ADVERTISEMENT
home / సౌందర్యం
పట్టులాంటి కురులు.. మృదువైన‌ చర్మం..  “రోజ్ మేరీ ఆయిల్”తోనే సాధ్యం..!

పట్టులాంటి కురులు.. మృదువైన‌ చర్మం.. “రోజ్ మేరీ ఆయిల్”తోనే సాధ్యం..!

రోజ్ మేరీ ఆయిల్ (rosemary oil).. ఆయుర్వేద గుణాలున్న ఈ నూనె.. సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఎస్సెన్షియల్ ఆయిల్ చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చూస్తుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురి కాకుండా సంర‌క్షిస్తుంది. అంతేకాదు.. మీ జుట్టును సైతం ఆరోగ్యంగా మార్చేస్తుంది. మాడుకి పోషణ ఇచ్చి కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. పైగా ఇది మీ చర్మాన్ని చ‌క్క‌గా మాయిశ్చరైజ్ చేస్తుంది.

రోజ్ మేరీ మొక్క సన్నని ఆకులతో మధ్యదరా సముద్ర ప్రాంతంలో పెరుగుతుంది. దీనికి ఊదా, గులాబీ, తెలుపు, నీలం రంగుల్లో పూలు పూస్తాయి. రోజ్ మేరీ ఆకుల్లో నీరు, ఫైటోస్టెరోల్స్, ఫోలేట్, నియాసిన్, థయమిన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, రైబోఫ్లెవిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉంటాయి. దీని వల్ల చర్మం, కురులకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకొందామా?

రోజ్ మేరీ ఆయిల్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మం ప్రకాశవంతంగా మారుతుంది..

ADVERTISEMENT

రోజ్ మేరీ నూనెను రోజూ రాసుకోవడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. ఈ నూనెలో విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా మారేలా చేస్తాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు రాకుండా చూస్తాయి. వీటన్నింటి వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఆలివ్ నూనె వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలు

స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది

స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రోజూ క్రమం తప్పకుండా రోజ్ మేరీ నూనెను రాసుకొంటే.. అవి క్రమేపీ చర్మంలో కలిసిపోతాయి. రోజ్ మేరీ నూనెలో కొబ్బరి నూనె కలిపి రాసుకొంటే.. ఈ ఫలితం మరింత త్వరగా వస్తుంది.

ADVERTISEMENT

చర్మం యవ్వనంగా కనిపిస్తుంది

1-rosemary-oil-health-and-beauty-benefits

రోజ్ మేరీ నూనెను రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు తగ్గుముఖం పడతాయి. అలాగే మచ్చలు సైతం చర్మంలో కలిసిపోతాయి. చర్మం బిగుతుగా, ఆరోగ్యంగా తయారవుతుంది. రోజ్ మేరీ నూనెను మనం సన్ స్క్రీన్ గానూ ఉపయోగించవచ్చు. దీని కోసం రోజ్ మేరీ నూనెలో కొన్ని చుక్కల తేనె, కొంచెం పెరుగు కలిపి ఉపయోగించవచ్చు.

చర్మరంధ్రాలను శుభ్రం చేస్తుంది

ADVERTISEMENT

చర్మంపై పేరుకొన్న మురికి, జిడ్డు వంటి వాటిని సమర్థంగా తొలగిస్తుంది. అలాగే బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. ఈ ఫలితం పొందాలంటే.. ముందుగా ముఖానికి ఆవిరి పట్టాలి. ఆ తర్వాత స్క్రబ్ చేసుకొని ఆపై ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ మేరీ నూనెను చర్మానికి రాసుకొని మర్దన చేసుకోవాలి. చివరిగా ఫేసియల్ వైప్స్‌తో ముఖాన్ని తుడుచుకొంటే సరిపోతుంది.

డార్క్ సర్కిల్స్ లేకుండా..

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించుకోవాలంటే.. రాత్రి నిద్రపోయే ముందు ఐ క్రీంలో కొద్దిగా రోజ్ మేరీ నూనె కలిపి కళ్ల కింద రాసుకొని కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేస్తే.. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

Also Read: నూనె కాని నూనె.. జొజోబా నూనె అందించే సౌందర్య ప్రయోజనాలివే..!

