సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?

సెలబ్రిటీ టాక్:  ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే  ఏం చేయాలి ..?

మ‌న‌లో చాలామంది సినిమాల్లోని జంటలను చూసి.. తమ బంధం కూడా అలాగే ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమాల్లో జ‌రిగిన‌ట్లు నిజ జీవితంలో అస్స‌లు జ‌ర‌గ‌దు. ఎలాంటి జంట‌లైనా (Couples) స‌రే.. త‌మ బంధాన్ని కాపాడుకునేందుకు ఎంతో కొంత క‌ష్ట‌పడాలి.


గొడ‌వ‌లు, స‌ర్దుబాట్లు వంటివ‌న్నీ అన్ని జంటల మ‌ధ్యా జ‌రిగేవే. కానీ ఎప్పుడూ బిజీగా ఉండే బాలీవుడ్ సూప‌ర్ క‌పుల్స్ అయితే? ఇంకాస్త భిన్నంగా వ్యవహరిస్తారు.  త‌మ బంధాన్ని కాపాడుకోవ‌డానికి వారు ఇంకెన్నో ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తారు. ఈ క్రమంలో మనం కూడా, మ‌న బాలీవుడ్ జంట‌లు మ‌న‌కు నేర్పే కొన్ని రిలేష‌న్‌షిప్ రూల్స్ (relationship rules) ఏంటో తెలుసుకుందాం రండి..!


saifeena


1. క‌రీనా క‌పూర్‌, సైఫ్ అలీ ఖాన్‌


అత‌డు ప‌టౌడీ న‌వాబ్‌.. ఆమె సినిమాల్లో టాప్‌లో ఉన్న క‌పూర్ ఫ్యామిలీ బిడ్డ‌. ఇద్ద‌రికీ వ‌య‌సులో ప‌దేళ్లు తేడా ఉంది. అయితేనేం.. ఇది వారి ప్రేమ‌కు, పెళ్లికి ఏమాత్రం అడ్డు కాలేదు. కెరీర్‌లో బిజీగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో పెళ్లి చేసుకున్న క‌రీనా.. పెళ్లి త‌ర్వాతే కాదు.. పిల్లలు పుట్టాక కూడా త‌న కెరీర్‌ని హ్యాపీగా కొన‌సాగించింది. దీనికి ఆమెకు త‌న భ‌ర్త స‌హ‌కారం కూడా లభించిందని చెప్ప‌వ‌చ్చు.


వీరి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన పాఠం ఒక్క‌టే. అదేమిటంటే  "అన్ని ర‌కాల నియ‌మాలు అంద‌రికీ స‌రికావు. మీ బంధం నిల‌బ‌డాలంటే మీకు మాత్ర‌మే ప‌రిమిత‌మైన నియ‌మాలు పెట్టుకొని.. వాటిని పాటిస్తూ ఒక‌రికొక‌రు స‌హ‌కారం అందించుకుంటూ ముందుకెళ్లాలి. స‌మాజం ఏమ‌నుకుంటుందో అన్న ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టి మీ ఇద్ద‌రికీ న‌చ్చింది చేస్తూ ఆనందంగా ఉండాలి" ఈ విషయాన్ని ఈ జంట‌ను చూసి నేర్చుకోవాల్సిందే..


deepveer


2. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌


దీపికా ప‌దుకొణె చాలా సింపుల్‌, ఇంట్రోవ‌ర్ట్‌. కానీ ర‌ణ్‌వీర్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫ్యాష‌న్ల‌ను ఫాలో అవ్వ‌డం, వింత‌గా త‌యార‌వ్వ‌డం త‌న‌కెంతో ఇష్టం. త‌ను ఎక్స్‌ట్రోవ‌ర్ట్ కూడా. ఇద్ద‌రి వ్య‌క్తిత్వాలు పూర్తిగా భిన్న‌మైనా స‌రే.. ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమ ఉంటే చాలు.. జీవితాంతం ఆనందంగా ఉండొచ్చ‌ని వీరి జంట‌ను చూసి నేర్చుకోవ‌చ్చు. అంతేకాదు.. దీపిక గ‌తంలో ర‌ణ్‌బీర్‌ని ప్రేమించిన సంగ‌తి ప్ర‌పంచానికే కాదు.. ర‌ణ్‌వీర్‌కి కూడా తెలుసు.


ఆ బ్రేక‌ప్ నుంచి.. దాని వ‌ల్ల ఎదురైన డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి త‌న నెచ్చెలికి ఎంతో సాయం చేశాడు రణ్‌వీర్‌. వీరి జంట‌నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. "ఎలాంటి సంద‌ర్భం ఎదురైనా స‌రే.. జంట‌లు ఒక‌రికొక‌రు తోడుగా నిల‌వ‌డం వ‌ల్ల వారి జీవితం ఆనందంగా సాగుతుంది. తొలిప్రేమ జీవితాంతం ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ నిజ‌మైన ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది. అంత‌కుముందు మ‌న జీవితంలో ఎంత‌మంది వ‌చ్చినా.. నిజంగా ప్రేమించే వ్య‌క్తులు అడుగుపెడితే ఒక ర‌క‌మైన ఆనందం మ‌న సొంత‌మ‌వుతుంద‌నే విషయాన్ని" ఈ జంట నుండి నేర్చుకోవచ్చు.


genrith


3. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌


జెన్నీ, రితేష్ ఇద్ద‌రూ క‌లిసినప్పుడు ఆమె ఓ టీనేజ‌ర్‌. రితేష్ కూడా త‌న 20ల్లో ఉన్నాడు. మొద‌టి సినిమా స‌మ‌యంలోనే  వీరిద్ద‌రూ కలిసినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేమలో పడి.. డేటింగ్ కూడా చేయ‌డం ప్రారంభించారు. ముందు బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ప్రారంభ‌మైన వీరి ప్ర‌యాణం ఆపై ప్రేమికులుగా, త‌ర్వాత దంప‌తులుగా ఇలా.. ర‌క‌ర‌కాలుగా మారుతూ వ‌చ్చింది.


ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య స్నేహం ఉంటే వారు జీవితాంతం క‌లిసి ఉండ‌గ‌ల‌ర‌ని ఈ జంట నిరూపిస్తుంది. స్నేహితులు త‌ప్పనిసరిగా దంప‌తులు కావాల్సిన అవ‌స‌రం లేదు. కానీ దంప‌తులు మాత్రం.. మంచి స్నేహితుల్లా మెలగాల్సి ఉంటుంది. ఇలా మంచి స్నేహితుల్లా ఒక‌రి కంపెనీని మ‌రొక‌రు ఎంజాయ్ చేయ‌గ‌లిగితే.. జీవితాంతం ఒక‌రికొక‌రు బోర్ కొట్ట‌కుండా ఉంటారు. మీ బంధం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా క‌నిపిస్తుంటుంది. ఈ విషయాన్ని మనం ఈ జంట నుండి నేర్చుకోవచ్చు.


aishabhi


4. ఐశ్వ‌ర్యా రాయ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌


ఆమె మాజీ ప్ర‌పంచ సుంద‌రి. అత‌డు బాలీవుడ్‌లోనే ఘనమైన పేరు, ప్ర‌ఖ్యాత‌లు పొందిన కుటుంబానికి చెందిన వ్య‌క్తి. వీరిద్ద‌రూ వివాహం చేసుకుంటున్నారంటే ప్ర‌తి ఒక్క‌రి దృష్టీ వారిపైనే ఉండేది. పెళ్లి త‌ర్వాత కూడా ఐష్ మంచి స‌క్సెస్ సాధిస్తుంటే.. అభి సినిమాలు త‌న‌కంటే త‌క్కువ ఆర్జించేవి. ఈ విష‌యాన్నే చెబుతూ చాలామంది "అభి కంటే ఐష్ స‌క్సెస్‌ఫుల్" అనేవారు. కానీ ఈ విధమైన విషయాలు వారి బంధంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు.


అంతేకాదు.. ఒక ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి త‌ర్వాత అంత‌పెద్ద కుటుంబానికి కోడలై భిన్న పాత్రలు ఎలా పోషించిందనే విషయం ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. అందుకే ఐష్ కోడ‌లిగా, భార్య‌గా, త‌ల్లిగా త‌న బాధ్య‌త‌లు ఎలా కొన‌సాగిస్తోందో తెలుసుకోవడానికి చాలామంది ప్ర‌య‌త్నించడం గమనార్హం. కానీ ఈ జంట మాత్రం త‌మ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ఎప్ప‌టికీ ప‌ర్స‌న‌ల్‌గానే ఉంచారు. త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను బ‌య‌ట ప్ర‌పంచానికి ఏమాత్రం తెలియ‌నివ్వ‌లేదు. వీరి నుంచి నేర్చుకోద‌గిన రిలేష‌న్‌షిప్ రూల్స్‌ ఏంటంటే "భార్యాభర్త‌ల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు, ఆనందాలు.. ఇలా ఎన్నో కొన‌సాగుతూనే ఉంటాయి. కానీ ఇవేవీ బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌కూడ‌దు. వీటి ప్ర‌భావం తమ బంధంపై ప‌డ‌నివ్వ‌కూడ‌దు".


gaurisrk


5. గౌరీ, షారూఖ్ ఖాన్‌


గౌరీ, షారూఖ్‌లు చిన్న‌నాటి స్నేహితులు. అప్ప‌టికి షారూఖ్ సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ దారి వెతుక్కోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. వీరిద్ద‌రూ అప్పుడే వివాహం చేసుకోవాల‌నుకున్నారు. ధ‌నిక కుటుంబంలో పుట్టిన గౌరి.. షారూఖ్ ఇండ‌స్ట్రీలో విజ‌యం సాధిస్తాడ‌ని న‌మ్మింది. అందుకే త‌ను జీరోగా ఉన్న‌ప్పుడు త‌న‌ని పెళ్లాడింది. ఇందుకోసం మ‌తాలు, పెద్ద‌ల ప‌ట్టింపులు.. ఇలా అన్నింటినీ ప‌క్క‌న పెట్టింది.


ఆపై ఈ జంట‌కు ముగ్గురు పిల్ల‌లు పుట్టారు. అయితేనేం ఇర‌వై ఏడేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారీ జంట‌. ఈ జంట నుంచి నిబ‌ద్ధ‌త‌, ఒకేలాంటి మ‌న‌స్త‌త్వం ఉండ‌డం బంధానికి ముఖ్య‌మ‌ని తెలుసుకోవ‌చ్చు. ఒక‌రిప‌ట్ల ఒక‌రు ప్రేమ‌, న‌మ్మ‌కం చూపిస్తూ ఎదుటివారు చూపిన ప్రేమ‌, న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోగ‌లిగితే చాలు.. ఆ బంధం జీవితాంతం ఉంటుందనే విషయాన్ని ఈ జంట నిరూపిస్తుంది.


ఇవి కూడా చ‌ద‌వండి..


బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?


ప్ర‌పంచ సుంద‌రి ఫిట్‌నెస్ రహస్యాలేమిటో మీకు తెలుసా?


అతిలోక సుంద‌రి శ్రీదేవి.. అరుదైన చిత్రాల‌ను మీరూ చూస్తారా?