జుట్టు రాలడం (hair loss) ఇటీవలి కాలంలో మహిళలను ఎక్కువగా కలవరపెడుతున్న అంశం. అప్పటి వరకు ఒత్తుగా.. పొడవుగా ఉన్న జడ కాస్తా.. సన్నగా, కురచగా తయారవడం అనేది ఆడపిల్లలు రోజూ ఎదుర్కొంటున్న సమస్య. ఇలా జరగడానికి ఆరోగ్యపరమైన సమస్యలు, హర్మోన్ల విడుదలల వచ్చిన మార్పులు.. ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఒత్తిడి వల్ల సైతం జుట్టు పలచగా అయ్యే అవకాశం ఉంది. అసలు మహిళల్లో జుట్టు ఏ కారణాల వల్ల రాలుతోంది? వాటిని ఎలా గుర్తించాలి? జుట్టు రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు (remedies) తీసుకోవాలి? మొదలైన విషయాలను మనం ఈ కథనం ద్వారా తెలుసుకొందాం.
జుట్టు రాలుతోందని గుర్తించడానికి సూచనలు
మనం చేసే పొరపాట్లు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి
మీ జుట్టు రాలుతోందా? అయితే మీ సమస్య ఏమై ఉంటుంది?
జుట్టు రాలకుండా చేసే సహజమైన చిట్కాలు
జుట్టును స్టైలింగ్ చేసుకొనేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి
ఒక్కొక్కరికీ ఒక్కో కారణం వల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది. కొందరిలో ఉన్నట్టుండి జుట్టురాలడం మొదలుపెడితే.. మరి కొందరిలో నెమ్మదిగా మొదలై.. కాలం గడిచే కొద్దీ జుట్టు పలుచగా తయారవుతుంది.
జుట్టు రాలే ప్రక్రియ నెమ్మదిగా మొదలై నుదురు మరింత విశాలంగా తయారవుతుంది. దీన్నే మనం బట్ట తల అని పిలుస్తాం. ఇది పురుషుల్లో మాత్రమే కాదు.. మహిళల్లోనూ కనిపిస్తుంది. స్త్రీలల్లో పురుషుల మాదిరిగా కాకుండా పాపిట వెడల్పుగా తయారవడం.. నుదురు కాస్త వెడల్పుగా తయారైనట్టు కనిపించడం జరుగుతుంది.
కొందరికి జుట్టు ఒక్క చోటే ఊడుతుంది. అలా ఊడిన చోట కాయిన్ సైజ్‌లో ఖాళీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఎదురైన వారికి.. జుట్టు రాలిపోవడానికి ముందు ఆ ప్రదేశంలో విపరీతమైన దురద ఉంటుంది. దీన్ని మనం పేనుకొరుకుడు అని పిలుస్తాం.
కొన్నిసార్లు తల దువ్వుకొనేటప్పుడు ఎప్పుడూ లేనంతగా జుట్టు రాలుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగా లేని సందర్భాల్లో ఇలా జరుగుతుంటుంది. దువ్వుకొన్నప్పుడు మాత్రమే కాదు.. తలస్నానం చేసేటప్పుడు సైతం జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. దీనివల్ల జుట్టు పలచగా తయారవుతుంది.
కొన్ని వైద్యపరమైన చికిత్సలు తీసుకొంటున్నప్పడు జుట్టు రాలిపోవడం సహజం. ముఖ్యంగా కీమోథెరపీ వంటివి చేయించుకొంటున్నప్పుడు తలపై జుట్టు మొత్తం రాలిపోతుంది. అలాగే శరీరంపై ఉన్న రోమాలు సైతం ఊడిపోతాయి.
జుట్టు రాలిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. జుట్టు రాలిపోతే.. దాని స్థానంలో కొత్త జుట్టు కూడా వస్తుంది. కానీ జుట్టు రాలడం (hair loss) ఎప్పుడు సమస్యగా మారుతుందంటే.. రాలిన కేశాలతో పోలిస్తే.. తిరిగి మొలిచే వెంట్రుకలు తక్కువగా ఉంటేనే జుట్టు పలచగా మారిపోతుంది. రోజుకి వంద వెంట్రుకలు ఊడుతుంటే దాన్ని సాధారణమైన అంశంగానే పరిగణించాలి. కానీ అంతకంటే ఎక్కువ వెంట్రుకలు రాలుతుంటే మాత్రం సమస్య తీవ్రమైనట్లుగా భావించాలి. ఇలా జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుంటాయి.
Also Read: ఈ ఏడాది 10 రకాల ట్రెండీ హెయిర్ కట్స్.. (Trendy Summer Haircuts For Girls In Telugu)
మన తలపై ఉన్న జుట్టులో 90 శాతం మాత్రమే ఎదుగుతూ ఉంటుంది. మిగిలిన పది శాతం అలాగే ఉంటుంది. దీన్నే టోలియోజెన్ ఎఫ్లూవియమ్ అంటారు. ఈ పదిశాతం జుట్టు రాలిపోవడం సహజమైన ప్రక్రియే. అయితే మనం తీసుకొనే ఆహారం, జీవనశైలిలో వచ్చిన మార్పులు, కాలుష్యం ప్రభావం వల్ల మరింత ఎక్కువగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
మాడు దురదగా ఉన్నా.. పొట్టు రాలుతున్నా.. చుండ్రు వంటి సమస్యలున్నా వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటాయి.
