ప్యాంట్ సూట్స్‌తో అదిరిపోయే లుక్.. మీ సొంతం ఇలా..!

ప్యాంట్ సూట్స్‌తో అదిరిపోయే లుక్.. మీ సొంతం ఇలా..!

ఈ మ‌ధ్య ప్యాంట్ సూట్స్ (Pant suit) ట్రెండ్‌కు బాగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సెల‌బ్రిటీలు సైతం సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుకొని ప్రైవేట్ ప్రొగ్రాంల వ‌ర‌కు వీటికే ఓటేస్తున్నారు. ఎందుకో మీకు తెలుసా?? ఓ వైపు సౌక‌ర్య‌వంతంగా అనిపిస్తూనే మ‌రోవైపు మ‌న‌ల్ని హుందాగా క‌నిపించేలా చేయ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌. ముఖ్యంగా ఆఫీసులో జ‌రిగే ముఖ్య‌మైన బోర్డ్ స‌మావేశాలు, పార్టీలు.. మొద‌లైన వాటికి ఇవి చ‌క్క‌ని ఎంపిక‌. మ‌రి, ఎంత‌గానో పాపులారిటీ సంపాదించి ట్రెండింగ్ ఫ్యాష‌న్స్ లో స్థానం సంపాదించుకున్న ఈ ట్రెండ్‌ని ఎలా ఫాలో అవ్వాలో మ‌న‌మూ ఓసారి తెలుసుకుందామా..
 

 

 


View this post on Instagram


@aditiraohydari in @thejodilife ❤️❤️ Styled by @sanamratansi @style.cell Assisted by @nikhitaniranjan @alishabudhrani


A post shared by Sanam Ratansi (@sanamratansi) on
ర‌క‌ర‌కాల డిజైన్స్..
సూట్స్ అన‌గానే కేవ‌లం ప్లెయిన్ క‌ల‌ర్స్‌తో ఉన్న అవుట్ ఫిట్స్ మాత్ర‌మే చాలామందికి గుర్తొస్తాయి. కానీ ప్ర‌స్తుతం వ‌స్తోన్న సూట్స్ ఇందుకు భిన్నం. ఫ్లోర‌ల్, జామెట్రిక్, ప్రింటెడ్.. ఇలా ఎన్నో డిజైన్ల‌లో ఇవి ల‌భ్య‌మ‌వుతున్నాయి. అంతేకాదు.. ఆస‌క్తి ఉన్న‌వారు వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా ధ‌రించ‌వ‌చ్చు. అంటే.. మీ అవుట్ ఫిట్స్‌తోనే మీ క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శించవ‌చ్చ‌న్న‌మాట‌!

క‌ల‌ర్ కాంబినేష‌న్స్..
ప్యాంట్ సూట్స్‌లో కొన్ని మోనోక్రోమ్ త‌ర‌హాలో ఒకే రంగులో ల‌భ్య‌మ‌వుతుంటే.. ఇంకొన్ని రెండు లేదా మూడు రంగుల కాంబినేష‌న్‌లో కూడా లభ్య‌మ‌వుతున్నాయి. అయితే వీటిలో ఏది ఎంచుకోవాల‌న్నా.. అది మీ చ‌ర్మ‌ఛాయ‌కు న‌ప్పుతుందో లేదో ముందుగా స‌రిచూసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. లేదంటే అంద‌మైన అవుట్ ఫిట్ వేసుకున్నా అది మీ లుక్‌ని ప్రభావితం చేయలేదనే చెప్పాలి.

యాక్సెస‌రీస్..
ప్యాంట్ సూట్స్ ధ‌రించిన‌ప్ప‌డు యాక్సెస‌రీస్ వీలైనంత త‌క్కువ‌గానే ధ‌రించాలి. సింపుల్‌గా ఉండే చెయిన్, బ్రేస్ లెట్.. వంటివి పెట్టుకొని డ్ర‌స్‌కు త‌గిన విధంగా మేక‌ప్, హెయిర్ స్టైల్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పాదాల‌కు స్నీక‌ర్స్ లేదా షూస్ వంటివి వేసుకుంటే బాగుంటుంది.


ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ పాటిస్తూ ప్యాంట్ సూట్స్‌లో మెరిసిన కొంద‌రు అందాల భామ‌ల‌ను చూస్తే ఈ ఫ్యాష‌న్‌ను ఫాలో అవ్వ‌డం ఎంత సుల‌భ‌మో మీకే అర్థ‌మైపోతుంది.

త‌మ‌న్నా ధరించిన బ్రైట్ క‌ల‌ర్డ్ జామెట్రిక‌ల్ ప్యాంట్ సూట్ చూశారా? ఎలాంటి యాక్సెస‌రీస్ లేక‌పోయినా సింపుల్‌గా బోల్డ్ లిప్స్‌తో అందంగా మెరిసిపోతోంది క‌దూ!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ స‌మంతను చూడండి. స్ట్రైప్డ్ ప్యాంట్ సూట్‌లో ఎంత చ‌క్క‌గా ఉందో! మెడ‌కు చిన్న చోక‌ర్ పెట్టుకున్న సామ్ పోనీ టెయిల్‌తో హుందాగా క‌నిపిస్తుంది క‌దూ!

సూట్ అంటే కేవ‌లం నార్మ‌ల్ బాట‌మ్ మాత్ర‌మే కాదు.. పలాజో బాట‌మ్ కూడా ధ‌రించ‌వ‌చ్చు. రెడ్ క‌ల‌ర్ ప‌లాజో సూట్‌లో ఉన్న హాట్ బ్యూటీ ర‌కుల్‌ని చూస్తే మీరూ ఈ మాట నిజ‌మే అంటారు.
 

 

 


View this post on Instagram


"Going back in time 💃🏻”


A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on
తెలుపు రంగులో ఏ త‌ర‌హా అవుట్ ఫిట్స్ ధ‌రించినా మ‌న లుక్ ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తుంది. ఆ రంగులో ఉన్న మ‌హ‌త్యం అలాంటిది మ‌రి..! ర‌ష్మిక ధ‌రించిన తెలుపు రంగు సూట్ చూస్తే మీరూ ఆమె అందానికి ఫ్లాట్ అయిపోవాల్సిందే!

ప్ర‌గ్యా జైస్వాల్.. టాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ధ‌రించిన సూట్ చూడండి. ప్ర‌కాశ‌వంత‌మైన ప‌సుపు రంగులో ఎలాంటి యాక్సెస‌రీలు అవ‌స‌రం లేకుండానే మిల‌మిలా మెరిసిపోతోంది క‌దూ!


ఇంకేం ఆలోచిస్తున్నారు.. మీరు కూడా ప్యాంట్ సూట్ ఫ్యాష‌న్ ఫాలో అయ్యేందుకు ర‌డీ అయిపోండి మ‌రి..! మీ క్రియేటివిటీతో ఈ ట్రెండ్‌లో మ‌రిన్ని కొత్త డిజైన్స్ సృష్టించి అంద‌రితోనూ ట్రెండ్ సెట్ట‌ర్ అనిపించుకోండి.


ఇవి కూడా చ‌ద‌వండి


స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!


కాలేజీ అమ్మాయిల‌కు ప్రత్యేకం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్స్..!


స్టైలిష్‌గా క‌నిపించాలంటే.. ఈ బేసిక్ ఫ్యాష‌న్ రూల్స్ ఫాలో కావాల్సిందే!