ADVERTISEMENT

కురుల ఆరోగ్యానికి రోజ్ మేరీ నూనె

2-rosemary-oil-health-and-beauty-benefits

కురులు పెరిగేలా చేస్తుంది

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు తలకు రోజ్ మేరీ నూనె రాసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే చుండ్రుని సైతం సమర్థంగా తగ్గిస్తుంది. జుట్టు పలచగా ఉన్నా.. చుండ్రు సమస్యతో బాధపడుతున్నా రోజ్ మేరీ నూనె  ఉపయోగిస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. దీని కోసం రోజూ రాత్రిపూట తలకు రోజ్ మేరీ నూనెతో మర్ద‌న చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది.

ADVERTISEMENT

స్కాల్ఫ్‌ను మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది

స్కాల్ఫ్ దురదగా ఉంటే రోజ్ మేరీ నూనెను రాసుకోండి. దీని వల్ల దురదను కలిగించే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. అలాగే మాడు తరచూ పొడిగా మారే సమస్యతో బాధపడేవారు ఈ నూనె రాసుకొంటే.. స్కాల్ప్ మాయిశ్చరైజ్ అవుతుంది.

Also Read:  మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా?? ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

రోజ్ మేరీ నూనె అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు

ADVERTISEMENT

తరచూ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు

మీరు ఉపయోగించే మౌత్ వాష్ నిండుకుందా? అయితే రోజ్ మేరీ నూనెతో హోం మేడ్ మౌత్ వాష్ తయారుచేసుకోవచ్చు. దీని కోసం నీరు, రోజ్ మేరీ ఆయిల్ రెండూ కలిపి పుక్కిలించి ఊస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దంత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను నశింపచేయ‌వచ్చు.

ఏకాగ్రత పెరుగుతుంది

ఏ విషయంలోనైనా మీకు ఏకాగ్రత కుదరకపోయినా.. దృష్టి సారించలేకపోతున్నా.. రోజ్ మేరీ తైలంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. దీని కోసం ఎలక్ట్రిక్ డిఫ్యూజర్‌లో కొన్ని చుక్కల రోజ్ మేరీ నూనె వేయాలి. డిఫ్యూజర్ నుంచి వెలువడే రోజ్ మేరీ పరిమళాలు మీ నరమండలాన్ని శాంతింపచేస్తాయి. దీంతో చేస్తున్న పనిపై ఏకాగ్రత కుదురుతుంది.

ADVERTISEMENT

కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది

3-rosemary-oil-health-and-beauty-benefits

ఒత్తిడిలో మునిగిపోయినప్పుడు మన శరీరంలో కార్టిసాల్ విడుదలవుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడిని అరోమాథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు. రోజ్ మేరీ నూనెతో మసాజ్ చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది. ఫలితంగా కార్టిసాల్ విడుదల అదుపులోకి వస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ADVERTISEMENT

రోజూ తగు మొత్తంలో రోజ్ మేరీ ఆయిల్‌ను వాసన చూడటం ద్వారా మీ వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శరీరంలో రోగాలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో  carnosol, myrcene అనే యాంటీ ఆక్సిండెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తాయి.

జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి

రోజ్ మేరీ నూనెతో పొట్ట, పాదాలకు మర్దన చేసుకొంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పొట్ట బిగపట్టినట్టుగా ఉండటం, కడుపునొప్పి వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. మీకో విషయం తెలుసా? ఇలా మర్దన చేసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది. వినడానికి వింతగా అనిపించినా ఈ ట్రిక్ పనిచేస్తుంది.

తలనొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి

ADVERTISEMENT

తలనొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి రోజ్ మేరీ నూనె చక్కటి ఉపశమనాన్నిస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుని సైతం తగ్గిస్తాయి. నిద్రపోయే ముందు కొద్దిగా రోజ్ మేరీ నూనెను నొప్పిగా ఉన్న చోట రాసుకొంటే.. నిద్ర లేచే సరికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది.

Also Read:  బాదం పప్పు తింటే.. ఉండదు మన ఆరోగ్యానికి ముప్పు

రోజ్ మేరీ ఆయిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

4-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

1. రోజ్ మేరీ మొక్కకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? రోజ్మారినస్ అనే లాటిన్ పదం నుంచి. ఈ పదానికి సముద్రపు పొగమంచు అని అర్థం ఉంది. ఈ మొక్క పెరగడానికి నీరు అవసరం లేదు. తనకు అవసరమై పోషకాలను సముద్రపు తేమ నుంచి గ్రహిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

2. రోజ్ మేరీ మొక్క నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తు పెరుగుతుంది. మట్టి పీహెచ్ విలువ 6 నుంచి 7 వరకు ఉండి ఉష్ణోగ్రతలు 21.11 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఈ మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటాయి.

