ADVERTISEMENT
home / Bollywood
ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక

ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక

ఒకప్పుడు మన చిత్రాలలో ముద్దు సన్నివేశాలు ఉంటే.. సెన్సార్ (Censor) కత్తెరలో  ఎగిరిపోయేవి. దర్శక-నిర్మాతలు కూడా ఎందుకొచ్చిన తలనొప్పి అని భావిస్తూ.. ముద్దు సన్నివేశాలని లైట్ తీసుకునేవారు. అటువంటిది కాలక్రమేణా కిస్సింగ్ సీన్స్ కూడా చిత్రాలలో భాగమైపోవడమనే ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో “ముద్దు”.. అదే “లిప్ లాక్” సన్నివేశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇక సెన్సార్ వారు సైతం ఈ  సన్నివేశాలకు పెద్దగా కత్తెర వేయకపోవడం గమనార్హం.

నేటి చిత్రాలలో ఇంతలా మార్పు వచ్చినప్పటికి.. ఈ ముద్దు సన్నివేశాలని తెర పైన చూడలేని కొంతమంది తమదైన శైలిలో స్పందించడం.. వీలైతే నాలుగు విమర్శలు కూడా చేయడం సర్వసాధారణమైపోయింది. వీరిలో ఎక్కువమంది సోషల్ మీడియా వీక్షకులే. 

ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన రావడమే కాకుండా.. విడుదల చేసిన నాలుగు భాషల్లో సైతం ట్రెండింగ్ వీడియోగా బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ టీజర్‌లో హీరో హీరోయిన్లు అయిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక మందానల (Rashmika Mandanna) మధ్య తీసిన లిప్ లాక్ సన్నివేశం సంచలనమై సోషల్ మీడియాని షేక్ చేసింది.

 

ADVERTISEMENT

ఈ లిప్ లాక్ సన్నివేశానికి ఎంతమంది అయితే ఫిదా అయ్యారో.. దాదాపు అదే రేంజ్‌లో ఈ సన్నివేశంపై మండి పడినవాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఈ సన్నివేశానికి అభ్యంతరం చెప్పిన వాళ్ళంతా కూడా దాదాపు ఒకే కారణం చెబుతున్నారు. అదేంటంటే – విజయ్ – రష్మికలు నటించిన ‘గీత గోవిందం’ చిత్రంలో ఉన్న లిప్ లాక్ సన్నివేశాలకి మంచి స్పందన రావడంతోనే.. ఈ చిత్ర దర్శక-నిర్మాతలు కూడా అదే పంధాని అనుసరించారని విమర్శిస్తున్నారు.

సినిమా హిట్ కావాలంటే కథలో విషయం ఉండాలి కానీ.. ఇలా “లిప్ లాక్” సన్నివేశాలను ప్రమోషన్స్ రూపంలో వాడుకుని ప్రేక్షకులని థియేటర్స్‌కి రప్పించే పనులు చేయకండంటూ పలువురు డియర్ కామ్రేడ్ (Dear Comrade) టీం పై మండిపడ్డారు.

ఈ తరుణంలో ఆ విమర్శల పై స్పందించిన చిత్ర హీరోయిన్ రష్మిక.. “అసలు సినిమా మొత్తం చూడకుండా ఇలాంటి విమర్శలు ఎలా చేస్తారు? కథలో ఆ సన్నివేశానికి ప్రాధాన్యం ఉంది.. కాబట్టే “లిప్ లాక్” సన్నివేశంలో నటించాను. పైగా అనవసరమైన లిప్ లాక్స్‌ని ఇరికించే పని ఎవరూ చేయరు” అని కాస్త ఘాటుగానే స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

 

ADVERTISEMENT

రష్మిక ఇచ్చిన ఘాటు సమాధానంతో విమర్శకులు కాస్త సైలెంట్ అయ్యారు. “అవును.. ఏ నటులైనా ఇలాంటి సన్నివేశాల్లో నటించటానికి అంతగా ఆసక్తి చూపెట్టరు కదా! ఇలాంటి సన్నివేశాలు కథలో భాగమే తప్ప.. కావాలని ఎవరూ చేయరు కదా” అనే మాటలు రష్మిక అభిమానుల నుండి వినపడుతున్నాయి.

ఏదేమైనా… ‘లిప్‌లాక్‌’లకి కేర్ అఫ్ అడ్రస్‌గా విజయ్ దేవరకొండ చిత్రాలు మారుతున్నాయి అన్నది కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో  ‘డియర్ కామ్రేడ్’ చిత్ర టీజర్ పై ఈ స్థాయిలో విమర్శలు రావడంతో నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడే ఈ స్థాయిలో క్రిటిసిజం ఉంటే..  విడుదలయ్యాక ఇంకెన్ని విమర్శలు వస్తాయో’ అన్న చర్చ కూడా మొదలైంది.  

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమా గురించి.. మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?

ADVERTISEMENT

#RRR సినిమా గురించి.. ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన టాప్ 10 ఆసక్తికర పాయింట్స్..!

నా 14 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. ఒక‌ అంద‌మైన క‌ల‌: అనుష్క శెట్టి

25 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT