ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?

ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?

గత రెండేళ్లలో బాలీవుడ్‌లో(Bollywood)  జరిగిన వివాహాలు చాలామంది మనసులను దోచేస్తే.. తాము ఎంతగానో ఇష్టపడే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ వివాహం చేసుకుంటున్నారని చాలామంది అమ్మాయిలు బాధపడిన సంగతి తెలిసిందే. అనుష్క శర్మతో మొదలైన ఈ వివాహాలు సోనమ్, దీపిక, ప్రియాంక వరకూ.. ఇలా కొనసాగుతూ వచ్చాయి. ఈ బాలీవుడ్ జంటలను ఓసారి గమనిస్తే కపుల్ గోల్స్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది.


ఇతర జంటలకు తాము స్ఫూర్తిగా నిలుస్తూ అందరి ముందు తమ ప్రేమను చూపడానికి కూడా ఈ జంటలు ఏమాత్రం వెనుకాడరు. అయితే జంటలు ఎన్ని ఉన్నా.. కొన్ని మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల తమ జంట ఇలా ఉండాలని.. అలాంటి భర్త (Husband) తమకు కూడా ఉండాలని కోరుకుంటుంది. మరి, అలాంటి స్వీటెస్ట్ బాలీవుడ్ భర్తలు ఎవరు? వాళ్లు ఎందుకు అందరికీ ఆదర్శంగా మారారు? తెలుసుకుందాం రండి..


1


1. రణ్ వీర్ సింగ్


పెళ్లి కాక ముందు నుంచే రణ్ వీర్ సింగ్ దీపికపై చూపించే ప్రేమకు అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. తనలాంటి భర్త దొరికితే బాగుండని కోరుకోని అమ్మాయి మన దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా రణ్ వీర్ మాయ చేసేశాడు. దీపికకు ప్రతి విషయంలోనూ సాయం చేసే రణ్ వీర్ జనాల్లోకి వెళ్లినప్పుడు తనకు బాడీ గార్డ్‌గా మారడం, తన భార్య కోసం ప్రతి ఒక్కటీ చేయడం వంటివి అమ్మాయిలను ఆకర్షించేవి.


తాజాగా ముంబైలోని మారియట్ హోటల్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లిందీ జంట. అక్కడ దీపిక తన హై హీల్స్ విప్పి లోపలికి వెళ్లి అక్కడున్న పెద్దవాళ్లను పలకరించింది. అప్పుడు దీపిక హై హీల్స్‌ని తన చేత్తో పట్టుకొని.. ఆమెను అనుసరించాడు రణ్ వీర్. నలుగురిలో ఉన్నా.. సెలబ్రిటీ అయినా.. భార్యకోసం తను చేసిన ఈ పనికి అందరూ రణ్ వీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఇదే కాదు..ఎన్నో ఇంటర్వ్యూల్లో దీపిక గురించి రణ్ వీర్ చెప్పే మాటలు తనని ఉత్తమ భర్త అని భావించడంలో తప్పులేదని చాటుతుంది.


Source - Instagram


3 9375462


2. విరాట్ కొహ్లీ


మీకు గుర్తుందా? విరాట్ తన వెడ్డింగ్ రింగ్‌ని మెడలో గొలుసుకు లాకెట్‌లా వేసుకున్నాడు. తాను 150 పరుగులు చేసినప్పుడు ఆ విజయాన్ని భార్యకు అంకితమిస్తూ ఈ ఉంగరాన్ని ప్రపంచమంతా చూస్తుండగా ముద్దు పెట్టి తన భార్యపై తనకున్న ప్రేమను చాటాడు కొహ్లీ.


అంతేకాదు.. పెళ్లి సందర్బంగా సంగీత్ వేడుకలో అనుష్కకి ఇష్టమైన మేరే మెహబూబ్ పాటను పాడి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిన్న చిన్న పనులు చేస్తూ తన భార్యపై విరాట్ చూపించే ప్రేమకు అనుష్క మాత్రమే కాదు.. అమ్మాయిలందరూ ఫిదా అయిపోవడం ఖాయం. అప్పుడప్పుడూ తను పోస్ట్ చేసే క్యాండిడ్ ఫొటోలు వీరిద్దరి బంధం గురించి చెప్పకనే చెబుతాయి.


Source - Instagram


2


3. ఆనంద్ అహూజా


పెళ్లి తర్వాత సమానత్వాన్ని పాటించాలనుకుంటూ తన పేరు చివర భార్య పేరును చేర్చుకున్నాడు ఆనంద్ అహూజా. ఆనంద్ సోనమ్ అహూజాగా మారిన ఈ స్టార్ డిజైనర్.. తాజాగా తన స్నీకర్ స్టోర్‌లో (వెజ్ నాన్ వెజ్)  తన భార్య సోనమ్ షూలేసులు కట్టాడు ఆనంద్. ఫిలా లేటెస్ట్ మోడల్ షూలు ధరించింది సోనమ్.


ఆనంద్ మోకాళ్లపై కూర్చొని ఆ షూ లేసులు కట్టడం కేవలం వారిద్దరి ఫ్యాన్స్‌ని మాత్రమే కాదు.. అక్కడున్న మీడియా వారిని కూడా ఎంతో ఆకర్షించింది. ఇదే కాదు.. తన భార్య లుక్స్‌ని.. ఆమె చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ తనని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆనంద్. పెళ్లి తర్వాత నాలుగైదు రోజులకే తను కేన్స్‌కి వెళ్లడమే దీనికి నిదర్శనం. అంతేకాదు.. వారిద్దరి ఫొటోలను బట్టి చూస్తే ఆనంద్ కౌగిలింతల స్పెషలిస్ట్ అని కూడా అర్థమవుతుంది.


Source - Viral bhayani Instagram


 


4


4. అభిషేక్ బచ్చన్


తన భార్యను ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా అభివర్ణిస్తుంటాడు అభిషేక్. పెళ్లయి పన్నెండేళ్లయినా నిన్నమొన్న అయినట్లుగా ఉంటుంది వీరిద్దరి అనురాగం. ఐశ్వర్యపై, తన కూతురి పై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటికి ఘాటుగానే సమాధానం అందిస్తుంటాడు అభిషేక్. తన ఫేవరెట్ ఎప్పటికీ ఐశ్వర్యనే అంటూ ఎప్పటికప్పుడు తన పై ఉన్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా.. బయట అందరి ముందూ చాటుతూ తనకు దాచుకులేనంత ప్రేమ ఉందని చెబుతుంటాడు చోటా బచ్చన్.


Source - Instagram


మీ భర్త కూడా ఇలాంటివాడేనా? అయితే మీరూ తనపై ప్రేమ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా.. అందుకే చక్కటి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసి తనని సర్ ప్రైజ్ చేయండి.


 ఇవి కూడా చదవండి.


తను వచ్చేవరకూ తాళి కట్టనన్నాడు : సౌందర్యా రజనీకాంత్


మగవాళ్ల గురించి.. ఈ విషయాలు పెళ్లి తర్వాతే తెలుస్తాయి..!


"కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా.." అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?