ఈ సెర్చింజన్ ట్రిక్స్.. మనకు గూగుల్ తల్లి కూడా చెప్పదు

ఈ సెర్చింజన్  ట్రిక్స్.. మనకు గూగుల్ తల్లి కూడా చెప్పదు

ఈ మధ్యకాలంలో మన జీవితాన్ని గూగుల్ చాలా ప్రభావితం చేస్తోంది. ప్రభావితం అనే కంటే.. పూర్తిగా మార్చేసిందంటే సరిగా ఉంటుందేమో. ఏ చిన్న అంశం తెలుసుకోవాలన్నా గూగుల్ తల్లినే అడుగుతుంటాం. నిత్యం మనం ఉపయోగించే గూగుల్ సెర్చింజన్లో మనకు తెలియని ఎన్నో అంశాలున్నాయి. వాటి గురించి చాలామందికి అంతగా తెలీదు. మరేం ఫర్వాలేదు. ఆ ట్రిక్స్ మేం మీతో షేర్ చేసుకొంటాం. అవి మీకు కచ్చితంగా నచ్చుతాయి.


ట్రిక్స్ మాత్రమే కాదు.. కొన్ని రకాల గేమ్స్ కూడా మనం గూగుల్ సెర్చింజన్లో ఆడొచ్చు. దీనికోసం మనమేమీ ప్లేస్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెర్చి ఇంజన్లోనే గంటల తరబడి మీకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం.. వాటి గురించి మనం కూడా తెలుసుకుందాం


గమనిక: ఈ ట్రిక్స్ పనిచేయాలంటే.. ముందుగా గూగుల్ సెర్చింజన్ సెట్టింగ్స్ లో ‘Never show instant results’ చెక్ బాక్స్‌ను అన్చెక్ చేయడం మరచిపోవద్దు.


ట్రిక్ 1: Do A Barrel Roll


1-google-tricks


గూగుల్ హోం పేజీకి వెళ్లి ‘Do A Barrel Roll’ అని టైప్ చేసి.. ఆ తర్వాత ఎంటర్ నొక్కి మీ స్క్రీన్‌ను పరిశీలించండి. అది గుండ్రంగా తిరుగుతుంది. స్క్రీన్ అలా తిరగడం చాలా సరదాగా ఉంది కదా. మరింత ఫన్ జోడించాలంటే.. Do A Barrel Roll 20 times అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీ స్క్రీన్ 20 సార్లు గుండ్రంగా తిరుగుతుంది.


ట్రిక్ 2: Google Gravity


2-google-tricks


మీ గూగుల్ హోం పేజి అలా క్రాష్ అయిపోతూ అలా కింద పడిపోతుంటే చూడాలనుందా? అయితే మీరు ఈ ట్రిక్ ఓ సారి ప్రయత్నించాల్సిందే. గూగుల్ హోం పేజీ సెర్చి బార్లో Google Gravity అని టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తున్నప్పుడు ఆటో సజెషన్స్ వస్తుంటాయి. కానీ వాటిని పట్టించుకోవద్దు. టైప్ చేసిన తర్వాత ఐయామ్ ఫీలింగ్ లక్కీ అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి. అన్నీ పై నుంచి కిందకు పడిపోతాయి. మరో ట్రిక్ ఏంటంటే.. మౌస్ సాయంతో ఇలా కింద పడిపోయిన వాటిని మీకు  నచ్చిన చోటుకు డ్రాగ్ చేసుకోవచ్చు.


ట్రిక్ 3: Pacman ఆట


3-google-tricks


Pacman ఆట ఆడటమంటే అందరికీ ఇష్టమే. కానీ దాన్ని బ్రౌజర్లో ఆడటం ఎలా? గూగుల్ హోంపేజిలో Pacman అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత  ‘క్లిక్ హియర్ టు ప్లే’ అనే బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చాలా కూల్ కూల్‌గా Pacman ఆట ఆడేయచ్చు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. చాలా సరదాగా ఉంటుంది. పైగా మంచి టైంపాస్ కూడా.


ట్రిక్ 4: మీకు నచ్చిన డూడుల్ తో మళ్లీ మళ్లీ చూడచ్చు


4-google-tricks


సందర్భానికి తగినట్లుగా గూగుల్ డూడుల్స్‌ను రూపొందిస్తుంటుంది. అలా మీకు నచ్చిన డూడుల్స్‌ను మళ్లీ మీరు చూడాలనుకొంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీకు నచ్చిన డూడుల్స్‌ను మీకు నచ్చినన్నిసార్లు వీక్షించండి.


ట్రిక్ 5: Atari Breakout


5-google-tricks


ఈ ట్రిక్‌తో గూగుల్ సెర్చ్‌లో ఇమేజెస్‌ను మనం బ్లాక్ బ్రేకర్ గేమ్‌గా (Block breaker game)  మార్చేయచ్చు. దీనికోసం ముందుగా గూగుల్ హోంపేజిలో Atari Breakout అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. తర్వాత ఇమేజెస్‌లోకి వెళ్లి.. మొదటి ఇమేజ్‌ను క్లిక్ చేస్తే బ్లాక్ బ్రేకర్ గేమ్ ఆడుకోవచ్చు.


ట్రిక్ 6: Flip A Coin


6-google-tricks


బొమ్మాబొరుసు వేయడానికి మనకు రూపాయి బిళ్ల అవసరం. మరి ఆ నాణెం మన దగ్గర లేకపోతే? మరేం ఫర్లేదు. జై గూగుల్ తల్లి అనేద్దాం. అదెలాగనుకొంటున్నారా? గూగుల్ హోంపేజీకి వెళ్లి Flip A Coin అని టైప్ చేసి ఎంటర్ చేయండి. కాయిన్ గిర్రున తిరిగి మరీ టాస్ వేస్తుంది.


మరిన్ని గూగుల్ ట్రిక్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది కదా.. అందుకే మరికొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్ మీకోసం...


ట్రిక్ 7: Zerg Rush


7-google-tricks


గూగుల్ సెర్చ్‌లో మీరు Zerg Rush అని టైప్ చేసి ఎంటర్ చేయగానే స్క్రీన్ పైకి కొన్ని సున్నాలు వస్తాయి. వాటిపై క్లిక్ చేసి వాటిని నాశనం చేయాలి. లేదంటే అవి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌ను మింగేస్తాయి. కావాలంటే మీరే ఒకసారి ప్రయత్నించి చూడండి.


ట్రిక్ 8: Google Sphere


8-google-tricks


గూగుల్ హోంపేజిలో Google Sphere అని టైప్ చేసి ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అనే బటన్ పై క్లిక్ చేయాలి. కొన్ని సెకన్ల తర్వాత పేజీలో ఉన్నవన్నీ గుండ్రంగా తిరగడం మొదలుపెడతాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.


ట్రిక్ 9: Google Pirate


9-google-tricks


మీకు పైరేట్స్ అంటే ఇష్టమా? అదేనండి సముద్రపు దొంగలు. అయితే మీరు ఈ ట్రిక్ కచ్చితంగా ఉపయోగించాల్సిందే. గూగుల్ హోంపేజిలో Google Pirate అని టైప్ చేసి ఐయామ్ ఫీలింగ్ లక్కీ బటన్ పై క్లిక్ చేయాలి. అంతే సెర్చింజన్లో ఉండే ట్యాబ్స్ అన్నీ పైరేట్స్ భాషలోకి మారిపోతాయి.


ట్రిక్ 10: Google Mirror


10-google-tricks


గూగుల్ హోంపేజీని ఎప్పుడూ ఒకేలా చూసీ చూసీ బోర్ కొట్టిందా? అయితే వెరైటీగా గూగుల్ మిర్రర్ ప్రయత్నించండి. హోంపేజీ మొత్తం మిర్రర్ ఇమేజ్‌గా మారిపోతుంది. దీనికోసం గూగుల్ హోంపేజిలో Google Mirror అని టైప్ చేసి I'm feeling lucky బటన్ పై క్లిక్ చేయాలి.


ట్రిక్ 11: The Walk To Mordor


11-google-tricks


ఇది పూర్తిగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకం. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి The Shire’ to ‘Mordor’ లేదా ‘Rivendell’ to ‘Mordor’ అని టైప్ చేయండి. గూగుల్ మీకు ‘Mordor’ కు దారి చూపిస్తుంది.


ట్రిక్ 12: Customise Google With Your Name


14-google-tricks


ఎప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినా స్క్రీన్ పై గూగుల్ అనే రావాలా? దానికి బదులుగా అక్కడ మన పేరుంటే ఎంత బాగుంటుంది? ఇలా మీక్కూడా అనిపించిందా? అయితే ఈ ట్రిక్ వాడి గూగుల్ హోం పేజీని కస్టమైజ్డ్ పేజీగా మార్చేయండి. సింపుల్‌గా సెర్చ్ బార్‌లో Goglogo అని టైప్ చేసి ఐ యామ్ ఫీలింగ్ లక్కీ బటన్ పై క్లిక్  చేయండి. ఇప్పుడు Goglogo స్థానంలో మీ పేరు టైప్ చేయండి. కస్టమైజ్డ్ గూగుల్ పేజీ మీ సొంతమవుతుంది.


ట్రిక్ 13: Speak Klingon


12-google-tricks


ఇది స్టార్ ట్రెక్ అభిమానులకు ప్రత్యేకం. కాస్త సమయం మీ దగ్గర ఉంటే Klingon వర్షన్‌లో ఉన్న గూగుల్ పేజిని మీరు చూడొచ్చు.


ట్రిక్ 14: Google Askew


13-google-tricks


గూగుల్ సెర్చి బార్‌లో Askew అని టైప్ చేసి ఎంటర్ చేస్తే గూగుల్ సెర్చి బార్ ఓ వైపుగా వంగినట్లు కనిపిస్తుంది. Tilt అని టైప్ చేసినా ఇలాగే కనిపిస్తుంది.


ట్రిక్ 15: ఫై చార్ట్స్


15-google-tricks


గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ఉపయోగించే వారికి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. Shift, F12 కీస్ ఒకేసారి ప్రెస్ చేయడం ద్వారా పై చార్ట్స్ తయారుచేసుకోవచ్చు.


చూశారుగా ఎప్పుడూ మనం ఉపయోగించే గూగుల్‌లో ఫన్ క్రియేట్ చేసే ట్రిక్స్ ఎన్ని ఉన్నాయో. మీరు కూడా వీటిని ప్రయత్నించండి.


Images: Google


విజువల్ మ్యాజిక్ చేసే శంకర్.. మెగాస్టార్‌తో మరో వండర్ క్రియేట్ చేస్తారా?


మీకో విషయం తెలుసా? లిప్‌స్టిక్ తయారీకి.. కావాల్సిన సీడ్స్ లభించేది ఆంధ్రాలోనే..!


మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!