చాటింగ్ టిప్స్: మాట ఇలా కలిపితే మనసుకి దగ్గర అవుతారు..!

చాటింగ్ టిప్స్: మాట ఇలా కలిపితే మనసుకి దగ్గర అవుతారు..!

ప్రస్తుతం మనం టెక్ యుగంలో నివసిస్తున్నాం. ఏదైనా సరే.. మనకు ఒక్క క్లిక్ దూరంలో ఉంటోంది. నిత్యావసరాల వస్తువుల నుంచి దుస్తులు, జ్యుయలరీ వరకు అన్నీ ఆన్‌లైనులోనే దొరుకుతున్నాయి. అక్కడితో ఆగామా? మనసుకి నచ్చే వ్యక్తిని సైతం ఆన్‌లైన్‌లోనే వెతుక్కొనే పరిస్థితికి వచ్చేశాం. దీని కోసమే అన్నట్టు ఎన్నో డేటింగ్ యాప్స్(dating app) పుట్టుకొచ్చేశాయి. మీరు కూడా డేటింగ్ యాప్‌లో మీ మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడ్డారా? అప్పుడు ‘ఏం చేస్తున్నావు?’, ‘ఎక్కడున్నావు?’ అని అడిగితే ఏం బాగుంటుంది? అందుకే మేం చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చాటింగ్ చేస్తే వారి మనసు దోచుకోవచ్చు.


1. కాస్త ఫన్నీగా..


డేటింగ్ యాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య సంభాషణ సడన్‌గా ఆగిపోకుండా ఉండాలంటే.. కాస్త హాస్యం కలగలిపి మెసేజ్ చేయాల్సిందే. అప్పుడే వారు మీరు పంపే ప్రతి మెసేజ్ చదవడంతో పాటు.. మీకు రిప్లై కూడా ఇస్తారు. మీరు పంపే సందేశం ద్వారా వారికి మీరు మంచి సంభాషణ చాతుర్యం కలిగిన వారు, హాస్య చతురత కలిగిన వారని తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య సంభాషణను కాస్త ఫ్లర్టీగా మార్చడానికి ప్రయత్నించండి.2. వీటితో సంభాషణ మొదలుపెట్టకండి


ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా.. కాబట్టి డేటింగ్ యాప్‌లో  ‘Hey Baby', 'hello sugar lips', 'Hi handsome' అంటూ సంభాషణను ప్రారంభించకండి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి. మీరు మాట్లాడే విధానాన్ని బట్టే మీతో ఎదుటి వ్యక్తి డేటింగ్ చేస్తారా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఫ్రెండ్లీగా మాటలు కలపండి. మొదటి మెసేజ్ వారి పేరునే పంపించండి. పేరు చివర ఆశ్చర్యార్థకం కూడా జోడించండి.


2-dating-app-creepy-gif


Also Read: ఓ నిర్ణయానికి వచ్చేముందు.. మీ బాయ్ ఫ్రెండ్‌ను ఈ ప్రశ్నలు అడగండి


3. ముందుగా కాస్త హోంవర్క్ చేయండి


డేటింగ్ యాప్లో మీకు నచ్చిన వ్యక్తి తారసపడితే వెంటనే మెసేజ్ చేయకుండా కాస్త అతడి ప్రొఫైల్ పరిశీలించండి. అప్పుడే వారి ఇష్టాలు, అయిష్టాలు తెలుస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పెట్ పేరెంట్ అయితే మీ సంభాషణను అక్కడే మొదలుపెట్టండి. తమ పెంపుడు జంతువుతో వారికి ఎంత అనుబంధం ఉందో అడగండి. వారికి ఇష్టమైన పెంపుడు జంతువు గురించి అడగండి. ఈ సంభాషణను వీలైనంత సింపుల్‌గా ఉంచడానికి ప్రయత్నించండి.


