ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!

ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోమ్ నగరం..!

అమరావతి నగరాన్ని సింగపూర్‌గా మారుస్తామని.. మన నాయకులు చెప్పినట్లు సినీ నిర్మాతలు కూడా చెబుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమా కోసం ఏకంగా రోమ్ (Rome) నగరాన్నే హైదరాబాద్‌లో నిర్మించడానికి సిద్ధమయ్యారు.


ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? కానీ.. ఇది నిజమండీ బాబు. గోపీ కృష్ణ మూవీస్‌ నిర్మాణంలో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రానికి ప్రభాస్ (Prabhas) సైన్ చేశారు. ఈ చిత్ర కథ ఇటలీ నేపథ్యంలో సాగుతుందట.


ఈ క్రమంలో రోమ్ నగరం లుక్ వచ్చేలా కొన్ని సెట్లను హైదరాబాద్‌లో డిజైన్ చేయనున్నారు.  ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎస్‌.రవీందర్‌ రెడ్డి పర్యవేక్షణలో ఈ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.


ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరుగుతుందని.. మిగతా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని నిర్మాతలు చెబుతున్నారు.


ఒక ప్రాంతాన్ని పోలిన సెట్స్‌ను మరో ప్రాంతంలో వేయడం టాలీవుడ్ సినీ చరిత్రలో కొత్తేమీ కాదు. 'తొలిప్రేమ' చిత్ర షూటింగ్ సమయంలో.. దర్శకుడు కరుణాకరన్ తాజ్ మహల్  సెట్‌ను వేయించగా.. 'ఒక్కడు' సినిమాకి సంబంధించి దర్శకుడు గుణశేఖర్ చార్మినార్ సెట్‌ను వేయించారు.


అలాగే 'రంగస్థలం' సినిమా షూటింగ్ సమయంలో.. ఆ ప్రాంతానికి సంబంధించిన సెట్‌ను హైదరాబాద్‌లోనే వేయించడం విశేషం.


అలాగే 'చూడాలని ఉంది' సినిమా షూటింగ్ జరిగినప్పుడు కూడా.. కోల్‌కతా నగరాన్ని హైదరాబాద్‌లో సృష్టించారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ చిత్రం కోసం.. హైదరాబాద్‌‌లో రోమ్ నగరాన్నే నిర్మించనున్నారు.


ప్రస్తుతం ప్రభాస్ "సాహో" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంది.


రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి ప్రస్తుతం పేరేమీ పెట్టలేదు. ఇది ప్రభాస్ 20వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.


ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి రెడీయైన గోపీ కృష్ణ మూవీస్‌, కృష్ణంరాజు సొంత సంస్థ కావడం విశేషం.


గతంలో తన సోదరుడితో కలిసి ఇదే బ్యానర్ పై ఆయన సినిమాలు నిర్మించారు. ఇదే బ్యానర్ పై ప్రభాస్ హీరోగా రిలీజ్ చేసిన రెబల్ చిత్రం నష్టాలను చవి చూసింది.


ఈ క్రమంలో సాహో తర్వాత ఇదే బ్యానర్ పై మళ్లీ ఓ చిత్రం చేయాలని ప్రభాస్ యోచించినట్లు తెలుస్తోంది. గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.


ఇవి కూడా చదవండి


Featured Image: Pixabay.com, Facebook.com/ActorPrabhas


తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా?


చ‌క్క‌టి చెలిమి సంత‌కం..ఈ మ‌హ‌ర్షి మొద‌టి పాట‌..ఛోటీ ఛోటీ బాతే..


మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!