3. రోజ్ మేరీ మొక్క జీవితకాలం 20 ఏళ్లు. దీన్ని పెంచే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి చక్కగా పెంచుకోవచ్చు.

4. రోజ్ మేరీ మొక్కను భాగస్వామి పట్ల విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కాబోయే దంపతులు దీనిని ధరిస్తారు. పెళ్లికూతురు తలలో వీటిని అలంకరిస్తే.. పెళ్లికొడుకు ధరించిన కోట్ జేబుకి రోజ్ మేరీ ఆకులను పెడతారు.

ADVERTISEMENT

5. దీన్ని స్మృతి చిహ్నంగా కూడా ఉపయోగిస్తారు. అందుకే చనిపోయిన వారి సమాధిపై దీన్ని ఉంచి వారిని తలుచుకొంటారు.

6. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ దేశాల సముద్ర తీర ప్రాంతాల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.

7. పదహారో శతాబ్దంలో ఆసుపత్రి గదుల్లో రోజ్ మేరీ ఆకులను మండించేవారు. ఇలా చేయడం వల్ల అక్కడ క్రిములు నాశనమవుతాయని భావించేవారు.

8. రోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందినది. తులసి, లావెండర్, ఒరెగానో వంటి వాటి కేటగిరీకే చెందుతుంది.

ADVERTISEMENT

9. రోజ్ మేరీ నుంచి వెలువడే సువాసన, దానికుండే ఫ్లేవర్ కారణంగానే దీన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు.

5-rosemary-oil-health-and-beauty-benefits

10. రోజ్ మేరీ మొక్కలను పెంచుకోవాలనుకొనేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవి తేనెటీగలను ఆకర్షిస్తాయి.

రోజ్ మేరీ ఆయిల్ ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ADVERTISEMENT

ఇన్ని ప్రయోజనాలున్న రోజ్ మేరీ ఆయిల్ వల్ల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయా? అని సందేహమా? దీనిలో ఉండే కొన్ని విష పదార్థాల కారణంగా దీన్ని నేరుగా ఆహారంలో భాగంగా చేసుకోకూడదు. దీనిలో ఉండే కర్పూరం(camphor) కారణంగా జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజ్ మేరీ నూనెను పై పూతల మాదిరిగా ఉపయోగించాలే తప్ప ఆహారంలో భాగంగా చేసుకోకూడదు. దీని వల్ల తలెత్తే మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకొందాం.

బ్లడ్ షుగర్ స్థాయులు పెరిగిపోతాయి..

హైపోగ్లైసీమియాతో బాధపడేవారు రోజ్ మేరీ ఆయిల్ ఉపయోగించమని వైద్యులు చెబితేనే గాని ఉపయోగించవద్దు. ఎందుకంటే దీని వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల మీ బ్లడ్ షుగర్ స్థాయి పెరిగిపోతుంది. నీరసంగా అనిపించడం, దాహం వేయడం, ఆకలిగా అనిపించడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లక్షణాలన్నీ మధుమేహానికి సంబంధించినవే. మధుమేహంతో బాధపడేవారిలో చాలా మంది రోజ్ మేరీ నూనె ఉపయోగించడం వల్ల తమ సమస్య తగ్గుతుందని భావిస్తారు. కానీ దాన్ని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

చర్మవ్యాధులు రావొచ్చు

ADVERTISEMENT

రోజ్ మేరీ ఆయిల్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే దీని వల్ల కొందరిలో దురద, మంట, చర్మం ఎర్రగా మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ర ోజ్ మేరీ నూనె రాసుకొన్నప్పుడు ఇలాంటి సమస్యలు మీకెదురైతే వెంటనే శుభ్రం చేసుకోండి. మరలా దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయద్దు.

మార్కెట్లో లభించే నాణ్యమైన రోజ్ మేరీ ఆయిల్ బ్రాండ్స్

సెయింట్ బొటానికా ప్యూర్ రోజ్ మేరీ అరోమా ఎస్సెన్షియల్ ఆయిల్

6-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

ఈ అరోమా నూనెను ఎయిర్ డిఫ్యూషర్‌లో వేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్‌లో కలిపి ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. మేం చెప్పేది నమ్మాలంటే మీరు దీన్ని ఓసారి ఉపయోగించాల్సిందే.

