నేటి రాశిఫలాలు.. మీ జీవిత గమనానికి వేస్తాయి చక్కని బాటలు..!

నేటి రాశిఫలాలు.. మీ జీవిత గమనానికి వేస్తాయి చక్కని బాటలు..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీ పెద్దల నుండి మీకు ఆశీర్వాదాలు అందుతాయి. వారితో ఏర్పడే సత్సంబంధాలను పటిష్టం చేసుకొని.. మీ బంధాలను మరింత బలపరుచుకోండి. ఇప్పటివరకు ముందుకు కదలని సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం దిశగా పయనిస్తాయి.


వృషభం (Tarus) – మీ తల్లిదండ్రుల పట్ల మీకు ఎన్నో ప్రేమాభిమానాలు ఉండవచ్చు. ఒకవేళ వారితో మీకేమైనా భేదాభిప్రాయాలు లేదా తగాదాలు ఉన్నా వాటిని ఇప్పుడు పరిష్కరించుకోండి. వారు కూడా మీకు సహకరిస్తారు. మీ సమస్యల పరిష్కారానికి తోడ్పాటును అందిస్తారు.


మిథునం (Gemini) – మీలో కొందరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుండవచ్చు. లేదా ఉద్యోగ భద్రత లేని కారణంగా నిరాశతో జీవితాన్ని వెళ్లదీస్తూ ఉండవచ్చు. అందుకే ఒక ప్రణాళికను వేసుకొని.. దానికి అనుగుణంగా మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో.. అన్నీ చేయండి. త్వరలో మీ సమస్యలు అన్నీ తీరుతాయి.


కర్కాటకం (Cancer) – ప్రస్తుతం మీ శారీరక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. అలాగే మీ మానసిక ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. దేని గురించీ అతిగా ఆలోచించకండి.


సింహం (Leo) – ఇప్పుడు మీకు ప్రేమ, తోడ్పాటు అందించే వారు ఎంతో అవసరం. అలాగే కుటుంబ సభ్యుల సహాయం, సహకారం కూడా ముఖ్యమే. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకూ మీ కుటుంబీకులతో సత్సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి . వారి మాటలు, ప్రేమ మీకు సంతోషాన్నిస్తాయి.


క‌న్య (Virgo) – మీరు బాగా సెన్సిటివ్‌గా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. అయితే మీ వైఖరి హద్దుల్లో ఉంటేనే మంచిది. మీ ప్రవర్తన అతిగా ఉండి.. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని భావించండి. 


తుల (Libra) – మిమ్మల్ని ఏదో ఒక సమస్య బాగా ఇబ్బందిపెడుతోంది. దాని గురించి మీరు ఇతరులతో కూడా పంచుకోవట్లేదు. కాబట్టి మీ సమస్యను ఒక కాగితం పై రాసి ఆ భగవంతుడి సహాయాన్ని కోరండి. తప్పక ఫలితం కనిపిస్తుంది.


వృశ్చికం (Scorpio) – మీరు చెప్పే మాటలు, చేసే పనులు సరితూగేలా చూడండి. పాజిటివ్‌గా ఆలోచిస్తూ; పాజిటివిటీతో వ్యవహరిస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది.


ధనుస్సు (Saggitarius) – మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల నుండి మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. అలాగే మీ చుట్టుపక్కల వారి ఉనికిని కూడా మీరు గమనించవచ్చు. వారు మీకు తప్పక సహకరిస్తారు.


మకరం (Capricorn) – మీ మనసుకు ఏర్పడిన గాయం మానాలంటే అది ప్రస్తుతం మీ చేతుల్లో లేదు. అందుకే ఇతరులు అందించే ప్రేమ, అభిమానాలే మీకు కొండంత శక్తిని అందించే అవకాశం ఉంది. అయితే మీరు ఒకసారి ప్రేమిస్తే.. వారి నుండి ఏమీ ఆశించకూడదని గుర్తుంచుకోండి.


కుంభం (Aquarius) – మీ సమస్యలకు అనుకోకుండా ఓ చిత్రమైన పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు.. మీకు ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను ఛాలెంజింగ్‌గా తీసుకుని వాటి నుంచి బయటపడతారు. దేని గురించీ మీరు భయపడకండి.


మీనం (Pisces) – ఇంట్లో, పని ప్రదేశంలో.. ఎక్కడైనా సరే.. ఏ విషయం గురించైనా సరే పాజిటివ్‌గానే ఆలోచించండి. మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు వాటంతటవే మీ ముందుకు వస్తాయి.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!