ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?

ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?

“ఈ ప్ర‌పంచంలో అన్నింటికంటే నీకేది ఎక్కువ ఇష్టం”అని అడిగితే ఆహారం (Food) అనే అంటాను. నాకు ఫుడ్ అంటే అంత ఇష్టం. ఎంత‌గా అంటే నా ఫోన్లోని (Apps) యాప్స్‌‌‌లో కూడా జొమాటో, స్విగ్గీ మొదటి స్థానంలో ఉంటాయి. దాదాపు రోజు విడిచి రోజు త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తాను. అది చిన్న బ్రౌనీ బాక్స్ కావచ్చు లేదా పెద్ద బిర్యానీ పార్శిల్ కావచ్చు. కానీ.. ఏదైనా ఆర్డ‌ర్ మాత్రం త‌ప్ప‌నిస‌రి. అలా ఆన్‌లైన్‌ (online)లో ఆర్డ‌ర్ చేసిన‌ప్పుడు నేను ఎదుర్కొనే ఫీలింగ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మీలో చాలామంది కూడా ఇలాగే ఫీల‌వుతుంటార‌ని నా నమ్మకం. మీకు నమక్మం లేదా? అయితే ఓసారి చెక్ చేసుకోండి.

food1

1. ఇంత టైమ్ ఎందుకు ప‌డ్తోంది?

ఆన్‌లైన్ ఆర్డ‌ర్‌లో నాకు న‌చ్చే అంశం “మ‌నం ఫుడ్ ద‌గ్గ‌రికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. అదే మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తుంది.” కానీ ఎప్పుడైనా డెలివ‌రీ బాయ్ స్టేటస్.. యాప్‌లో “ఆన్ ది వే” అని క‌నిపిస్తే మాత్రం.. టెన్షన్ పెరిగిపోతుంది. 

(రెండు గంటలవుతున్నా.. ఇంకా “ఆన్ ది వే” ఏంట్రా బాబు)

food2

2. డెలివ‌రీ బాయ్ అక్క‌డి నుంచి అస్స‌లు క‌ద‌ల్లేదు.. ఎందుకో?

ఆర్డ‌ర్ క్యాన్సిల్ చేయాల‌నుకుంటాను. కానీ చేయ‌డానికి మ‌ళ్లీ నా మ‌న‌సు ఒప్పుకోదు.

ADVERTISEMENT

(కాస్తా రూట్ తెలిసిన డెలివరీ బాయ్స్‌ను పెట్టుకోండి బాస్)

food3

3. అబ్బా.. ఈరోజు నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. ఎవ‌రైనా బిల్ షేర్ చేసుకుంటే బాగుండు..

బిల్ షేర్ చేసుకోవాలంటే.. మిత్రులతో ఫుడ్ కూడా పంచుకోవాలి క‌దా. అబ్బా వ‌ద్దులే.. అది నాకు అస్స‌లు న‌చ్చ‌దు.

(ఎవడి ఫుడ్ వాడిదే.. ఎవడి బిల్లు వాడిదే)

food4

4. ఈ రోజు హెల్దీ ఫుడ్ తిందామా? జ‌ంక్ ఫుడ్డా?

మ‌న‌సేమో పిజ్జా తిన‌మంటోంటే.. శ‌రీర‌మేమో స‌లాడ్ తినాలంటోంది. ఇలా జంక్‌ఫుడ్ తినీ తినీ శ‌రీరం బ‌రువు పెరిగిపోతోంది.

ADVERTISEMENT

(అబ్బా. అన్ని ఫుడ్స్‌లో క్యాల‌రీలు ఎందుకుంటాయో..)

food5

5. అబ్బా.. రెగ్యుల‌ర్ పిజ్జా చిన్న‌గా ఉంది.. లార్జ్ చాలా పెద్ద‌గా ఉంది.. ఏం తీసుకోవాలి?

ఎవ‌రో సైజ్‌కి, ఆనందానికి సంబంధం ఉండ‌దు అని చెప్పారు.

(అలాంటి అబ‌ద్దాలు ఎందుకు చెబుతారో..)

food6

6. సింగిల్ రోల్‌కి ఇంత డెలివ‌రీ ఛార్జా? ఎందుకు?

నేను ఆర్డర్ ఇచ్చిన “రోల్” జస్ట్.. 80 రూపాయ‌లే. కానీ డెలివ‌రీ ఛార్జ్ 100 రూపాయలు. ఇదేమి లాజిక్. 

ADVERTISEMENT

(మ‌నం ఆర్డ‌ర్ చేసిన ఆహారం తినడం ఒక్క ఎత్తైతే.. ఈ డెలివ‌రీ ఛార్జిలు, ట్యాక్సులు కట్టడం ఇంకొక ఎత్తు)

food7

7. ఈసారి ఏదైనా కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌ని అనిపిస్తోందా..?

