ఆర్గాజమ్‌తో ఆనందమే కాదు.. ఆరోగ్యమూ పొందవచ్చు..!

ఆర్గాజమ్‌తో ఆనందమే కాదు.. ఆరోగ్యమూ పొందవచ్చు..!

ఆర్గాజమ్ (Orgasm) లేదా భావప్రాప్తి.. ఎలా పిలిచినా సరే శృంగారంలో పాల్గొన్నప్పుడు కలిగే ఆ అనుభూతి గురించి వర్ణించాలంటే చాలా కష్టం. అందుకేనేమో మళ్లీ మళ్లీ దానికోసం ఆరాటపడుతుంటాం. ఇలా భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నప్పుడు పొందే ఆర్గాజమ్ మీకు ఆనందాన్నివ్వడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. కొన్ని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఏంటీ నమ్మశక్యంగా లేదా? అయితే మీరు ఈ కథనాన్ని చదవాల్సిందే.


orgasm-stress


ఒత్తిడిని తగ్గిస్తుంది


భావప్రాప్తి జరిగినప్పుడు మెదడు సెరటోనిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది.  ఇవి మనలో ఒత్తిడిని తగ్గిస్తాయి. హెల్త్ లైన్ వెబ్సైట్ ప్రకారం ఆర్గాజమ్ పొందిన సమయంలో రక్తంలోకి ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి, టెన్షన్, ఇతర యాంక్సైటీ డిజార్డర్లను తగ్గిస్తుంది. ఫలితంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం.


గుండె  జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది


ఆర్గాజానికి గురైనప్పుడు రక్తంలోకి వివిధ రకాల హార్మోన్లు విడుదలవుతాయి. వీటిలో కొన్ని గుండె ఆరోగ్యాన్నికాపాడతాయి. అంతేకాదు దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం సైతం తగ్గుముఖం పడుతుంది.


orgasm-heart-health


రక్త సరఫరా మెరుగుపడుతుంది


కొన్ని రకాల అధ్యయనాల ద్వారా ఆర్గాజమ్ వల్ల కటి ప్రదేశంలో రక్త సరఫరా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. అవసరమైన చోటుకి పోషకాలు, హార్మోన్లు రక్తం ద్వారా సులభంగా చేరుకొంటున్నట్లు సైతం గుర్తించారు.


వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది


మీకో విషయం తెలుసా? తరచూ శృంగారంలో పాల్గొనడం ద్వారా జలుబు, ఫ్లూ వంటివి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయట. సుమారుగా 20 శాతం మేర మన వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కాకపోతే ఆరోగ్యం బాగా లేని సమయంలో మాత్రం సెక్స్‌లో పాల్గొనే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీ భాగస్వామి సైతం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.


సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారి కనీసం ఒక్కసారైనా ఆర్గాజమ్‌కి చేరుకొంటాం. ఈ ఆర్గాజమ్ వల్ల మనకు కలిగే మరో ప్రయోజనం ఏంటో తెలుసా? నొప్పిని తట్టుకొనే శక్తి మనకు పెరుగుతుంది.


orgasm-sleep


చక్కటి నిద్ర పడుతుంది


ఆర్గాజమ్‌కి లోనైన సందర్భంలో శరీరం వివిధ రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. వాటిలో ఆక్సిటోసిన్, సెరిటోనిన్, వాసోప్రెసిన్ ముఖ్యమైనవి. ఇవి నిద్ర పట్టేలా చేస్తాయట. అందుకే.. పడకపై అలసిన తర్వాత ఆదమరిచి నిద్రపోతుంటాం.  ఇదెలా సాధ్యమో తెలుసా? ఈ హార్మోన్లు శరీరంలో కార్టిసోల్ స్థాయులను తగ్గిస్తాయి. ఫలితంగా మనకు చాలా రిలాక్సయిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు.. తరచూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన జీవ గడియారం పనితీరు సైతం మెరుగుపడుతుందట.


orgasm-skin-health


స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది.


ఆర్గాజమ్ పొందినప్పుడు చర్మానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తంతో పాటు చర్మానికి అవసరమైన పోషకాలు సైతం అందుతాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి ఛాయ సైతం మెరుగుపడుతుంది. అంతేకాదు ఆర్గాజమ్ వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. ఇది ముదిమ ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఎలాగో తెలుసా? ఈస్ట్రోజెన్ కొల్లాజెన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల చర్మం ముడతలు పడకుండా, మెరుపును కోల్పోకుండా  కాపాడుతుంది.


orgasm-weight-loss


బరువు తగ్గిస్తుంది.


సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బరువు తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నడుము, హిప్ భాగాల్లో పేరుకొన్న కొవ్వు తగ్గుతుంది. దీని వల్ల మీకు మాత్రమే కాదు మీ భాగస్వామికి సైతం ప్రయోజనం కలుగుతుంది.


orgasm-health-benefits


పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి


ఆర్గాజమ్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. పీరియడ్స్ లేని రోజుల్లో వారానికి  రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల.. ఈ ఫలితాన్ని పొందవచ్చంటున్నారు నిపుణులు.


ఇంకెందుకాలస్యం.. వీలు కుదిరినప్పుడల్లా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేయండి మరి.


Feature Image: Shutterstock


GIFs: Giphy


ఫిమేల్ కండోమ్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు


పెళ్లయిన కొత్తలో.. అమ్మాయికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే..!


ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?