జుట్టు రాలకుండా ఉండటానికి దూరంగా ఉంచాల్సిన ఆహారం
మనం తీసుకొనే ఆహారం మన ఆరోగ్యంపైనే కాదు.. అందంపైన కూడా ప్రభావం చూపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే.. చర్మం, కురులు రెండూ కళను కోల్పోతాయి. ఆహారంలో చక్కెర, కొవ్వులు వంటివి ఎక్కువగా తీసుకొంటే జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే జుట్టు దృఢంగా, అందంగా మెరుస్తూ ఉంటుంది.
సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని మాత్రమే కాదు.. కురులపై సైతం ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల జుట్టు పొడిగా, బిరుసుగా, బలహీనంగా తయారవుతుంది. కాబట్టి జుట్టుకు రక్షణ కల్పించేలా టోపీ, స్కార్ఫ్ వంటివి ఉపయోగించడం మంచిది.
జుట్టు తత్వానికి తగిన ఉత్పత్తులు వాడకపోవడం వల్ల కూడా.. వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీది పొడితత్వం కలిగిన జుట్టు అయితే.. ఆయిలీ స్కాల్ఫ్ ఉన్నవారు వాడే ఉత్పత్తులు వాడుతుంటే ప్రయోజనం ఏమీ లేకపోగా.. ఉన్న జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ జుట్టు తత్వాన్ని తెలుసుకొని దానికి తగిన ఉత్పత్తులు వాడటం మంచిది. అలాగే సల్ఫేట్ ఫ్రీ, పారబెన్ ఫ్రీ ఉత్పత్తులు ఉపయోగించాల్సి ఉంటుంది.
కర్లర్, స్ట్రెయిటనర్, డ్రైయర్.. వంటి వాటిని తరచూ ఉపయోగించడం వల్ల కూడా కురుల అందం, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం హెయిర్ లాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వాటిని ఉపయోగించడం మానేయండి.
స్త్రీట్నెర్స్ వాడేముందు ఏ హీట్ ప్రొటెక్టర్ మంచిది
మనలో చాలామందికి గట్టిగా జడవేసుకొనే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా హై పొనీటెయిల్, బన్స్ వంటి హెయిర్ స్టైల్స్ వల్ల మనం అందంగా కనిపించవచ్చు. కానీ ఈ హెయిర్ స్టైల్స్ తరచూ వేసుకోవడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ పాటించడం మంచిది.
Also Read: ఈ సమ్మర్ హెయిర్ స్టైల్స్.. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి..
తలస్నానం చేసిన వెంటనే తడి తలను దువ్వడం చాలామందికి ఉండే అలవాటు. కానీ కురులు పొడిగా ఉన్నప్పుడు.. దువ్వుకొన్న దానికంటే తడిగా ఉన్నప్పుడు.. కేశాలు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో దువ్వెన ఉపయోగించడం కంటే.. చేతులతోనే చిక్కు తీసుకోవడానికి ప్రయత్నించండి.
వెంట్రుకల చివర్లు చిట్లిపోయే సమస్య దాదాపుగా మహిళలంతా ఎదుర్కొనేదే. దీని వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడూ చివర్లు ట్రిమ్ చేసుకోవడం మంచిది.
వైద్య పరిభాషలో జుట్టు రాలిపోవడాన్ని అలొపేసియా అని అంటారు. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. అలొపేసియా రావడానికి జన్యువులు కారణం కావచ్చు. మనం పాటించే హెయిర్ కేర్ పద్ధతుల వల్ల రావచ్చు. లేదా జుట్టు కుదుళ్లను నాశనం చేసే స్టైలింగ్ పద్ధతుల వల్ల కావచ్చు. వివిధ కారణాల వల్ల అలొపేసియా వస్తుంది.
జన్యుపరమైన కారణాలు లేదా వారసత్వంగా కొందరు మహిళల్లో ఫిమేల్ ప్యాటర్న్డ్ బాల్డ్నెస్, హెయిర్ లాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా 12 నుంచి 40 ఏళ్ల మహిళల్లో ఈ అలొపేసియా కనిపిస్తుంది. కురులు క్రమంగా రాలుతూ జుట్టు పలుచగా తయారవుతుంది.
దీన్ని మన పరిభాషలో పేనుకొరుకుడు అని వ్యవహరిస్తారు. తలపై ఒక చోట ఉన్న కేశాలు మొత్తం రాలిపోయి, గుండ్రంగా ప్యాచెస్ మాదిరిగా కనిపిస్తుంది. ఒకటి రెండుగా మొదలైన ఇవి ఇంకా ఎక్కువ కావచ్చు. లేదా ఒకదానితో ఒకటి కలసిపోవచ్చు.