ఈసారి “పాస్తా కోన్ పొమడారో ఈ బెసిలికో”  తినాలని ఉంది..? అదేమిటో మీకు తెలుసా.. నాకైతే తెలియదు. 

(చాలామంది తెలియని కొత్త డిష్‌లు ట్రై చేద్దామని భావిస్తారు. తీరే తిన్నాక.. దాని రుచి బాగాలేకపోతే ఏడుస్తారు. కుక్‌ని పచ్చిబూతులు తిడతారు)

food8

8. ఏదైనా ఆఫ‌ర్ ఉందేమో చెక్ చేసుకుంటా..

ఆన్‌లైన్ యాప్స్ మార్కెట్‌లోకి రోజుకొకటి విడుదల అవుతున్నాయి. ఇవి ఇచ్చే ఫుడ్ కూప‌న్స్ లేదా ఆఫర్స్ చూస్తుంటే మతి పోతుంది. ఇంత చక్కగా క్యాష్ బాక్ ఇస్తే.. నచ్చినవన్నీ తినేయనూ..!

ADVERTISEMENT

(కానీ తిన్నాక.. క్యాష్ బాక్ రాకపోతే.. ఫీల్ అవ్వద్దు)

food9

9. కార్డ్‌తో క‌ట్టాలా? క‌్యాష్ ఆన్ డెలివ‌రీ పెట్టాలా?

నా ద‌గ్గ‌ర ప‌ర్సులో ఎప్పుడూ పెద్ద‌గా క్యాష్ ఉండ‌దు. నా బ్యాంక్ బ్యాల‌న్స్ చెప్పుకోదగ్గదికాదు కాబట్టి.. ఇలా హార్డ్ క్యాష్ పెట్టుకునే అల‌వాటు లేదు. ఇప్పుడు కార్డ్‌తోనే క‌ట్టేస్తే బెట‌రేమో. పేటీఎంతో క‌డితే కాస్త క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది.

(పేటీఎంలూ, గూగుల్ పేలు వచ్చాక.. ఆన్‌లైన్ ఫుడ్ వ్యాపారం ఇండియాలో కొత్త పుంతలు తొక్కిందట)

food10

10. నా ఆర్డ‌ర్ ఇంకెవ‌రికైనా వెళ్లిపోతే ఎలా?

డ‌బ్బు ఆన్‌లైన్‌లో కట్టేసి మరీ.. ఆర్డర్ చేశాను. కానీ ఆ ఆర్డర్ వేరేవాళ్ల‌కు వెళ్లిపోతుందని నా భయం. నా డ‌బ్బులు వృథా అయిపోతాయని కూడా చాలా టెన్షన్ పడుతుంటాను. అయితే ఇప్పటి వరకూ నాకెప్పుడూ అలా జ‌ర‌గ‌లేదు. అంతా జీపీఎస్ మహాత్యం. కానీ ఏంటో నా పిచ్చి అనుమానాలు. నా ఫుడ్ అంటే.. నాకు అంత ఇష్టం మ‌రి.

ADVERTISEMENT

food11

11. యాప్‌లో చూస్తే ఈ ఫుడ్ చాలా నోరూరించేలా ఉంది. దీన్ని ఆర్డ‌ర్ చేస్తాను.

అయితే ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. ఆ ఫొటోల్లో ఉన్న‌ట్లుగానే మీకు వ‌చ్చిన ఆహారం ఉండాల‌ని రూలేం లేదు. రెసిపీ చ‌దివి నిర్ణ‌యం తీసుకోవాల్సిందే.

food12

12. మినిమం నాలుగువంద‌లు ఆర్డ‌ర్ చేయాలా? అయితే ఇంకో కోక్ తీసుకుంటా..

ఇలా తీసుకున్న కోక్ బాటిల్స్ నా గ‌దిలో గుట్ట‌లా ప‌డి ఉన్నాయి. మీకు తెలుసా?

food13

13. ఈరోజు ఏం ఆర్డ‌ర్ చేయాలి? చూస్తాను..

ఇక్క‌డే మీ ఆలోచ‌న ప్రారంభ‌మ‌వుతుంది. మీరు ఆక‌లితో ఉన్న సంగ‌తి మీకు తెలుసు.. కానీ మీకేం కావాలో ఎప్పుడూ మీకు తెలీదు.

మీకు తెలుసా? మీరు POPxo వెబ్‌సైట్ నుంచి కూడా ఫుడ్ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. మా హోమ్ పేజీ నుంచి ఓసారి ప్ర‌య‌త్నించండి. 

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జ‌రుగుతుంటాయి..

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

తొలి సంపాదన అందగానే.. అమ్మాయి మ‌దిలో మెదిలే ఆలోచ‌న‌లివే..!

ADVERTISEMENT

GIFs – giphy. 

24 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT