకుండా ఫ్లోర్ లెంత్ డ్ర‌స్ లేదా అనార్క‌లీ.. వంటివి ఎంచుకున్న‌ప్పుడు టాప్ సైతం ఒక్కోసారి రీసైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే వారికి స‌రిప‌డే దుస్తులు కోసం షాపింగ్ చేయ‌డ‌మంటే ఆషామాషీ వ్య‌వ‌హారం ఏమీ కాదు.

 * గ్రూప్ ఫొటోస్ తీసుకోవ‌డం క‌ష్ట‌మే..!

ADVERTISEMENT

మీ స్నేహితుల‌తో క‌లిసి గ్రూప్ ఫొటో తీసుకునేట‌ప్పుడు అంద‌రూ ఒకే ఎత్తులో క‌నిపించే విధంగా మీ ఫ్రెండ్స్‌ను ర‌క‌ర‌కాల పోజుల్లో మీరు నిల‌బెడ‌తారు. దాని ద్వారా మీ ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ఫొటోలో క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే మీ స్నేహితులు కూడా ఈ ప్ర‌క్రియ‌కు అల‌వాటు ప‌డిపోయి ఉంటారు. ఎందుకంటే వారు మిమ్మ‌ల్ని బాగా ప్రేమిస్తారు క‌దా! ప‌ని ప్ర‌దేశంలోనో లేక కుటుంబ స‌భ్యుల‌తోనే గ్రూప్ ఫొటో దిగాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం త‌క్కువ ఎత్తు ఉన్న‌వారిని ముందువ‌రుస‌లో పిలిచి మ‌రీ కూర్చోబెడ‌తారు. ఇది కూడా ఒక ర‌కంగా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవ‌చ్చు. అన్ని ఫొటోల్లోనూ మ‌నం స్ప‌ష్టంగా క‌నిపిస్తాం..

 group photo

* కౌగిలింత‌లూ ఇబ్బందే..!

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు పొడుగ్గా ఉన్న‌వారిని కౌగిలించుకున్న‌ప్పుడు వారి ఎత్తు మ‌హా అయితే ఛాతీ వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ఈ కార‌ణంగా మ‌న ముఖ భాగం వారి ఎద‌భాగానికి త‌గులుతూ ఉంటుంది. కాబ‌ట్టి ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు పొడుగ్గా ఉన్న‌వారిని కౌగిలించుకున్నా ఇబ్బందే!

ADVERTISEMENT

 * పొడ‌గ‌రుల‌తో జాగింగ్ కు వెళ్తే..

పొడుగ్గా ఉన్న‌వారు అడుగు తీసి అడుగు వేస్తే చాలు.. కాస్త ఎక్కువ దూర‌మే క‌వ‌ర్ అవుతుంది. కానీ అదే దూరాన్ని ఎత్తు తక్కువ‌గా ఉన్న‌వారు క‌వ‌ర్ చేయాలంటే న‌డ‌వ‌డం కాదు.. ఏకంగా ప‌రిగెత్తాలి. అలాంటిది పొడ‌గ‌రుల‌తో జాగింగ్‌కు వెళ్తే?? త‌లుచుకుంటేనే అమ్మో..! అనిపిస్తోంది క‌దూ! వారితో స‌మానంగా జాగింగ్ చేయాలంటే పొట్టిగా ఉన్న‌వారికి క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

 jogging

* వంట చేయ‌డంటే వ్యాయామ‌మే..

ADVERTISEMENT

ఏంటి? వ‌ంట‌కు, వ్యాయామానికి సంబంధం ఏంట‌ని ఆలోచిస్తున్నారా?? ఉందండీ.. ఎత్తు స‌రిప‌డా ఉన్న‌వారు లేదా పొడుగ్గా ఉన్న‌వారికి అది కేవ‌లం వంటే అయిన‌ప్ప‌టికీ.. ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికి అదొక వ్యాయామం కూడా. ఎందుకంటే ఎత్తులో ఉన్న‌వి అందుకోవడానికి వారు స్టూల్ ఎక్కి దిగ‌డం, చేతులు, కాళ్లు వంటివి పైకి ఎత్త‌డం.. చేస్తుంటారు. ఇవ‌న్నీ వారి శరీరానికి వ్యాయామాన్ని అందించేవే క‌దా!