ఈ రకమైన అలొపేసియా వచ్చినవారికి ఒకసారి జుట్టు రాలితే.. మళ్లీ అది తిరిగి రాదు. ఎందుకంటే హెయిర్ ఫొలికిల్ స్థానంలో స్కార్ టిష్యూ చేరుతుంది.
మనం అనుసరించే హెయిర్ స్టైలింగ్ పద్ధతుల కారణంగా ఈ రకమైన అలొపేసియా వస్తుంది. హాట్ కోంబ్స్, బ్లో డ్రైయర్స్, స్ట్రెయిటనర్స్ అతిగా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని ఈ సమస్య వస్తుంది. హెయిర్ డై, షాంపూల్లోని రసాయనాల వల్ల సైతం ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
Image: Pixabay.com
గుడ్డులో సల్ఫర్, పాస్ఫరస్, సెలీనియం, అయెడిన్, జింక్, ప్రొటీన్ మొదలైనవి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అందుకే ఎగ్ మాస్క్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..
కొబ్బరి పాలల్లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ ఇ, పొటాషియం, ఫ్యాటీ ఆమ్లాలు, మినరల్స్ ఉంటాయి. ఇవి కురులను కుదుళ్ల నుంచి బలంగా అయ్యేలా చేస్తాయి. దీని వల్ల జుట్టు తెగిపోకుండా ఉంటుంది.
వెల్లుల్లిలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సల్ఫర్ ఉంటుంది. ఇది కురుల పెరుగుదలను ప్రోత్సహించే కొల్లాజెన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. వీటిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకొంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. దీనికోసం ఏం చేయాలంటే
Image: Pixabay.com
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాడైన కురులను బాగు చేసి అందంగా మారుస్తాయి.
Image: Pexels
తెలుగింటి వంటగదిలో ఉల్లిపాయలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉల్లి పాయలు లేకుండా తెలుగు వంటకాలు తయారుచేయరు. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లకు రక్తసరఫరాను పెంచి వాటిని బలంగా మారుస్తుంది. ఉల్లి రసం స్కాల్ప్ పై ఉన్న క్రిములను నాశనం చేస్తుంది.
Image: Pixabay
బీట్ రూట్ ఆహారంగా తీసుకోవడం ద్వారా రక్తవృద్ధి జరుగుతుంది. ఆరోగ్యపరంగానే కాదు సౌందర్యపరంగానూ బీట్ రూట్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఇవి కురులను దృఢంగా మారుస్తాయి. దీనికోసం..
అవిశె గింజల వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. కురుల ఆరోగ్యం సైతం మెరుగుపడుతుది. ముఖ్యంగా బిరుసుగా మారిన జుట్టును తిరిగి మామూలుగా మారుస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి ఏం చేయాలంటే
కూరలో కరివేపాకు అని తీసిపడేస్తాం కానీ.. దానివల్ల కురులకు చాలా మేలు జరుగుతుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా వెంట్రుకలను బలంగా తయారయ్యేలా చేస్తుంది.
పెరుగులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి కురుల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దృఢంగా, పొడవుగా అయ్యేలా చేస్తాయి. తరచూ తలకు పెరుగు ప్యాక్‌లా వేసుకోవడం ద్వారా కురులు ఒక అంగుళం మేర పొడవు పెరుగుతాయి. మరి దీనికోసం ఏం చేయాలో తెలుసా?
ఈ మధ్య కాలంలో దాదాపుగా ప్రతి కిచెన్‌లో యాపిల్ సిడర్ వెనిగర్ ఉంటోంది. దీని వల్ల కూడా ఆరోగ్యవంతమైన జుట్టును పొందవచ్చు. ఇది స్కాల్ప్ పై ఉత్పత్తి అయ్యే నూనెలను క్రమబద్ధీకరించి కురులు దృఢంగా మారేలా చేస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి ఏం చేయాలంటే..
జుట్టు ఆరోగ్యం కోసం ఏం చేయాలో మనం తెలుసుకొన్నాం. ఎలాంటి చిట్కాలు పాటించాలో కూడా తెలుసుకొన్నాం. అలాగని అన్ని సందర్భాల్లోనూ జుట్టును స్టైలింగ్ చేయకుండా అలా వదిలేయలేం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1. హీట్ ప్రొెటెక్షన్ స్ప్రే చేయకుండా హీటింగ్ టూల్స్ ఉపయోగించవద్దు. దీని వల్ల వేడికి జుట్టు పాడవకుండా ఉంటుంది.
2. బ్లోడ్రయర్ ఉపయోగించేటప్పుడు జుట్టుకి డ్రయర్కి మధ్య ఆరంగుళాల గ్యాప్ ఉండేలా జాగ్రత్తపడాలి.
3. జుట్టు తడిగా ఉన్నప్పుడు తల దువ్వుకొనే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దీనివల్ల జుట్టు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. అప్పుడప్పుడూ ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకొంటూ ఉండండి.
Images: Shutterstock, Pixaby, Pexels