శృంగారం జరిపే సమయంలో మెద‌డులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో తెలుసా..?

 శృంగారం జరిపే సమయంలో మెద‌డులో ఎలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తాయో తెలుసా..?

శృంగారం (sex) కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఎంజాయ్ చేసేవారు ఉన్నట్టుండి తమ ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. శరీరం తన పని తాను చేసుకొంటూ వెళుతుంటే మనసు మాత్రం మరో లోకంలో విహరిస్తూ ఉంటుంది. తమకెదురైన ఇలాంటి పరిస్థితి గురించి కొందరు మహిళలు తమ మనసులో దాచుకొన్న విషయాలను బయటపెట్టారు. ఆ సంగతులు ప్రత్యేకంగా మీ కోసం..


సమయాన్ని ఉపయోగించుకోవడం తప్పు కాదుగా..


నేను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తాను. కానీ అది నా భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నాకు బోర్ కొడుతుంది. అలాంటి సమయంలో నా మనసు ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటుంది. నేను చాలా ఆర్గనైజ్డ్ పర్సన్ ను. ప్రతి దానికి నేను ఓ లిస్ట్ మెయింటైన్ చేస్తుంటాను. ఆ సమయంలో నేను ఆ లిస్ట్ లో చెక్ చేయాల్సిన విషయాల గురించి ఆలోచిస్తుంటాను. సమయాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు కదా..తర్వాతి రోజు గురించి ఆలోచిస్తా


శృంగారాన్ని ఆస్వాదించడమనేది పూర్తిగా ఆ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా బాగుందనిపించిన సెక్స్ కొన్నిసార్లు నచ్చదు. అలాంటి సందర్భాలు నాక్కూడా ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నేను తర్వాతి రోజు ఏం చేయాలో ఆలోచించేదాన్ని. నాకు మాత్రం ఇలాంటి ఓ సంఘటన బాగా గుర్తుండిపోయింది. ఒకసారి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ‘ఇక ఆపు ఏదైనా తిందాం’ అన్నా. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అతడు నాకు ఎక్స్ ఎందుకు అయ్యాడో?


giphy %2830%29


నేనిప్పుడు ఎలా ఉన్నాను


లైంగిక చర్య జరుపుతున్న సమయంలో నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ  నేనిప్పుడు ఎలా కనిపిస్తాననే ఆలోచనే ఎక్కువ సార్లు వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.


శరీరం నుంచి దుర్వాసన రావడం లేదు కదా..!


శృంగారంలో పాల్గొనే సమయంలో చాలా ఆలోచిస్తాను. అందులో కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని చాలా ఇబ్బందికరమైనవి ఉంటాయి. ‘అతడికి నేను నచ్చానా?’,  ‘నా శరీరం నుంచి దుర్వాసన రావడం లేదు కదా?’ అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను. సెక్స్ నేను బాగా ఆస్వాదించే సమయంలో నా మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు రావు.


డబుల్ చిన్ కనిపిస్తోందా?


సెక్స్ లో పాల్గొనే సమయంలో నా మైండ్ చాలా కాన్సియస్ గా ఉంటాను. ముఖ్యంగా నా డబుల్ చిన్ గురించే ఎక్కువగా థింక్ చేస్తాను. ఇప్పుడు అది కనిపిస్తోందా? అని నా మెదడు నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు విషయం కంటే ఇదే నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది.


giphy %2833%29


దానికోసం నేనేమైనా చెయ్యాలా?


శృంగారం చాలా బాగున్నప్పుడు అంటే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నప్పుడు నా మనసులోనూ మెదడులోనూ అసలు ఏ ఆలోచనా రాదు. దాన్ని ఆస్వాదిస్తానంతే. కొన్నిసార్లు ఏదో నామమాత్రంగా దాన్ని కానిచ్చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో చాలా భిన్నమైన ఆలోచనలు వస్తాయి. అవి కూడా సెక్స్ కి సంబంధించినవే. నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. దానికోసం నేనేమైనా చెయ్యాలా? అని ఆలోచిస్తా.


ఆర్గాజమ్ కంటే ఏం చేయాలనే ఆలోచనే ఎక్కువ


నా ఆలోచన ఒకదాన్నుంచి మరో దానికి త్వరగా మారిపోతుంటుంది. కాబట్టి సెక్స్ లో పాల్గొనే సమయంలో సైతం నేను వేర్వేరు విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. గతంలో నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతనితో సెక్స్ లో పాల్గొన్న చాలా సందర్భాల్లో ‘దీనికి బదులు ఓ వైబ్రేటర్ కొనుక్కొంటే బాగుండు’ అనిపించేది. అతనితో శృంగారంలో పాల్గొనే సమయంలో ఇంట్లోకి ఏం వస్తువులు తీసుకెళ్లాలి? కూరగాయలు ఏం కొనాలి? ఎలాంటి డ్రస్ కొనుక్కొంటే బాగుంటుంది అని ఆలోచించేదాన్ని.


GIFs Source: Giphy


ఇవి కూడా చదవండి


ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?


మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే.. మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే అర్థం..!


ఓ నిర్ణయానికి వచ్చేముందు.. మీ బాయ్ ఫ్రెండ్‌ను ఈ ప్రశ్నలు అడగండి