Summer Style: ఫ్యాషనబుల్‌గా.. సౌకర్యవంతంగా ఉండే పలాజో..!

Summer Style: ఫ్యాషనబుల్‌గా.. సౌకర్యవంతంగా ఉండే పలాజో..!

ఇంకా ఏప్రిల్ పూర్తి కాలేదు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తట్టుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. Summer లో కంఫర్టబుల్‌‌గా ఉండటంతో పాటు స్టైలిష్‌గా కనిపించేలా.. మన అవుట్ ఫిట్స్ ఉండాలి. సింపుల్‌గా ఉంటూనే వావ్ అనిపించేలా మన డ్రస్సింగ్ స్టైల్ ఉండాలి. పార్టీ వేర్‌గా మాత్రమే కాదు.. కార్యాలయాలకు వెళ్లేవారికి సైతం ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండాలి.


ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉక్క భరిస్తూ పనిచేయాలంటే దానికి తగ్గట్టుగా మన దుస్తులు ఉండాలి కదా. ఈ సమయంలో జీన్స్, లెగ్గింగ్స్‌తో స్టైలిష్‌గా కనిపించినప్పటికీ చెమట, ఉక్క వల్ల అవి మనకు అంత సౌకర్యవంతంగా ఉండవు.


అందుకే ఈ వేసవిలో పలాజో(Palazzo) ప్యాంట్స్ సరైన ఎంపిక. వీటిని ధరించి స్టైల్ దివాలా మెరిసిపోదాం. పలాజో ప్యాంట్స్‌ను రోజువారీ ధరించడానికి వీలుగా ఉండేలా కొన్ని స్టైలింగ్ టిప్స్ తెలుసుకొందాం.


వేసవిలో ధరించడానికి అనువుగా ఉండే పలాజోలు


1. స్ట్రెయిట్ కట్ పలాజో


1-palzzo-straight-cut


నిన్న మొన్నటి వరకు టాప్స్, కుర్తీస్ పై ఎక్కువగా లెగ్గింగ్స్ ధరించేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని స్ట్రెయిట్ కట్ పలాజో ఆక్రమించింది. లాంగ్, షార్ట్ కుర్తాలు రెండింటికీ ఇది చక్కగా నప్పుతుంది.


2. knee length పలాజో


2-knee-length-palazzo


చూడటానికి షార్ట్ స్కర్ట్ మాదిరిగా కనిపించే ఈ పలాజో మీకు యంగ్ లుక్ ఇస్తుంది. కాటన్, క్రేప్ మెటీరియల్‌తో తయారైన పలాజోలు ధరించడానికి అనువుగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఈ పలాజోపై టాంక్ టాప్, కుర్తీ ధరించవచ్చు. సాధారణ టాప్ ధరిస్తే దానిపై ష్రగ్ వేసుకోవడం ద్వారా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.


3. పలాజో ట్రౌజర్


3-palazzo-trouser


సాధారణంగా ఫార్మల్ మీటింగ్స్, ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే ఫార్మల్ ప్యాంట్స్ ధరిస్తాం. దానికి బదులుగా పలాజో ట్రౌజర్ కూడా ధరించవచ్చు. దీనికి జతగా కాటన్ షర్ట్ ధరిస్తే చాలా కంఫర్టబుల్‌గా ఉంటూనే మనకు ఫార్మల్ లుక్ వస్తుంది. పలాజో ట్రౌజర్‌కి జతగా కుచ్చుల స్లీవ్స్ ఉన్నవి కూడా ధరించవచ్చు.


4. లేయర్ పలాజో ప్యాంట్స్


4-palazzo-layer


లేయర్ పలాజో ప్యాంట్స్ ఎప్పుడూ మీరు ప్రయత్నించలేదా? అయితే మీరు వెంటనే ఒకటి కొనుగోలు చేసి మీ వార్డ్రోబ్ కలెక్షన్‌కు జత చేయాల్సిందే. కాటన్, పాలియెస్టర్ కలగలిపిన వస్త్రంతో తయారైన పలాజో ప్యాంట్స్ ఈ వేసవిలో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. లేయర్ తరహా పలాజో ప్యాంట్ మీదకు హాల్టర్ నెక్ టాప్, షార్ట్ కుర్తీ, టీషర్ట్ బాగుంటాయి.


