ల‌వ్ మేకింగ్.. సెక్స్ కు మ‌ధ్య ఉన్న తేడా మీకు తెలుసా??

ల‌వ్ మేకింగ్..  సెక్స్ కు మ‌ధ్య ఉన్న తేడా మీకు తెలుసా??

చాలా సందర్భాల్లో సెక్స్ (sex), లవ్ మేకింగ్ (love making) మధ్య తేడా తెలియక తెగ తిక‌మ‌క‌ప‌డుతూ ఉంటాం. సెక్స్‌లో  లవ్ మేకింగ్, లవ్ మేకింగ్‌లో సెక్స్ మిళితమై ఉంటాయా? ఇదే ప్రశ్నకు Quora లో కొంతమంది సమాధానమిచ్చారు. వాటిలో ఐదుగురు మాత్రం సెక్స్‌కి, రొమాన్స్‌కి మధ్య ఉన్న సన్నని గీతలాంటి తేడాను తెలియజేశారు. చాలా ఆసక్తికరంగా ఉన్న ఆ సమాధానాలు మీ కోసం..


1. భాగస్వామి విషయంలో నిబద్ధత, మానసిక ఉద్వేగం


లూయిస్ గోమెజ్ Quoraలో చెప్పిన సమాధానం: భాగస్వామి విషయంలో నిబద్ధతతో వ్యవహరించడం, వారితో ఉన్న మానసిక అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం మొదలైన అంశాలు సెక్స్, లవ్ మేకింగ్‌ను వేరుచేసి చూపిస్తాయి. లవ్ మేకింగ్ అంటే ప్రేమ, అనురాగంతో పాటు మానసిక అనుబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సెక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వీరిద్దరికీ కేవలం శారీరకపరమైన కలయిక మాత్రమే కాదు. అది వారి భావోద్వేగం.


సెక్స్.. ఇది పూర్తిగా శారీరక సుఖం కోసం చేసే ప్రక్రియ. కొన్ని అవసరాలను తీర్చుకోవడం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగికపరమైన కలయిక. దీనిలో ప్రేమ ఉండదు. కేవలం శారీరక అవసరాల కోసం మాత్రమే ఇది జరుగుతుంది. వన్ నైట్ స్టాండ్స్, త్రీసమ్ వంటివన్నీ దీని కిందకే వస్తాయి.


1 difference between sex and making love


Also read: ఆమె కౌగిలిలో కరిగిపోయా.. ఈ లోకాన్నే మరిచిపోయా: మోడరన్ రోమియోల మాటలివే..!


2. లవ్ మేకింగ్.. నిజమైన ప్రేమకు నిర్వచనం


ఇజ్రాయెల్ రమిరేజ్ Quoraలో చెప్పిన సమాధానం: ప్రేమలో మునిగి ఉండటమే కాకుండా.. లైంగికపరమైన కోరికలనూ తీర్చుకోవాలని ఆసక్తి కనబరిచే ఇద్దరు ప్రేమికులు ఉపయోగించే పదం లవ్ మేకింగ్. జీవితాంతం కలసి ఉండాలని నిర్ణయించుకొన్న వారికి సెక్స్ చాలా అందమైనది, ప్రేమ నిండినది. సెక్స్ అంటే వారి దృష్టిలో కేవ‌లం రెండు శరీరాల కలయికకు లేదా ఆర్గాజమ్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. లవ్ మేకింగ్ అనేది నిజమైన ప్రేమకు నిర్వచనం. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు.


3. తేడా కొందరి ఆలోచనల్లో ఉంది


ఫ్రాంక్లిన్ వీక్స్ Quora లో చెప్పిన సమాధానం: నా ఉద్దేశం ప్రకారం తేడా కొంతమంది ఆలోచనల్లోనే ఉంది. ప్రేమను సెక్స్ ద్వారానే తెలియజేయాలని కొందరి మెదడులో ఒక భావన నిక్షిప్తమైపోయి ఉంటుంది. మరికొందరిలో సెక్స్ చాలా నీచమైనదనే అభిప్రాయం కూడా ఉంది.


3 difference between sex and making love


Also Read: మీ ప్రేమ బంధం .. ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలని భావిస్తున్నారా..?


4. లవ్ మేకింగ్ ఓ కళ


పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి Quora లో చెప్పిన సమాధానం: నా ఉద్దేశం ప్రకారం సెక్స్ ప్రతిఒక్కరిలో సహజంగా రేకెత్తే శారీరకపరమైన కోరిక. లవ్ మేకింగ్‌లో మొదటి నుంచి చివరి వరకు ఒకరిపై ఒకరికి ఆపేక్ష, కోరిక రెండూ ఉంటాయి. రెండింటి అంతిమ లక్ష్యం ఒకటే అయినప్పటికీ.. లవ్ మేకింగ్ అనేది ఓ కళ. అది ప్రేమలో మునిగిన వారికే సాధ్యమవుతుంది.


5. సెక్స్ యాంత్రికంగా జరిగే చర్య


జాన్ కాటిలర్ Quora లో చెప్పిన సమాధానం: సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య యాంత్రికంగా జరిగే శారీరక చర్య. కానీ లవ్ మేకింగ్ అలా కాదు. ఇది మానసికంగా బలమైన అనుబంధం కలిగి ఉండడం. ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ, ప్రేమ కలిగుంటూ కొనసాగించే లైంగికపరమైన అనుబంధమే లవ్ మేకింగ్.


5 difference between sex and making love


Quoraలో ఫుల్ త్రెడ్‌ను మీరిక్కడ చదవచ్చు.


సో గర్ల్స్.. మీకు కావాల్సిన సమాధానం మీకు దొరికిందని మేం భావిస్తున్నాం.


GIFs: Giphy, Tumblr


Also Read: సెక్స్టింగ్: లైంగిక జీవితాన్ని హాట్ హాట్‌గా మార్చే.. రొమాంటిక్ సందేశాలు..!


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు చేరువ అవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కథనాలు మీరు చదవచ్చు.