ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

కొంతమందిని చూస్తే ‘బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్’లా ఉన్నారనిపిస్తుంది. నేను ఎనర్జీ సేవింగ్ మోడ్‌లో ఉన్నానని కవర్ చేసుకొన్నా.. వారిపై ఉన్న బద్ధకరత్న అనే ముద్ర మాత్రం చెరిగిపోదు. ఇలాంటి వారు మన చుట్టూ చాలామందే ఉంటారు.


అలాంటివారిని మన పెద్దలు ‘ఏ నక్షత్రంలో పుట్టావు?’ అని ఎగతాళి చేస్తుంటారు. అది సరదాకే అంటున్నట్టు మనకి అనిపిస్తుంది. కానీ.. నిజానికి కొన్ని రాశులకు(Zodiac sign) చెందినవారికి చాలా బద్ధకం ఎక్కువట.


ఇలాంటి వారు కార్యాలయాల్లోనూ కనిపిస్తుంటారు. రోజులో చాలా తక్కువ సమయమే పని చేసి పూర్తయిందనిపిస్తుంటారు. వాస్తవానికి వీరు పనులు పూర్తి చేయడానికి షార్ట్ కట్స్ వాడుతుంటారు. అందులోనూ కొన్ని రాశులకు చెందినవారు చాలా బద్ధకంగా ఉంటారట. ఈ క్రమంలో మనం కూడా అసలు ఏ రాశి వారు ఇలా ప్రవర్తిస్తారు? వారు అలా సోమరితనంగా ఉండటానికి గల కారణమేదో తెలుసుకొందాం.


ధనస్సు


1-laziest-zodiac-sign


నిజానికి ధనూరాశి వారు చాలా యాక్టివ్‌గానే ఉంటారు. కానీ పని చేయాల్సి వచ్చేసరికి మాత్రం తప్పించుకోవాలని చూస్తుంటారు. పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కమిట్మెంట్ ఫోబియా కారణంగా ఏ కార్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు.


కుంభం


2-laziest-zodiac-sign


కుంభరాశి వారు చాలా తెలివైన వారు. కానీ పని స్వీకరించే విషయంలో మాత్రం వెనక్కి ఉంటారు. కాదూ.. కూడదు అని పని అప్పగిస్తే మాత్రం చాలా డల్‌గా అయిపోతారు. కొన్నిసార్లు అప్పగించిన పని చాలా ఉత్సాహంగానే..  ప్రారంభించినప్పటికీ ఉన్నట్టుండి మధ్యలో వారి వేగం తగ్గిపోతుంది.  తమ సామర్థ్యానికి తగిన పని కాదనే భావనతోనే ఇలా చేస్తుంటారు.


వృషభం


3-laziest-zodiac-sign


వృషభ రాశికి చెందినవారు చాలా శక్తిమంతులు. కానీ వీరు కష్టపడటానికి ఇష్టపడరు. వీలైనంతవరకు సౌకర్యవంతమైన జీవితం గడపడానికేే ఇష్టపడుతుంటారు. కోరుకున్న లక్ష్యాన్ని సాధించగానే రిలాక్సయిపోతారు. ఆ తర్వాతి నుంచి కష్టపడటం కంటే హాయిగా గడపడానికే ప్రాధాన్యమిస్తారు.


సింహం


4-laziest-zodiac-sign


సింహరాశి వారు ఎప్పుడూ అందరి చూపూ తమ మీదే ఉండాలని కోరుకొంటారు. అందరిలాగా బ్రతకడానికి కూడా ఇష్టపడరు. ఈ రాశికి చెందిన వారు ఇతర వ్యవహారాల్లో ముందంజలో ఉంటారు.. కానీ అసలు పని విషయానికి వచ్చేసరికి వెనకబడి ఉంటారు. దీనికి కారణం ఇతరుల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడమే. అయితే వారు దాన్ని ఏదో ఒక మాయ చేసి మాటల గారడీతో కప్పి ఉంచుతారు. చెప్పాలంటే వీరు సరదాగా గడపడానికే తమ తెలివితేటలను ఉపయోగిస్తుంటారు.


మీనం


5-laziest-zodiac-sign


ఈ రాశికి చెందినవారు చాలా చురుకుగా ఉండాలనుకొంటారు. కానీ వారికి ఎదురయ్యే వివిధ రకాల సంఘటనల కారణంగా వారిలోని చురుకుదనం తగ్గిపోతుంది. మానసికంగా తగిలిన గాయాల నుంచి కోలుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది. ఊహల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. చాలా సందర్భాల్లో తాము వేగవంతంగా పని చేయలేకపోవడానికి తమను బాధించే పరిస్థితులే కారణమని చెబుతూ ఉంటారు. అంతే తప్ప ఊహాలోకంలో విహరిస్తున్నామనే విషయాన్ని దాచి పెడుతుంటారు.


కర్కాటకం


6-laziest-zodiac-sign


పని ప్రదేశాల్లో ఈ రాశి వారి ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటుంది. వారు పని చేయలేకపోవడానికి వారి సోమరితనం కారణమా? లేదా నెమ్మదిగా పనిచేస్తారా? అనేది ఓ పట్టాన తెలీదు. వారి పని సామర్థ్యాన్ని వారి మానసిక స్థితి ప్రభావితం చేస్తుంది. మూడ్ బాగుంటే కాస్త పనిచేస్తారు. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంటుంది. ఆఫీసు కంటే ఇల్లే తమకు సౌకర్యవంతంగా ఉందని వీరు భావిస్తుంటారు.


Running Images: Pixabay.com


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చుఅద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.