5. స్కర్ట్ స్టైల్ పలాజో


5-palazzo-skirt


కుచ్చులతో ఉన్న ఈ వైడ్ కట్ ప్యాంట్స్ చూడటానికి స్కర్ట్ మాదిరిగా కనిపిస్తాయి. ఈ రకం పలాజో మీకు ఎత్నిక్ లుక్ ఇస్తుంది. క్రాప్ టాప్, ట్యాంక్ టాప్, ప్లెయిన్ టీషర్ట్ దీనికి బాగా నప్పుతాయి. కుర్తాలను సైతం దీనిపై ధరించవచ్చు.


వేసవిలో పలాజోపై ధరించడానికి అనువుగా ఉండే టాప్స్


1. షర్టులు


6-palazzo-shirt


పలాజోలపై బ్రీఫ్ టాప్‌లనే ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. షర్టులు సైతం పలాజో ప్యాంట్స్ పై ధరించడానికి నప్పుతాయి. కాటన్ షర్ట్ లేదా షర్ట్ కుర్తా ధరించడం ద్వారా చాలా స్టైలిష్‌గా కనిపిస్తాం. సన్ గ్లాసెస్, స్నీకర్స్ ధరించడం ద్వారా ఫ్యాషనబుల్‌గా కనిపించవచ్చు. ప్రయాణాల్లో ఈ దుస్తులు ధరిస్తే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.


2. ఎసెమెట్రిక్ కుర్తా


ఈ వేసవిలో పార్టీలకు వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలే ఉక్క.. ఆపై పార్టీకి తగినట్టుగా హెవీ డ్రస్ వేసుకోవాల్సి రావడం చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఈ సారి పార్టీలకు వెళ్లే సమయంలో పలాజో ప్యాంట్ పై ఎసెమెట్రిక్ కుర్తాను ధరించండి. సింపుల్‌గా ఉన్నా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. పైగా సౌకర్యవంతంగానూ ఉంటుంది.


3. అనార్కలీ


అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. వీలైనంత వరకు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి ప్రాధాన్యమిస్తాం. పలాజో అనార్కలీ కాంబినేషన్ సరైన ఎంపిక. ఇది మిమ్మల్ని స్టైలిష్‌గా.. ట్రెడిషనల్‌గా కనిపించేలా చేస్తుంది. పైగా ఉక్క, అధిక ఉష్ణోగ్రతల వల్ల అసౌకర్యం కలగకుండా ఉంటుంది.


4. జాకెట్


9-palazzo-jacket


హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా కనిపించాలనుకొనే వారికి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. పలాజోపై క్రాప్ టాప్, కుర్తా, షర్ట్ కుర్తా, కుర్తీ ఏది ధరించినా దానికి జతగా లాంగ్ కోట్ ధరించడం ద్వారా మరింత అందంగా కనిపించవచ్చు. 


5. లేయర్ కుర్తీ


సాధారణంగా లేయర్ టాప్ కుర్తీలను లెగ్గింగ్స్, స్లిమ్ ఫిట్ ప్యాంట్స్ పై ధరిస్తాం. అయితే వీటిని పలాజోపై సైతం ధరించవచ్చు. వీటిని పార్టీవేర్‌గా ధరించవచ్చు. ఇవి మీకు సమ్మర్ కూల్ లుక్ ఇస్తాయి.


6. షార్ట్ కుర్తీ


10-palazzo short-kurti


పలాజో, షార్ట్ కుర్తీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. షార్ట్ కుర్తీ మాత్రమే కాకుండా క్రాప్ టాప్, టీషర్ట్ కూడా పలాజోపై ధరించడానికి బాగుంటాయి. 


Photos: Instagram


అత్తా కోడళ్లు ఇద్దరూ మ్యాచింగ్ మ్యాచింగ్ : సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్


ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..!


ఈ సమ్మర్ అడ్వెంచర్ డెస్టినేషన్స్.. మీకోసం ఎదురుచూస్తున్నాయి..