 *మీరెప్ప‌టికీ క్యూట్ అనే అనిపించుకుంటారు..

పొట్టిగా ఉన్న‌వారు చిన్న‌పిల్ల‌ల్లా క‌నిపిస్తుంటారు. అందుకే చ‌క్క‌గా డ్ర‌స్ చేసుకుంటే చాలు.. యూ ఆర్ సో క్యూట్ అంటూ తెగ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ ఉంటారు. ఆ క్ష‌ణం ఈ పొగ‌డ్త‌ల కార‌ణంగా చాలా అందంగా ఉన్నామ‌ని.. మ‌నం మురిసిపోయినా ఆ త‌ర్వాత మాత్రం నేను ఎత్తు ఎందుకు పెర‌గ‌డం లేదంటూ మ‌న‌సులోనే బాధ‌ప‌డుతూ ఉంటాం.

 cute

ADVERTISEMENT

*ఇప్ప‌టికీ మీరు పిల్ల‌లే..

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా మిమ్మ‌ల్ని ఇప్ప‌టికీ పిల్ల‌లుగానే భావిస్తుంటారు కొంద‌రు. కానీ వాళ్లు ఎందుకు మిమ్మ‌ల్ని అలా పిల్ల‌లుగా అనుకుంటున్నారో మీకు అర్థం కాక మ‌న‌సులో మీరు అప్పుడ‌ప్పుడూ కాస్త‌ ఆందోళ‌న చెందుతుంటారు.

 *వారు మీ గురించి ఆలోచించ‌లేద‌నుకుంటారు..

మీరు స‌ర‌దాగా ఈత కొడ‌దామ‌ని స్విమ్మింగ్ పూల్‌లో దిగారు. తీరా చూస్తే దాని లోతు ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు దాని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వీలుగా స్టెప్ ల్యాడ‌ర్ ఉండ‌దు. ఇది చూడ‌గానే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేసేవారు ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారి కోసం అస‌లు ఆలోచించ‌లేద‌ని మీకు కోపం వ‌స్తుంది.

ADVERTISEMENT

 swimming

* మీకంటే చిన్న‌వారు పొడుగ్గా ఉంటారు..

వ‌య‌సులో మీ కంటే చిన్న‌వారైనా పొడుగులో మాత్రం.. మిమ్మ‌ల్ని మించిపోతారు మీ త‌మ్ముళ్లు/  చెల్లెళ్లు.. వారే కాదు.. మీ స్నేహితుల త‌మ్ముళ్లు /  చెల్లెళ్లు కూడా పొడుగ్గానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మిమ్మ‌ల్ని ఎవ‌రితో పోల్చుకున్నా వారే ఎత్తుగా ఉన్న‌ట్లు మీకు అనిపిస్తుంటుంది.

 * స్టెప్ స్టూల్ మీ వెంటే..

ADVERTISEMENT

ఎక్క‌డకు వెళ్లినా స‌రే.. ఒక స్టెప్ స్టూల్ మీ వెంట ఉండాల్సిందే! ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే అది మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవ‌చ్చు. అందుకే  మీరు ఎక్కడికి వెళ్లినా దానిని మీ వెంట త‌ప్ప‌కుండా తీసుకెళ్తుంటారు.

stool

కానీ ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పొట్టిగా ఉన్నవారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. వారికి ఉన్న పాజిటివ్ థింకింగ్ ఇంకెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. పొట్టిగా ఉండేవారు విపరీతమైన ప్రతిభా పాటవాలు కలిగుంటారని.. ఏదైనా సాధించాలన్న తపన వారిలో ఎక్కువగా ఉంటుదని.. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారని పలు స్టడీస్ చెబుతున్నాయి. చార్లీ చాప్లిన్, సచిన్ టెండుల్కర్ లాంటి వారిని మనం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

మీ బాయ్ ఫ్రెండ్ క‌ల‌లోకి వ‌స్తున్నాడా? దాని అర్థం ఏంటో మీకు తెలుసా??

అల్లరి పిడుగు బుడుగు.. మనింట్లో చిచ్చర పిడుగైతే..?

సినిమాలో చూపించినట్టు.. కాలేజీ జీవితం ఉండదమ్మా..!

18 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT