శృంగార‌ంలో.. "ఫోర్ ప్లే" చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

శృంగార‌ంలో.. "ఫోర్ ప్లే" చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

లైంగికప‌ర‌మైన క‌ల‌యిక‌లో ఫోర్ ప్లేది (foreplay) ఎంత కీల‌క‌మైన పాత్రో మ‌నంద‌రికీ తెలిసిందే.. ఇది లైంగికానందాన్ని మ‌రింత పెంచ‌డ‌మే కాదు.. శృంగార‌ప‌రంగా మ‌న‌లో కోరిక‌ను మ‌రింత బ‌ల‌ప‌రుస్తుంది.


అయితే ఫోర్ ప్లేని కేవ‌లం మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఆస్వాదిస్తార‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేద‌ట‌. పురుషులు కూడా ఇష్ట‌ప‌డే కొన్ని ఫోర్ ప్లే మూవ్స్ ఉన్నాయ‌ట‌.. వాటిలో కొన్నింటి గురించి మ‌న‌మూ తెలుసుకుందాం రండి..


* పూర్తిగా తాక‌నీయండి..
శృంగారంలో పాల్గొనే స‌మ‌యంలో మ‌హిళ‌లు సిగ్గుతో ముడుచుకుపోవ‌డం స‌హ‌జ‌మే. అయితే మీ భాగ‌స్వామిని మీ శ‌రీరాన్ని పూర్తిగా తాక‌నిస్తేనే లైంగికానందం రెట్టింప‌య్యే అవ‌కాశాలున్నాయి. అంతేకాదు.. లైంగిక చ‌ర్య‌లో పాల్గొనే స‌మ‌యంలో పురుషులు ఎలాంటి ఆచ్ఛాద‌న లేని త‌న భార్య శ‌రీరాన్ని చూడాల‌ని కూడా కోరుకుంటారు. కాబ‌ట్టి ఈ విష‌యంలోనూ వారికి స‌హ‌క‌రిస్తే ఆలుమ‌గ‌లిద్ద‌రూ క‌లయిక‌ను ఆస్వాదించ‌వ‌చ్చు.


gif1


* చేతులు ఉప‌యోగించండి
శృంగారంలో పాల్గొనే స‌మ‌యంలో ప్ర‌తి చిన్న స్ప‌ర్శ కీల‌క‌మ‌నే చెప్పుకోవాలి. అయితే మీరు తాకే ప్ర‌దేశాన్ని బ‌ట్టి మీ భాగ‌స్వామితో క‌ల‌యిక‌లో పాల్గొనాల‌న్న కోరిక మ‌రింత పెరుగుతుంది. కాబ‌ట్టి లైంగిక చ‌ర్య‌కు ఉప‌క్ర‌మించ‌డం ప్రారంభించిన ద‌గ్గ‌ర్నుంచి చివ‌రి వ‌ర‌కు మీ చేతుల‌తో మీ భాగ‌స్వామి జుట్టు నిమ‌ర‌డం, బిగి కౌగిలిలో బంధించ‌డం.. మెడ‌, వీపు మీద చేతులు వేయ‌డం.. ఇలా మీకు ఏం చేయాల‌నిపిస్తే అది చేయండి. మీరు అందించే ప్ర‌తి చిన్న స్ప‌ర్శ వారికి త‌ప్ప‌కుండా న‌చ్చి తీరుతుందంటే అతిశ‌యోక్తి కాదు.


* ఫ్యాంట‌సీలు ఉన్నాయా??
ప్ర‌తిఒక్క‌రికీ శృంగారానికి సంబంధించి కొన్ని ఫ్యాంట‌సీలు ఉండ‌డం స‌హ‌జ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు కొంద‌రికి శృంగారంలో చేసే ప‌నుల గురించి మాట్లాడితే ఇష్టం.. అలాగే ఇంకొంద‌రికి కొన్ని ప్ర‌త్యేక‌మైన భంగిమ‌ల్లో సెక్స్‌లో పాల్గొన‌డ‌మంటే ఇష్టం.


అలా మీకు కూడా ఏమైనా ఫ్యాంట‌సీలు ఉంటే వాటి గురించి మీ భాగ‌స్వామితో నిస్సందేహంగా చ‌ర్చించండి. మీరిద్ద‌రూ క‌లిసి వాటిని వ‌ర్క‌వుట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ద్వారా అంతులేని ఆనందాన్ని మీ సొంతం చేసుకోవ‌చ్చు.


gif2


* ద‌గ్గ‌ర‌గా లాక్కోండి
శృంగారంలో పాల్గొనే స‌మ‌యంలో భార్య త‌న‌ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా లాక్కోవాల‌ని ప్ర‌తి భ‌ర్త ఆశ‌ప‌డుతుంటాడు. అయితే మీరు మీ భ‌ర్త‌ని అలా ద‌గ్గ‌ర‌గా లాక్కోవ‌డ‌మే కాదు.. మీ శ‌రీరాన్ని పూర్తిగా వారి స్వాధీనం చేయండి. అత‌ని న‌డుము చుట్టూ చేతులు వేసి మీ బిగి కౌగిలిలో ఇంకాస్త ఎక్కువ స‌మ‌యం వారిని బంధించేందుకు ప్ర‌య‌త్నించండి.


* సెన్సిటివ్ భాగాల గురించి మ‌ర్చిపోవ‌ద్దు
శృంగారంలో పాల్గొనేందుకు ఫోర్ల ప్లే ప్రారంభించిన త‌ర్వాత అత‌ని సెన్సిటివ్ భాగాల‌ను స్పృశించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. చెవులు, మెడ వెనుక ముద్దులు పెట్ట‌డం, చెవుల వ‌ద్ద ముద్దాడేట‌ప్పుడు మీరు చేసిన లేదా చేయాల‌నుకున్న రొమాంటిక్ ప‌నుల గురించి చిన్న‌గా ఊసులు చెప్ప‌డం.. వంటివి చేయండి. ఇవి అత‌నిలో కోరిక‌ను మ‌రింత ర‌గిలించ‌డ‌మే కాదు.. క‌ల‌యిక ప‌ట్ల మీకున్న ఆస‌క్తిని కూడా వారికి తెలియ‌జేస్తాయి. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో మేం ప్ర‌త్యేకంగా చెప్పాలా??


gif3


* కాస్త టీజ్ చేయండి
లైంగిక చ‌ర్య‌ను కూడా ఒక ప‌నిగా భావించకుండా.. దానిని వీలైనంత వ‌ర‌కు ఆస్వాదించ‌డానికి ప్ర‌య‌త్నించండి.ఈ క్ర‌మంలో మీ భాగస్వామిని బాగా ఆట‌ప‌ట్టించ‌డం లేదా ఊరించ‌డం వంటివి చేస్తూ స‌ర‌దాగా టీజ్ చేయండి. ఇవి లైంగిక క‌ల‌యిక‌లోని మ‌జాని మ‌రింత పెంచుతాయి.


* ఆక‌ట్టుకునేలా డ్యాన్స్
ఎప్పుడూ ఒకేలా సెక్స్‌లో పాల్గొంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా కాస్త భిన్న‌మైన మార్గాల‌ను కూడా అనుస‌రిస్తూ ఉండండి. వాటిలో డ్యాన్స్ కూడా ఒక‌టి. మీ భాగ‌స్వామిని ఆక‌ట్టుకునేలా లేదా వారిలో ర‌సిక‌త‌ను మ‌రింత పెంచేలా డ్యాన్స్ చేయండి.


gif4


* ఓర‌ల్ సెక్స్..
ఫోర్ ప్లేలో ఓరల్ సెక్స్ కూడా ఒక భాగ‌మే. మ‌హిళ‌లు ఎలా అయితే ఓర‌ల్ సెక్స్‌ని ఎంజాయ్ చేస్తారో.. అలాగే పురుషులు కూడా ఎంజాయ్ చేస్తారు. కాబ‌ట్టి వారి శ‌రీర భాగాల‌న్నింటినీ మృదువుగా స్పృశిస్తూ ర‌తి క్రీడ‌లో ఉన్న ఆనందాన్ని మ‌రింత ఎక్కువ‌గా పొందేందుకు ప్ర‌య‌త్నించండి.


* ఫ‌న్‌ని పెంచండి
శృంగారంలో ప్ర‌యోగాలు చేసేందుకు పురుషులు ఎప్పుడూ ముందే ఉంటారు. ముఖ్యంగా చాక్లెట్, తేనె.. వంటి ప‌దార్థాల‌ను కూడా లైంగిక క‌ల‌యికలో భాగం చేసి మ‌రింత ఆనందాన్ని పొందాల‌ని అనుకుంటారు. కాబ‌ట్టి మీరు కూడా ఈసారి అత‌ని శ‌రీరంపై చాక్లెట్ లేదా తేనె పూసి.. దాని రుచిని ఆస్వాదిస్తూ శృంగారంలో పాల్గొనండి. లేదా సింపుల్‌గా ఐస్ క్యూబ్స్ కొన్ని అత‌ని శ‌రీరంపై వేసి ఆట‌ప‌ట్టించండి. భ‌లేగా ఉంటుంది..


gif5


* ఆక‌ర్ష‌ణీయ‌మైన లోదుస్తులు..
ముందుగా మ‌నం చెప్పుకున్న‌ట్లుగానే శృంగారంలో ఎప్పుడూ ఒకేలా కాకుండా భిన్న‌మైన మార్గాలలో ప్ర‌య‌త్నిస్తూ ఉండాలి. వాటిలో ఆక‌ర్ష‌ణీయమైన లోదుస్తులు కూడా ఒక‌టి. అంద‌మైన లోదుస్తులు ధ‌రించి మీ భాగ‌స్వామి క‌ళ్ల ముందు నిల‌బ‌డి చూడండి..


GIFs: Giphy, Tumblr


ఇవి కూడా చదవండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


ఉమ్మడి కుటుంబంలో.. ఆలుమగలకు లైంగిక జీవితం కాస్త ఇబ్బందికరమేనా..?


సెక్స్‌లో పాల్గొనడం వల్ల మన ఆరోగ్యానికి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?