3-dating-app-cat-working-on-a-computer


4. GIF ఇమేజెస్ తో  


సంభాషణను ఎలా ప్రారంభించాలో తెలియనప్పుడు GIF ఇమేజ్‌తో వారి మనసు దోచేయండి. అయితే ఈ ఇమేజ్ వారి ప్రొఫైల్‌కి తగినట్లుగా ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు వారు వేగన్ అయితే దానికి తగినట్లుగా  ఉండే ఫన్నీ ఇమేజ్‌ను ఎంచుకోండి. దీనికి చక్కని క్యాప్షన్ జత చేసి పంపించండి. ఉదాహరణకి అతడు లేదా ఆమె వేగన్ అయితే ‘మీరు వేగన్.. నేను వేగన్.. కాబట్టి మన రిలేషన్ వర్కవుట్ అవుతుంది’ ఇలాంటి క్యాప్షన్ జతచేస్తే బాగుంటుంది.Also Read: కొన్ని ప్రేమ బంధాలు.. ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా?


5. టెన్సన్ పక్కన పెట్టండి


డేటింగ్ యాప్స్ ఈ మధ్యే ఉఫయోగించడం మొదలుపెట్టారా? సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదా? అయితే ఆ విషయం వారితో నిజాయతీగా చెప్పండి. దానికి కూడా కాస్త హాస్యం జోడించండి. అంతేకాదు.. ఇలా మొదటిసారి మెసేజ్ చేయడం మీకెంత ఇబ్బందిగా ఉందో కూడా చెప్పండి. ఇక మీ  ఇద్దరి మధ్య సంభాషణ దానంతట అదే ప్రారంభమవుతుంది.


5-dating-app-nervous-ross


6. ప్రశ్నించండి


మీ ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగడానికి, ఎదుటి వ్యక్తి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీరు కొన్ని ప్రశ్నలు సంధించాల్సిందే. అయితే అవి సాదాసీదాగా ఉండేలా కాకుండా.. కాస్త ఫన్నీగా ఉండాల్సిందే. ‘మీరు ఐస్ క్రీం ఫ్లేవర్‌గా మారాలనుకొంటే.. ఏ ఫ్లేవర్ ఎంచుకొంటారు?’, ‘మీరు ఉదయం నిద్ర లేచేసరికి మరో వ్యక్తిలా మారిపోయి ఉంటే.. మీరు చేసే మొదటి పని ఏంటి?’ మీరు వేసే ప్రశ్నలు ఇలా ఉండాలన్నమాట. ఇక మీ క్రియేటివిటీకి పదును పెట్టండి.


6-dating-app-robert-downey-jr


7. మీమ్స్‌తో అదరగొట్టండి


ప్రస్తుతం ఎక్కడ చూసినా మీమ్స్ ట్రెండ్ నడుస్తోంది. మీరు చెప్పాలనుకొంటున్న విషయాన్ని ఈ మీమ్స్ ద్వారా చెప్పొచ్చు. మీ మాటల్లో హాస్యం పలకదనుకొంటే చక్కగా మీమ్స్ పంపించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిలో మీ సంభాషణకు సరిపోయేలా ఉన్నవి ఎంచుకొని మరీ పంపించండి. అవసరమైతే మీరే ఓ మీమ్ తయారుచేయండి. ఇలా చేయడం వల్ల వారితో మీరు సంభాషణ కొనసాగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వారికి తెలుస్తుంది.


7-dating-app-i-dig-you


Also Read: మధురమే... మధురమే... ఈ ప్రేమ జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే..


8. ఆహారం గురించి మాట్లాడొచ్చు.


సంభాషణ మొదలుపెట్టిన తర్వాత మాటలు ఎలా కొనసాగించాలో తెలియకపోతే.. ఫుడ్ గురించి మాట్లాడొచ్చు. ‘పిజ్జాపై పైనాపిల్ ఉంటే మీకిష్టమేనా?’, ‘రోడ్ సైడ్ పానీపూరీ తినడం మీకు నచ్చుతుందా?’ ఇలాంటి ప్రశ్నలు అడగండి. మీ ఇద్దరూ ఫస్ట్ డేట్‌కి వెళ్లినప్పుడు రెస్టారెంట్‌లో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే చాన్స్ మీకే దక్కుతుంది.


8-dating-app-jimmy-kimmel-show


Images: Giphy, tumblr