నేటి రాశిఫ‌లాలు.. వేస్తాయి మీ భ‌విత‌కు బంగారు బాట‌లు..!

నేటి రాశిఫ‌లాలు.. వేస్తాయి మీ భ‌విత‌కు బంగారు బాట‌లు..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీ జీవితానికి ఏది మంచిదో కాస్త ఆలోచించుకోండి. మీకు అందే ఆశీర్వాదాల‌ను ఒక‌సారి గ‌మ‌నించుకోండి. అవే మీ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిపోయేలా చేస్తాయి.


వృషభం (Tarus) - మీలో కొంద‌రికి క‌ల‌ల కార‌ణంగా క‌ల‌త నిద్ర ఉండ‌వ‌చ్చు లేదా నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. మీ మ‌న‌సులో పాతుకుపోయిన కొన్ని భ‌యాలు, అభ‌ద్ర‌తాభావ‌నే దీనికి కార‌ణం. వాటిని తొల‌గించుకోండి. అందుకు ఇత‌రుల స‌హాయం తీసుకోండి.


మిథునం (Gemini) - మిమ్మ‌ల్ని ఎంత‌గానో కుదిపేస్తున్న ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే స‌ర్దుకుంటాయి. ఇప్పుడు మీపై లెక్క‌లేనంత ప్రేమ వ‌ర్షంగా కుర‌వ‌నుంది.


కర్కాటకం (Cancer) - మీరు న‌మ్మిన నిజానికి, ప్రేమ‌కు, తెలివితేట‌ల‌కు మీరు క‌ట్టుబ‌డి ఉంటారు. ఇత‌రులు చెప్పిన వాటిని గుడ్డిగా న‌మ్మ‌కండి. మీ న‌మ్మ‌కాల‌ను మార్చుకోకుండా ఎదుటివారిని గౌర‌విస్తే చాలు.


సింహం (Leo) - మీరు ఎమోష‌న‌ల్ గా ఒక వ్య‌క్తికి బాగా ద‌గ్గ‌ర‌వుతారు లేదా వారిపై ఆధార‌ప‌డ‌తారు. వారి నుంచి దూరంగా జ‌ర‌గండి. మిమ్మ‌ల్ని మీరు బ‌లంగా, ధైర్యంగా, శ‌క్తిమంతులుగా మార్చుకోండి.


క‌న్య (Virgo) - మీ మ‌న‌సులో ఏం అనుకుంటున్నారో అది దైవానికి తెలియ‌జేయండి. ప‌రిస్థితులు స‌ర్దుకుంటాయి. ఈ క్ర‌మంలో జ‌రిగేది జ‌ర‌గ‌నివ్వండి.


తుల (Libra) - మీ మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న‌లు మిమ్మ‌ల్ని స‌రైన దారిలోనే న‌డిపిస్తున్నాయి. కాబ‌ట్టి మీరు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌ర‌ని న‌మ్మ‌కండి. మీ ఆలోచ‌న‌లు, సంకల్పం చాలా బ‌ల‌మైన‌వి.


వృశ్చికం (Scorpio) - మీ అభిరుచి పై ఉన్న ఆస‌క్తితో దాని గురించి ప‌ని చేయ‌డం ప్రారంభిస్తారు లేదా ఇప్ప‌టివర‌కు చేసిన దానికి భిన్నంగా ఏమైనా చేయాల‌ని మీ మ‌న‌సులో అనిపిస్తుండ‌వ‌చ్చు. మీరెంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవండి.


ధనుస్సు (Saggitarius) - మిమ్మ‌ల్ని బాధిస్తోన్న స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే ప‌రిష్కార‌మ‌వుతాయి. లేదా ఇప్పుడు ప‌రిష్కార‌ద‌శ‌లోనే ఉండ‌చ్చు. కాబ‌ట్టి మీ జీవితంలో ఇప్పుడు మీరు మ‌రొక ద‌శ‌ను ప్రారంభించ‌వ‌చ్చు.


మకరం (Capricorn) - మీ జీవితాన్ని, అందులో ఉన్న అనుబంధాల‌ను హ్యాండిల్ చేసే క్ర‌మంలో మీ మ‌న‌సు చెప్పే మాట‌కు ప్రాధాన్యం ఇవ్వండి. దానిని అనుస‌రిస్తూనే అంద‌రితో ఐక్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నించండి.


కుంభం (Aquarius) - జీవితంలో ఏం జ‌రిగినా దానికి ఒక కార‌ణం అంటూ ఉంటుంది. వాటిని గ‌మ‌నించుకుంటూ జాగ్ర‌త్త‌గా ముంద‌డుగు వేస్తే ప్రశాంతంగా ఉండ‌వ‌చ్చు. నిదానంగా ఉండండి.


మీనం (Pisces) - మీరు ఎప్ప‌ట్నుంచో ఎదురుచూస్తున్న స‌మ‌యం త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇప్ప‌టివ‌ర‌కు మీరు చేసిన వెయింటింగ్, ప్ర‌య‌త్నాలు, ఒత్తిడి.. అన్నింటికీ చెక్ ప‌డ‌నుంది. మీ సంతోష‌క‌ర‌మైన స‌మ‌యం ప్రారంభం కానుంది.


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు గురించి తెలుసుకోండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!