ఈ రోజు రాశిఫ‌లాలు తెలుసుకోండి.. బంగరు భవితకు బాటలు వేయండి

ఈ రోజు రాశిఫ‌లాలు తెలుసుకోండి.. బంగరు భవితకు బాటలు వేయండి

ఈ రోజు (ఏప్రిల్ 15) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (Horoscope and Astrology) మీకోసం..


 


మేషం (Aries) – మీ జీవితంలో అతిపెద్ద మార్పు జరగనుంది. ప్రస్తుతం మీకు బాగా ఒత్తిడిగా అనిపించవచ్చు. కాస్త బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. పాజిటివ్ ఆలోచనలకు శ్రీకారం చుట్టండి.


వృషభం (Tarus) – మీ చుట్టూ ఉన్నవారి గురించి మీకు ఎంత బాగా తెలుసు? వారిని నిజంగా నమ్మవచ్చా? అనే అంశాలను పరిశీలించండి. మీ మనసులో మాటను ఎవరితో పంచుకుంటున్నారో ఒక్కసారి చూసుకోండి. వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకండి.


మిథునం (Gemini) – మీ కోసం ఒక పెద్ద అడ్వంచెర్ వేచి చూస్తోంది. అది మీ జీవితాన్ని మార్చి వేస్తుంది. మీలో మార్పు తీసుకొస్తుంది. అందుకే ధైర్యంగా ముందడుగు వేయండి. గట్టిగా మిమ్మల్ని మీరు నమ్మండి.


కర్కాటకం (Cancer) – పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మీరు కాస్త తికమక పడుతున్నారు. ఇతరులు చెప్పే సలహాలు – సూచనలు వింటూ వాటి గురించే ఆలోచిస్తున్నారు. కాస్త రిలాక్స్ అయ్యి మీ మనసు ఏం చెప్తుందో వినండి.


సింహం (Leo) – ఆర్థికంగా మార్పులు జరిగే సమయం ఇది. మీ ఆలోచనలు తలక్రిందులయ్యే అవకాశం ఉంది. అయినా దిగులు పడకుండా ముందడుగు వేయండి. మీకు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా ఆత్మస్థైర్యాన్ని వీడకుండా.. ముందుకు వెళ్లండి. డబ్బనేది శాశ్వతం కాదు.. జీవితపు విలువలు అనేవి శాశ్వతం అనే సూత్రాన్ని నమ్మండి.


క‌న్య (Virgo) –  మీ జీవితంలో కొన్ని ప్రధానమైన మార్పులు జరుగుతున్నాయి లేదా రాబోయే రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో డబ్బు లేదా కెరీర్, కుటుంబం దేనికి సంబంధించిన సమస్య వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు. కాబట్టి మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టండి. కష్టపడితే.. మీరు కోరుకున్న విజయం మీ సొంతమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.


తుల (Libra) – మీరేం చేయాలో ఒక జాబితా రాసుకుని.. సహనంతో అందులోని అంశాలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మధ్యలో ఆగడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం, తిరిగి పని చేయడం.. ఇలా ఒక ప్రణాళికను అనుసరించండి. మీలోనూ మార్పు వస్తుంది.


వృశ్చికం (Scorpio) – మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకొనే దిశలో.. విజయం పొందే సమయం ఇది. వీలైనంత జాగ్రత్తగా మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఊహించని ఫలితాల పొందుతారు.


ధనుస్సు (Saggitarius) – మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందుకు వీలుగా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ జీవనశైలిలో మార్పులు.. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాల వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి.


మకరం (Capricorn) –  మీ పై మీరు పెట్టుకున్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి ఛాలెంజ్‌కు ఎదురెళ్తూ, అడ్డంకులను తొలగించుకునే మీరు ఇతరులకు కూడా సహాయపడండి. వారిలో ప్రేరణ కలిగించండి.


కుంభం (Aquarius) – క్రియేటివ్‌గా మీరు ప్రస్తుతం అంత యాక్టివ్‌గా లేకపోవచ్చు. అయినా చింతించకండి. మీ శక్తి తిరిగి పుంజుకోవాలి అనడానికి.. దీనికి ఒక సూచనగా భావించండి. ఇప్పుడు కొత్త బాధ్యతలేవీ స్వీకరించవద్దు.


మీనం (Pisces) – ప్రస్తుతం మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. మీ మనసు చెప్పే మాట విని ముందుకు వెళ్తే మీరు ఏదైనా సాధించగలరని గుర్తుంచుకోండి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


మీ రాశిఫలాలు తెలుసుకోండి.. భవిష్యత్ గమనానికి బాటలు వేయండి..!