ధర: రూ 399. ఇక్కడ కొనండి.

రే నేచురల్స్ రోజ్ మేరీ ఆయిల్

7-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

రోజ్ మేరీ నూనె మిమ్మల్ని ఉత్సాహంగా మార్చేస్తుంది. కీళ్లు, నుదుటి కణతలపై ఈ నూనెతో మర్దన చేసుకొంటే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ మేం ప్రస్తావించిన బ్రాండ్లలో ఇది చీప్ అండ్ బెస్ట్

ధర: రూ 239. ఇక్కడ కొనండి.

నేచర్స్ అబ్సల్యూట్స్ ప్యూర్ రోజ్ మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్

8-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

ఈ రోజ్ మేరీ ఆయిల్ ప్యాకేజ్ క్యూట్‌గా ఉండటం మాత్రమే కాదు. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీ హెయిర్ ఆయిల్ లో కలిపి ఉపయోగించండి మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే చర్మ నిగారింపు కోసం కూడా దీనిని.. ఏదైనా నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.

ధర: రూ 290. ఇక్కడ కొనండి

నైకా నేచురల్స్ రోజ్ మేరీ నూనె

9-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

ఈ నూనెను ఎక్కువగా అరోమాథెరపీ కోసం ఉపయోగిస్తారు. దీన్ని చర్మం, స్కాల్ప్ పై ఉపయోగించవచ్చు.

ధర: రూ 350. ఇక్కడ కొనండి.

జ్యూసీ కెమిస్ట్రీ రోజ్ మేరీ ఎస్సెన్షియల్ నూనె

10-rosemary-oil-health-and-beauty-benefits

ADVERTISEMENT

మీ చర్మం పొడిగా మారి పొట్టు రాలుతున్నట్టుగా మారితే ఈ నూనె ఉపయోగించండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. జిడ్డు చర్మం కలిగిన వారు దీన్ని ఉపయోగిస్తే సీబమ్ ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది.

ధర: రూ 300. ఇక్కడ కొనండి.

రోజ్ మేరీ నూనె గురించి ఎక్కువగా అడిగే ప్రశ్నలు

రోజ్ మేరీ నూనెను ముఖానికి రాసుకోవచ్చా?

ADVERTISEMENT

రోజ్ మేరీ నూనెలో చర్మానికి అవసరమైన పోషకాలతో పాటు యాంటీ సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ నూనె ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుందని కొంతమంది విశ్వసిస్తారు.

రోజ్ మేరీ ఆయిల్‌ను నేరుగా తలకు రాసుకోవచ్చా?

11-rosemary-oil-health-and-beauty-benefits

రాసుకోకూడదు. రోజ్ మేరీ నూనె చాలా గాఢతను కలిగి ఉంటుంది. దీన్ని నేరుగా రాసుకొన్నట్లయితే చెడు ఫలితాలు ఎదురవ్వచ్చు. కాబట్టి దీన్ని మీరు తలకు రాసుకొనే నూనెలో కలిపి ఉపయోగించడం మంచిది.

ADVERTISEMENT

రోజ్ మేరీ నూనె రాసుకొన్న తర్వాత జుట్టును వెంటనే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందా?

వెంటనే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందుగానే మనం చెప్పుకొన్నట్లుగా దీన్ని మరో నూనెలో కలిపి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీరు ఉపయోగించే షాంపూలో పది చుక్కల రోజ్ మేరీ నూనెను కలిపి దాంతో తలస్నానం చేయండి. ఇలా రెండు నెలల పాటు చేస్తే మీ జుట్టు సిల్కీగా, బౌన్సీగా మారుతుంది.

రోజ్ మేరీ నూనె ఉపయోగించడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన దుష్ప్రభావాలు ఏంటి?

వాంతులు, కోమా, ఫిట్స్, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే రోజ్ మేరీ నూనెను ఆహారంలో భాగం చేసుకొన్నప్పుడు లేదా దాన్ని తాగినప్పుడు ఈ పరిణామాలు ఎదురవుతాయి. కానీ చర్మానికి, స్కాల్ఫ్‌కి రాసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. అలా ఉపయోగించే ముందు సైతం ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి.

ADVERTISEMENT

Images: Shutterstock

27 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT