ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?

ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులకి ఇది ఒక రకంగా షాకింగ్ వార్తే! ఎప్పుడూ "హౌ ఆర్ యూ  మై డియర్ రౌడీస్? అంటూ తన ఫ్యాన్స్‌‌లో జోష్‌ని నింపే ఈ యంగ్ హీరో ఆసుపత్రిలో చేరడంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడా వార్త బాగా హల్చల్ చేస్తోంది. 


నిన్న ఉదయం 6 గంటల వరకు షూటింగ్‌తో బిజీగా ఉన్న విజయ్.. అనుకోకుండా హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతే దానికి కారణమైనా, సోషల్ మీడియాలో మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఈ విషయాన్ని చాలా పెద్దదిగా హైలెట్ చేయడం గమనార్హం.


అయితే విజయ్ అస్వస్థతకి గురవ్వడానికి ప్రధాన కారణం - విరామం లేకుండా షూటింగ్ చేస్తుండటమే అని సమాచారం. ఎక్కువగా ఎండలో పనిచేస్తుండడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కి గురయ్యారని ప్రాధమికంగా తెలుస్తోంది. ఒక రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని సమాచారం. 


తెలుగులో విజయ్ తాజాగా చేస్తున్న డియర్ కామ్రేడ్  (Dear Comrade) చిత్రం.. ఏకకాలంలో తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రూపొందడం విశేషం. అలాగే కన్నడం, మలయాళంలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండంతో.. విజయ్ పై కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. 


సినీ హీరోలు పని ఒత్తిడితో అస్వస్థతకు గురవ్వడం లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. అయితే ఇలాంటి విషయాలు చూడడానికి సాధారణంగా కనిపించినా.. నిర్మాతలకు మాత్రం చిక్కు సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. ఎందుకంటే హీరోలు గనుక అనారోగ్యానికి గురైతే.. షూటింగ్ షెడ్యూల్స్ అన్ని తారుమారవ్వడం.. తద్వారా సదరు చిత్రం అనుకున్న సమయానికి విడుదలకాకపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. 


ప్రస్తుతం "డియర్ కామ్రేడ్" చిత్రానికి సంబందించిన ఆఖరి షెడ్యూల్‌లో విజయ్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అనుకోకుండా తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ చిత్రానికి భరత్ కమ్మ (Bharat Kamma) దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. 


ఈ విషయాలన్నీ పక్కకుపెడితే, ఇటీవలే విజయ్ తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. తన పైన ఉన్న ప్రేమని, అభిమానాన్ని మనసులో దాచుకుంటే చాలని ఆయన సెలవిచ్చారు. అంతే తప్ప.. తమ వాహనాల నంబర్ ప్లేట్స్ వంటి వాటిపై తన పేరు లేదా రౌడీ అనే పేరు గానీ రాసి.. ప్రభుత్వం రూల్స్‌ని అతిక్రమించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. "మై డియర్ రౌడీస్ (Rowdies).. మీరు నా మాట వింటారని అని నాకు తెలుసు" అని తెలిపారు విజయ్. మరి ఈ రౌడీ స్టార్ చెప్పిన మాటని.. ఆయన ఫ్యాన్స్ ఎంతవరకు వింటారు అనేది వేచి చూడాలి.ఏదేమైనా.. తీవ్ర పనిభారంతో అస్వస్థతకి గురై ఆసుపత్రిలో చేరిన మన "అర్జున్ రెడ్డి" తొందరగా కోలుకోవాలని మళ్ళీ ఎప్పటిలా జోష్గా ఉండాలని మనసారా కోరుకుందాం. గెట్ వెల్ సూన్ విజయ్..!


ఇవి కూడా చదవండి


మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!


స్వచ్ఛమైన ప్రేమకు అందమైన నిర్వచనం.. చైతూ, సమంతల జంట..!


"సాహూ" నిర్మాతలకి ప్రభాస్ పెట్టిన చిత్రమైన కండీషన్.. వింటే ఆశ్చర్యపోతారు..!