నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భవిష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భవిష్య‌త్తు గురించి తెలుసుకోండి..!

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) - మీ జీవితం అంతా సంతోషంతో నిండి ఉంటుంది. ఈ రోజు మీరు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా త‌ప్ప‌కుండా ఆనందంగా మాత్రం ఉంటారు. మీ చుట్టూ ఉన్న‌వారిలో కూడా సంతోషాన్ని క‌నుక్కునే ప్ర‌య‌త్నం చేయండి.


వృషభం (Tarus) - మీరు ఎంత జాగ్ర‌త్త‌గా ఆలోచించి ప్ర‌ణాళిక రచించినా.. చివ‌రి నిమిషంలో అందులో మార్పులు చేయ‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. ఈ రోజు మీకు ఎదుర‌య్యే కొన్ని సంఘ‌ట‌న‌లు మీకు అద్భుతాల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేస్తాయి.


మిథునం (Gemini) - మీరు సాధించాల‌నుకుంటున్న ల‌క్ష్యం విష‌యంలో.. మీ ప్ర‌యాణం ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో ఒక్క‌సారి స‌రిచూసుకోండి. దీని వ‌ల్ల మీ లోపాలు కూడా మీకు తెలుస్తాయి. ఫ‌లితంగా వాటిని స‌రిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే మీ జీవిత‌మంతా ఆనంద‌మ‌యం చేసుకోవ‌చ్చు.


కర్కాటకం (Cancer) - మీకు ఎప్పుడూ ఏది కావాలో అది దొర‌క‌క‌పోవ‌చ్చు. కానీ మీకు ఏది అవ‌స‌ర‌మో అది త‌ప్ప‌కుండా దొరుకుతుంది. కాబ‌ట్టి నిరాశ‌లో కూరుకుపోకుండా పాజిటివిటీతో ముందడుగు వేయండి.


సింహం (Leo) - మిమ్మ‌ల్ని బాధిస్తోన్న స‌మ‌స్య‌ల‌పైనే మీరు పూర్తి దృష్టి పెడుతున్నారు. కానీ మీ సృజ‌నాత్మ‌క‌త‌ను ఉప‌యోగిస్తే వాటిని ఇట్టే ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. సానుకూల దృక్ప‌థంతో ధైర్యంగా ముందుకు వెళ్లండి.


క‌న్య (Virgo) - ప్ర‌స్తుతం మీరు ఆందోళ‌న‌లో ఉన్నారు. మీ మ‌న‌సు ఏం చెబుతోందో ఒక్క‌సారి వినండి. అది చెప్పిన‌ట్లుగానే న‌డుచుకొని ఇప్పుడున్న ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నించండి.


తుల (Libra) - ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా, ఆతురుత‌గా ఉంటారు. మీ జీవితానికి మంచి జ‌రిగేలా చేసే కార్య‌క‌లాపాల్లో పాల్గొంటారు. గ‌తాన్ని విడిచిపెట్టిన‌ప్పుడే భ‌విష్య‌త్తు గురించి మ‌న‌కు ఆలోచ‌న వ‌స్తుంద‌ని గుర్తుంచుకోండి.


వృశ్చికం (Scorpio) - మీ విష‌యంలో జ‌రిగే ప్ర‌తి చిన్న సంఘ‌ట‌న‌పై కూడా బాగా దృష్టి పెట్టండి. ప్ర‌తి అంశాన్ని నిశితంగా ప‌రిశీలించండి. ఇత‌రుల్లో భ‌యం పోగొట్టండి. అలాగే చుట్టుప‌క్క‌ల వారికి స‌హాయం చేయండి.


ధనుస్సు (Saggitarius) - మీకున్న ల‌క్ష్యాల ప‌ట్ల మీరు ఒక స్ప‌ష్ట‌త క‌లిగి ఉండ‌డం చాలా అవ‌స‌రం. అప్పుడే వాటి గురించి ఈ ప్ర‌పంచానికి మీరు ధైర్యంగా చెప్ప‌గ‌ల‌రు. మీపై మీరు పూర్తి న‌మ్మ‌కం ఉంచితే అనుకున్న‌ది సాధించ‌డం క‌ష్ట‌మేమీ కాదు.


మకరం (Capricorn) - మీ జీవితంలో మీరు ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్న మార్పులు చేసుకోవ‌డానికి ఇది స‌మ‌యం. పాత ప‌ద్ధ‌తులు లేదా ధోర‌ణుల్లో ఆలోచించ‌డం ఇక‌నైనా ఆపండి. సంతోషాన్నిచ్చే మార్పుల‌కు ఆహ్వానం ప‌ల‌కండి.


కుంభం (Aquarius) - మాన‌సికంగా మిమ్మ‌ల్ని మీరు ప‌రిశుభ్రం చేసుకోవాల్సిన స‌మ‌యం ఇది. మీ మ‌న‌సులో ఏమైనా నెగెటివ్ ఆలోచ‌న‌లు ఉంటే వెంట‌నే వాటిని తొల‌గించుకోండి. మీ ఆలోచ‌న‌లు, మ‌న‌సుని పాజిటివిటీ వైపు మ‌ళ్లించండి.


మీనం (Pisces) - మీ చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌ను చూసి గంద‌ర‌గోళానికి లోన‌వ్వ‌కండి. అవి త్వ‌ర‌లోనే మార‌తాయి. ఏ విష‌యంలోనైనా మీ మ‌న‌సులో ఉన్న నెగెటివ్ భావ‌న‌లు తొల‌గించుకున్న త‌ర్వాతే ముంద‌డుగు వేయండి. అంద‌రికీ ప్రేమ‌ను పంచండి.


ఇవి కూడా చ‌ద‌వండి


 మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?


నేటి రాశిఫ‌లాలు చ‌ద‌వండి.. మీ భ‌విష్య‌త్తు ఎలా ఉందో తెలుసుకోండి..!