ADVERTISEMENT
home / సౌందర్యం
సులభమైన పద్ధతిలో.. ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు..!

సులభమైన పద్ధతిలో.. ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు..!

అమ్మాయిలు కచ్చితంగా ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో లిప్ బామ్ (lip balm) కూడా ఒకటి. చెప్పాలంటే.. లిప్ బామ్ ని ఎప్పుడూ తమ వెంటే ఉంచుకొంటారు అమ్మాయిలు. పెదవులు పొడిగా మారాయనిపించిన ప్రతిసారి లిప్ బామ్ అప్లై చేసుకొంటూ ఉంటారు. బ్యూటీ కిట్‌లో ప్రత్యేకమనిపించే ఈ లిప్ బామ్‌ను మన చేతులతో మనమే తయారుచేసుకొంటే ఇంకా బాగుంటుంది కదా. నచ్చిన ఫ్లేవర్లో పెదవుల అందాన్ని మరింత పెంచే లిప్ బామ్‌ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ కిరాణా దుకాణాల్లోనూ, సూపర్ మార్కెట్స్‌లోనూ సులభంగా లభ్యమవుతాయి. ఇంకెందుకాలస్యం.. హోమ్మేడ్ లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొందాం.

చాకో మింట్ లిప్ బామ్

1-homemade-lip-balm

ADVERTISEMENT

ఈ హోమ్ మేడ్ లిప్ బామ్ చాక్లెట్ పరిమళాలను వెదజల్లడం మాత్రమే కాదు.. పెదవులను అందంగా కనిపించేలా కూడా చేస్తుంది. ఈ లిప్ బామ్ ఎలా తయారు చేయాలో తెలుసుకొందామా..

స్టెప్ 1: డబుల్ బాయిలర్లో టేబుల్ స్పూన్ షియా, కొకొవా బటర్ తీసుకోవాలి.

స్టెప్ 2: సన్నని సెగ మీద 20 నిమిషాల పాటు వేడిచేయాలి.

స్టెప్ 3: టీస్పూన్ కొబ్బరి నూనె, కొద్దిగా బీస్ వ్యాక్స్ కూడా కలపాలి.

ADVERTISEMENT

స్టెప్ 4: ఈ పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసేలా టూత్ పిక్‌తో కలపాలి.

స్టెప్ 5: స్టవ్ ఆఫ్ చేసి నిమిషం ఆగిన తర్వాత.. రెండు చుక్కల తేనె, కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్, కొద్దిగా కొకొవా పౌడర్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఖాళీ డబ్బా లేదా లిప్ స్టిక్ ట్యూబ్‌లో వేయాలి. 3 నుంచి 4 గంటల తర్వాత చాకో మింట్ లిప్ బామ్ వాడటానికి సిద్ధంగా ఉంటుంది.

ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఇలా (Homemade Body Scrubs In Telugu)

ADVERTISEMENT

లావెండర్ లిప్ బామ్

2-homemade-lip-balm

లావెండర్ వెదజల్లే సువాసనలను ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? దీని వల్ల సౌందర్యపరమైన ప్రయోజనాలు సైతం ఉన్నాయి. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు. డ్రై లిప్స్ సమస్య ఉన్నవారు లావెండర్ నూనెకు తేనె కలిపి తయారు చేసిన లిప్ బామ్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

స్టెప్ 1: గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, కొద్దిగా బీస్ వ్యాక్స్, తేనె వేసి సన్నని సెగపై పది నిమిషాలు వేడి చేయాలి.

ADVERTISEMENT

స్టెప్ 2: స్టవ్ ఆఫ్ చేసి రెండు చుక్కల లావెండర్ ఆయిల్, కొద్దిగా కొకొవా పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్ కలపాలి.

స్టెప్ 3: చివరిగా మరోసారి కొద్దిగా తేనె కలిపి.. లిప్ బామ్ కంటెయినర్‌లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి. రెండు నుంచి మూడు గంటల తర్వాత ఈ లిప్ బామ్‌ను ఉపయోగించడానికి వీలుగా తయారవుతుంది.

గ్రీన్ టీ లిప్ బామ్

3-homemade-lip-balm

ADVERTISEMENT

గ్రీన్ టీతో మనం తయారు చేసిన లిప్ బామ్‌ను.. లిప్ గ్లాస్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది పెదవులను అందంగా మార్చేస్తుంది. ఈ లిప్ బామ్ తయారుచేయడం చాలా సులభం.

స్టెప్ 1: డబుల్ బాయిలర్లో కొబ్బరి నూనె, బీస్ వ్యాక్స్, గ్రీన్ టీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ వేసి ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి.

స్టెప్ 2: ఆ తర్వాత తేనె, అవకాడో నూనె సైతం కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఖాళీ లిప్ బామ్ కంటెయినర్లో వేయాలి. ఐదు గంటల తర్వాత ఈ లిప్ బామ్ ఉపయోగించడానికి వీలుగా తయారవుతుంది.

ADVERTISEMENT

స్వీట్ ఆరెంజ్ లిప్ బామ్

4-homemade-lip-balm

సాధారణంగా స్ట్రాబెర్రీ, వెనీలా, మింట్ లిప్ బామ్స్ మార్కెట్లో విరివిగా లభిస్తాయి కానీ ఆరెంజ్ లిప్ బామ్ దొరకడం కష్టమే. మీరు కూడా స్వీట్ ఆరెంజ్ లిప్ బామ్ కోసం చూస్తున్నారా? అది మీకు మార్కెట్లో దొరకలేదా? అయితే ఇంట్లోనే  దాన్ని తయారుచేసుకోండి. స్వీట్ ఆరెంజ్ లిప్ బామ్‌ను ఎలా తయారుచేసుకోవాలంటే..

స్టెప్ 1: పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ నూనె, కొద్దిగా బీస్ వ్యాక్స్, చెంచా తేనె వేసి టూత్ పిక్ లేదా చాప్ స్టిక్ సాయంతో బాగా కలపాలి.

ADVERTISEMENT

స్టెప్ 2: మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మిశ్రమంలో 15 నుంచి 20 చుక్కల ఆరెంజ్ ఎస్సెన్షియల్ నూనె కలపాలి. 

స్టెప్ 3: ఈ మిశ్రమాన్ని లిప్ బామ్ కంటెయినర్లో వేసి చల్లారనివ్వాలి. నాలుగ్గంటల తర్వాత స్వీట్ ఆరెంజ్ లిప్ బామ్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది.

Images: Instagram

ఇవి కూడా చదవండి:

ADVERTISEMENT

ఈ ఆర్గానిక్ లిప్ బామ్.. మీ పెదవులను సాఫ్ట్‌గా మార్చేస్తుంది..

క‌ళ్ల కింది న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను.. రెడ్ లిప్ స్టిక్‌తో క‌వర్ చేసేద్దాం..!

ఈ స‌మ్మ‌ర్ హెయిర్ స్టైల్స్.. మీరూ ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి..

17 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT